Wednesday, July 22, 2026
HomeLATESTAkhil Akkineni:అఖిల్‌ ని జైనబ్ అలా పిలుస్తుందా..? ముద్దు పేర్లు భలే వెరైటీగా ఉన్నాయే..!

Akhil Akkineni:అఖిల్‌ ని జైనబ్ అలా పిలుస్తుందా..? ముద్దు పేర్లు భలే వెరైటీగా ఉన్నాయే..!

Akhil Akkineni:'లెనిన్' సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న అక్కినేని అఖిల్ తన భార్య జైనబ్‌తో ఉన్న అనుబంధంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఒకరినొకరు ఏ స్పెషల్ నిక్‌నేమ్స్‌తో పిలుచుకుంటారో చెప్పి అభిమానులను ఆకట్టుకున్నారు.

on
- Advertisement -banner Ad

Akhil Akkineni:అక్కినేని అఖిల్ తాజాగా నటించిన సినిమా ‘లెనిన్’. ఈ సినిమా జూలై 10వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకున్న అఖిల్, ఈ సినిమాతోనే మళ్లీ మంచి హిట్ అందుకోవడానికి పక్కాగా ముందుకు వస్తున్నాడు. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రూరల్ లవ్ స్టోరీ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)నటించడం సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పాలి. భాగ్యశ్రీ బోర్సే కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమా ద్వారా ఆమె మంచి హిట్ అందుకోవడమే కాకుండా, అఖిల్‌కు కూడా సూపర్ హిట్ దక్కిస్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. దీనికి తోడు ప్రమోషన్స్ కూడా బాగా నిర్వహిస్తున్నారు మూవీ టీమ్. ఎక్కడా హంగు ఆర్భాటాలు లేకుండా, సినిమాలో ఏది ఉందో అదే చూపిస్తూ సింపుల్‌గా, రియలిస్టిక్‌గా ప్రమోషన్స్ చేస్తూ ఉండడంతో ‘లెనిన్’పై మంచి బజ్ ఏర్పడింది.

ఇంటర్వ్యూలో అఖిల్ ఆసక్తికర వ్యాఖ్యలు:

‘లెనిన్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అక్కినేని అఖిల్(Akhil Akkineni) తాజాగా ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం, సినీ కెరీర్‌తో పాటు భవిష్యత్ ప్రాజెక్టులపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -
Advertisement

also read:Niharika NM: స్టన్నింగ్ లుక్ లో నిహారిక కొత్త లుక్!

భార్య ఏమని పిలుస్తుందంటే:

ఇంటర్వ్యూలో అఖిల్ భార్య జైనబ్(Zainab) ప్రస్తావన వచ్చింది. దీంతో హోస్ట్, “మిమ్మల్ని మీ భార్య ఏమని పిలుస్తుంది?” అని అడగ్గా అఖిల్ సిగ్గుపడిపోయాడు. “ప్రస్తుతానికి ‘లెనిన్’ అంటుంది” అంటూ సేఫ్ ఆన్సర్ ఇచ్చాడు. అయితే యాంకర్ ఇంకొంచెం ముందుకు వెళుతూ, “అలా కాదు… పర్సనల్‌గా ముద్దుగా ఏమని పిలుస్తుంది?” అని ప్రశ్నించారు. దీంతో అఖిల్ ఇక తప్పించుకోలేక, “మా” అని సింపుల్‌గా పిలుస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు.

- Advertisement -
Advertisement

also read:Dhanush: రాజకీయ ఎంట్రీ ఇస్తున్న హీరో ధనుష్.. జెండా వైరల్!

భార్యను ‘బంగారం’ అని పిలిచే అఖిల్:

ఇదే సమయంలో తాను భార్యను ఏమని పిలుస్తాడో కూడా చెప్పుకొచ్చాడు. అది విని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అఖిల్ తన భార్యను ముద్దుగా “బంగారం” అని పిలుస్తాడన్న విషయాన్ని బయటపెట్టాడు. ఇది చెప్పేటప్పుడు అఖిల్ తెగ సిగ్గుపడిపోయాడు. దీంతో సోషల్ మీడియాలో అఖిల్, జైనబ్ పేర్లు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఎప్పుడూ సింపుల్‌గా కనిపించే అఖిల్ ఇంత రొమాంటిక్‌గా భార్యను “బంగారం” అని పిలుస్తాడా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అలాగే అఖిల్‌కు ‘లెనిన్’ సినిమా ద్వారా మంచి హిట్ అందాలని అభిమానులు కోరుకుంటున్నారు. చూడాలి మరి… అఖిల్ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో తెలియాలంటే జూలై 10 వరకు ఆగాల్సిందే.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you