Monday, August 17, 2026
HomeLATESTOTT:రహస్యాలు, కోరికలు, సంబంధాలు.. ఓటీటీలో దుమ్మురేపుతున్న ‘డార్క్ సీక్రెట్స్’..!

OTT:రహస్యాలు, కోరికలు, సంబంధాలు.. ఓటీటీలో దుమ్మురేపుతున్న ‘డార్క్ సీక్రెట్స్’..!

OTT:‘డార్క్ సీక్రెట్స్’ అవినాష్ కొకటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం రహస్యాలు, కోరికలు, సంబంధాల చుట్టూ సాగే కథతో డిజిటల్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

on
- Advertisement -banner Ad

OTT:ఒకప్పుడు సినిమా చూడాలి అంటే థియేటర్ కి వెళ్లాల్సిందే. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఓటిటి వేదికలు ఎన్నో అందుబాటులోకి వచ్చేసాయి. ఓటిటి వేదికలు ఎక్కువగా అందుబాటులోకి రావడంతో ప్రేక్షకులు ఇంట్లోనే తమకు నచ్చిన సినిమాలను, వెబ్ సిరీస్లను వీక్షిస్తున్నారు. అంతేకాదు కొన్ని చిత్రాలు థియేటర్లలో కాకుండా నేరుగా డిజిటల్ ప్లాట్ఫామ్ లపై విడుదలై ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో నేరుగా ఓటీటీలో విడుదలైన తెలుగు ఆంథాలజీ చిత్రం “డార్క్ సీక్రెట్స్” (DARK SECRETS)ఇప్పుడు డిజిటల్ వేదికపై మంచి స్పందనను అందుకుంటుంది.

“డార్క్ సీక్రెట్స్” ప్రత్యేకత ఇదే..!

అప్సర రాణి, నైనిక అనసూయ, జయశ్రీ, నీలిమ చౌదరి తదితరులు కీలక పాత్రలో నటించిన చిత్రం “డార్క్ సీక్రెట్స్”. ఈ సినిమాకు అవినాష్ కొకటి దర్శకత్వం వహించారు. సాధారణంగా చిన్న బడ్జెట్ చిత్రాలకు థియేటర్లలో తగిన స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందడం అంత సులభం కాదు. పరిమిత ప్రమోషన్లు, తక్కువ థియేటర్లు వంటి కారణాలతో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా అందరి దృష్టిని ఆకర్షించలేకపోతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం ఓటీటీ వేదికలు చిన్న చిత్రాలకు మంచి అవకాశం గా మారాయి. థియేటర్లలో మిస్సయిన ప్రేక్షకుల డిజిటల్ ప్లాట్ఫామ్ ల ద్వారా సినిమాలను విక్షిస్తున్నారు. ఈ క్రమంలో “డార్క్ సీక్రెట్స్” కి కూడా ఓటిటి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటూ ఆసక్తిని పెంచేసింది.

- Advertisement -
Advertisement

ALSO READ:TV:సోమవారం టీవీలో అదిరిపోయే సినిమాలు.. పూర్తి లిస్ట్ ఇదే!

విభిన్న కథల సమాహారం:

“డార్క్ సీక్రెట్స్” ఒక ఆంథాలజీ డ్రామా. ఇందులో మానవ మనస్తత్వంలోని విభిన్న కోణాలను కథల రూపంలో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. సాధారణంగా కనిపించే మనుషుల జీవితాలలో దాగి ఉన్న రహస్యాలు, కోరికలు ,భావోద్వేగాలు సంబంధాల సంక్లిష్టతలను కథాంశాలుగా మలిచారు.

- Advertisement -
Advertisement

ప్రతి కథకు ప్రత్యేకమైన నేపథ్యం, పాత్రల సంఘటనలు ఉంటాయి. ఆయా పాత్రలు ఎదుర్కొనే పరిస్థితులు వాటి వెనుక దాగి ఉన్న నిజాలు కథను ముందుకు నడిపిస్తాయి. ఒక రహస్యం బయటపడిన తర్వాత పాత్రల జీవితాలలో చోటు చేసుకునే పరిణామాలను కూడా ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశారు

ALSO READ:OTT:ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు!

- Advertisement -
Advertisement

ఓటీటీలో ప్రత్యేక గుర్తింపు :

వివిధ భాషల చిత్రాలు అందుబాటులో ఉన్న డిజిటల్ వేదికపై తెలుగు చిత్రంగా “డార్క్ సీక్రెట్” ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా విభిన్నమైన కథాంశాలు, మానవ సంబంధాల చుట్టూ అల్లుకున్న అంశాలు ఈ చిత్రానికి ప్రత్యేకతను తీసుకొచ్చాయి. థియేటర్లకు వెళ్లకుండా ఇంట్లోనే కొత్త కథలను చూసేందుకు ఆసక్తి చూపుతున్న ప్రేక్షకుల సంఖ్య పెరుగుతున్న సమయంలో “డార్క్ సీక్రెట్స్” కు లభిస్తున్న ఆదరణ తెలుగు ఓటీటీ సినిమాలకు ఉన్న అవకాశాలను మరోసారి చాటు చెబుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అద్దె విధానంలో స్ట్రీమింగ్ ప్రారంభమైన ‘డార్క్ సీక్రెట్స్’.. ప్రస్తుతం టాప్ 10 ఇండియన్ రెంటల్ మూవీస్‌లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. చిన్న బడ్జెట్ చిత్రాలకు కూడా డిజిటల్ వేదికలు పెద్ద స్థాయిలో ప్రేక్షకులను చేరుకునే అవకాశం కల్పిస్తున్నాయి అనడానికి ఈ సినిమా ఒక ఉదాహరణగా నిలుస్తుంది..!!

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you