Friday, October 9, 2026
HomeLATESTNana Patekar:సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

Nana Patekar:సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

Nana Patekar::ప్రముఖ బాలీవుడ్, మరాఠీ నటుడు నానా పటేకర్ (75) కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున గోవాలోని డోనా పౌలాలో ఉన్న తన నివాసంలో ఆయన అపస్మారక స్థితిలో కనిపించారు

on
- Advertisement -banner Ad

Nana Patekar:ప్రముఖ బాలీవుడ్, మరాఠీ నటుడు నానా పటేకర్ (75) కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున గోవాలోని డోనా పౌలాలో ఉన్న తన నివాసంలో ఆయన అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే కుటుంబ సభ్యులు, సిబ్బంది ఆయనను మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఆయనను రక్షించలేకపోయారు.

45 నిమిషాల పాటు CPR :

ప్రాథమిక సమాచారం ప్రకారం నానా పటేకర్ తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యారు. ఆసుపత్రికి తీసుకువచ్చిన అనంతరం వైద్య బృందం సుమారు 45 నిమిషాల పాటు నిరంతరంగా CPR అందించింది. అయినప్పటికీ ఆయనలో ఎలాంటి స్పందన కనిపించలేదు. అనంతరం ఉదయం 5:20 గంటల సమయంలో ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

- Advertisement -
Advertisement

మణిపాల్ ఆసుపత్రి ఆంకాలజీ విభాగం చీఫ్ డాక్టర్ శేఖర్ సల్కర్ ఈ విషయాన్ని వార్తా సంస్థ ANIకి వెల్లడించారు. ఈ ఘటనపై మెడికో-లీగల్ కేసు (MLC) నమోదు చేసినట్లు తెలిపారు. మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు పోస్టుమార్టం అనంతరం స్పష్టమయ్యే అవకాశం ఉంది.

1978లో సినీ ప్రయాణం ప్రారంభం :

నానా పటేకర్ 1978లో వచ్చిన ‘గమన్’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. హిందీతో పాటు మరాఠీ చిత్రాల్లోనూ తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘పరిందా’, ‘ప్రహార్’, ‘క్రాంతివీర్’, ‘తిరంగా’, ‘ఖామోషి’ వంటి చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశాయి.

- Advertisement -
Advertisement

వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ దశాబ్దాల పాటు సినీ రంగంలో కొనసాగిన ఆయన.. నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకున్నారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు అనేక పురస్కారాలు దక్కాయి.

also read:Allu Arjun: మహారాష్ట్రలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా..?

- Advertisement -
Advertisement

చివరి రోజుల్లోనూ యాక్టివ్‌గా.. :

75 ఏళ్ల వయసులోనూ నానా పటేకర్ ఎంతో చురుగ్గా ఉండేవారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోలో ఆయన వ్యాయామం చేస్తూ కనిపించారు. ముఖ్యంగా ఫిట్‌నెస్ విషయంలో ఆయన ఎప్పుడూ శ్రద్ధ చూపించేవారని సన్నిహితులు చెబుతుంటారు.

ఇటీవల కూడా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరగానే ఉన్నారు. ‘హౌస్‌ఫుల్ 5’లో అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్ తదితరులతో కలిసి కనిపించారు. అలాగే విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఓ’రోమియో’లో పోలీస్ పాత్రలో నటించారు. అనిల్ కపూర్, రాధికా మదన్ నటించిన ‘సుబేదార్’లోనూ అతిథి పాత్రలో కనిపించారు.

also read:Chiranjeevi :చిరంజీవి కోసం అదిరిపోయే కథ.. ఆ సెన్సేషనల్ డైరెక్టర్‌తో మెగాస్టార్ మూవీ?

సినీ లోకానికి తీరని లోటు:

నానా పటేకర్ ఆకస్మిక మరణంతో భారతీయ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ముఖ్యంగా తన విలక్షణమైన నటన, శక్తివంతమైన డైలాగ్ డెలివరీతో ప్రత్యేక అభిమాన వర్గాన్ని సంపాదించుకున్న ఆయన ఇక లేరన్న వార్త అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భారతీయ సినిమాకు ఆయన అందించిన సేవలను సినీ ప్రముఖులు, అభిమానులు స్మరించుకుంటున్నారు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you