Wednesday, July 22, 2026
HomeLATESTNTR:ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్'కు క్రేజీ హీరోయిన్ ఓకే.. బ్లాక్‌బస్టర్ జోడీ మావ ఇది!?

NTR:ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’కు క్రేజీ హీరోయిన్ ఓకే.. బ్లాక్‌బస్టర్ జోడీ మావ ఇది!?

NTR:జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'గాడ్ ఆఫ్ వార్' సినిమాలో హీరోయిన్‌గా మంజిమా మోహన్ నటిస్తుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో చూడాలి.

on
- Advertisement -banner Ad

NTR:ఎన్టీఆర్ ఏదైనా ఒక సినిమాను సెలెక్ట్ చేసుకున్నాడు అంటే, దానికి కథ జనాలకు కచ్చితంగా నచ్చేలా చూసుకుంటాడు. ఇది ఎప్పటినుంచో జనాల్లో వినిపిస్తున్న మాట. జూనియర్ ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామారావు గారి మనవడు. ఆయన సినిమా ఇండస్ట్రీలో కథలను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటాడని ఫ్యాన్స్ తెగ పొగిడేస్తూ ఉంటారు. అభిమానుల ఇష్టాయిష్టాలకు ఏమాత్రం వ్యతిరేకంగా వెళ్లకుండా, అన్నీ సవ్యంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్.

కొత్త జోనర్‌లో ఎన్టీఆర్:

ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాడు. ఇన్నాళ్లు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్, ఇప్పుడు మరో కొత్త జోనర్‌లో సినిమాను ఓకే చేశాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్(NTR) ఒక సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. ఇది “లార్డ్ మురుగన్‌”కు సంబంధించిన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

- Advertisement -
Advertisement

మురుగన్ కాన్సెప్ట్‌పై క్లారిటీ?:

ఇప్పటికే ఎన్టీఆర్ ఒకసారి లార్డ్ మురుగన్ పుస్తకంతో కనిపించడంతో అభిమానులు సైతం ఇదే కాన్సెప్ట్ అంటూ ఫిక్స్ అయిపోయారు. దానికి తగ్గట్టే ఎన్టీఆర్, త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నాననే విషయాన్ని “శివుడి కుమారుడు, పార్వతీదేవికి గర్వకారణం, దేవసేన భర్త” అంటూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది అధికారికంగా కన్ఫర్మ్ అయినట్లే భావిస్తున్నారు.

also read:Akhil Akkineni:అఖిల్‌ ని జైనబ్ అలా పిలుస్తుందా..? ముద్దు పేర్లు భలే వెరైటీగా ఉన్నాయే..!

- Advertisement -
Advertisement

హీరోయిన్ ఎవరు?:

అయితే, ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తున్నారనేది మాత్రం బిగ్ క్వశ్చన్‌గా మిగిలిపోయింది. చాలా మంది అభిమానులు ఈ హీరోయిన్ అయితే బాగుంటుంది, ఆ హీరోయిన్ అయితే బాగుంటుంది అంటూ రకరకాల పేర్లను సూచించారు. కానీ త్రివిక్రమ్ ఎప్పుడూ చాలా డిఫరెంట్‌గా ఆలోచిస్తాడు.

మంజిమా మోహన్‌కు అవకాశం?:

ఎన్టీఆర్ పక్కన ఓ స్పెషల్ హీరోయిన్‌ను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు, నాగచైతన్య సరసన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళీ నటి మంజిమా మోహన్(Manjima Mohan). ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే 2019లో వచ్చిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో నారా భువనేశ్వరి పాత్రలో కూడా ఆమె నటించి మెప్పించారు.

- Advertisement -
Advertisement

also read:Niharika NM: స్టన్నింగ్ లుక్ లో నిహారిక కొత్త లుక్!

పెళ్లి తర్వాత రీఎంట్రీ?:

కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్న సమయంలోనే కోలీవుడ్ హీరో గౌతమ్ కార్తీక్‌ను పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత అడపాదడపా మాత్రమే సినిమాల్లో నటిస్తున్నారు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ప్రత్యేకంగా ఈ క్యారెక్టర్ ఆమెకు అయితేనే బాగుంటుందని భావించి అప్రోచ్ అవడంతో, ఆమె ఓకే చేసినట్లు సమాచారం.

క్రేజీ కాంబోపై హాట్ టాక్:

త్రివిక్రమ్ చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం రావడం అంటే మాటలు కాదు. ఆ లక్కీ ఛాన్స్‌ను మంజిమా మోహన్ దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పైగా ఎన్టీఆర్ లాంటి పాన్ ఇండియా స్టార్ హీరో పక్కన నటిస్తే, మంజిమా మోహన్ కెరీర్ ఏ రేంజ్‌లో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఈ క్రేజీ కాంబోపై సోషల్ మీడియాలో హాట్ హాట్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

త్రివిక్రమ్ తర్వాతి ప్లాన్:

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు విక్టరీ వెంకటేష్‌తో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్‌తో కలిసి మురుగన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కనున్న సినిమాను ప్రారంభించబోతున్నట్లు సమాచారం.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you