Wednesday, July 22, 2026
HomeLATESTVijay:సొంత సినిమాకే కఠినమైన నిర్ణయం తీసుకున్న సీఎం విజయ్..!

Vijay:సొంత సినిమాకే కఠినమైన నిర్ణయం తీసుకున్న సీఎం విజయ్..!

Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన చివరి సినిమా జననాయగన్ విడుదల విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

on
- Advertisement -banner Ad

Vijay:సినీ హీరోగా తమిళనాడులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోలలో విజయ్ దళపతి కూడా ఒకరు. విజయ్ చిత్రాలు రెండు తెలుగు రాష్ట్రలలో కూడా విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ఈ ఏడాది తమిళనాడులో జరిగిన ఎన్నికలలో భాగంగా టివికే అధినేత విజయ్ (Vijay) భారీ విజయాన్ని అందుకొని అక్కడ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో రకాల కార్యక్రమాలను చేపట్టారు విజయ్. దీంతో తమిళనాడులో విజయ్ పేరు ఎక్కడ చూసినా వినిపిస్తోంది. అయితే విజయ్ నటించిన చివరి సినిమా జననాయగన్ విడుదల విషయంపై ఇప్పటివరకు ఏ విధమైనటువంటి క్లారిటీ రాలేదు

జననాయగన్ విడుదల ఎప్పుడు?

అంతేకాకుండా విజయ్ తన సినిమాకి ఏకంగా కొన్ని కండిషన్స్ పెట్టారని తమిళ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సాధారణంగా హీరోలు సైతం తమ సినిమా విడుదల అవుతుందంటే చాలు ఏ రకమైన సపోర్టు కావాలంటే ఆ రకంగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రమోషన్స్ చేసి మరీ జనాలలోకి సినిమాను తీసుకువెళ్లడానికి పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు తమిళ సీఎం విజయ్ సినిమా ఎప్పటినుంచో రిలీజ్ అవ్వకుండా సెన్సార్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది.. అయితే విజయ్ సీఎం అయినా కూడా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవ్వడం చాలా కష్టంగానే ఉందని వినిపిస్తోంది.

- Advertisement -
Advertisement

ALSO READ:Kiraak RP: అందుకే కిర్రాక్ ఆర్పీ చేపల పులుసు దుకాణం మూసివేశారా?

విజయ్ ను దెబ్బతీయడానికి ప్రత్యర్ధులు కొత్త ప్రయత్నాలు..

జననాయగన్ రిలీజ్ డేట్ కి సంబంధించి ఏదో ఒక డేట్ వైరల్ గా మారుతోంది. కాని అఫీషియల్ గా ప్రకటించలేదు. కానీ విజయ్ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా కూడా ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు తమిళ మీడియా వర్గాలలో కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. విజయ్ ను దెబ్బతీయడానికి ఆయన ప్రత్యర్థులు సైతం జననాయగన్ సినిమాను వాడుకోవాలని చూస్తున్నారట. ముఖ్యంగా ఈ చిత్రానికి సంబంధించి బ్లాక్లో టికెట్లు అమ్మినా, టికెట్లు రేట్లు ఎక్కువ ధరకు అమ్మిన అధికార దుర్వినియోగానికి అవినీతికి పాల్పడుతున్నారని ప్రతిపక్షాల సైతం ఆరోపణలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

- Advertisement -
Advertisement

ALSO READ:Jabardasth:ముక్కు అవినాష్ జీవితంలో అతిపెద్ద విషాదం.. పగవాడికి కూడా ఇలాంటి కష్టం వద్దు సామీ!

కఠిన నిర్ణయం తీసుకున్న విజయ్..

అయితే ఈ విషయం ముందే తెలుసుకున్న సీఎం విజయ్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు వినిపిస్తోంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్ల పైన అకస్మిక దాడులు నిర్వహించాలని టికెట్ కు అనుమతి ఇచ్చిన ధరలకంటే ఒక్క రూపాయి ఎక్కువ అమ్మినా కూడా ఆ థియేటర్ల లైసెన్స్ రద్దు చేయాలని అధికారులను ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు జననాయగన్ సినిమా రిలీజ్ గురించిన ఈ విషయం మరింత ఆసక్తికరంగా మారింది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you