MS Raju: టాలీవుడ్ లో సీనియర్ నిర్మాతగా , డైరెక్టర్ గా పేరు సంపాదించిన ఎంఎస్ రాజు గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి భారీ విజయాలను అందుకున్నారు. స్టార్ హీరోలకు కూడా సక్సెస్ అందించిన ఘనత ఎమ్మెస్ రాజుకే. ప్రస్తుతం దర్శకుడిగా అగధ చిత్రాన్ని ఎమ్మెస్ రాజు తెరకెక్కించారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ ఈ సినిమాకు నేను కూడా ఎన్టీఆర్ లాగే బ్రహ్మ ముహూర్తంలో లేచి పనికి సిద్ధం అయ్యానని తెలిపారు.
సోషల్ మీడియా ట్రోల్స్ పై ఎమ్మెస్ రాజు క్లారిటీ..
ఎన్టీఆర్ గారిలాగే చికెన్ కూడా తినకుండా ఉన్నానని, అయితే కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ నే అవమానించారని ఎమ్మెస్ రాజు (MS Raju)పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ విషయం పైన ఈరోజు మీడియాతో ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ ఆ వ్యాఖ్యల పైన క్లారిటీ ఇచ్చారు. ఎమ్ ఎస్ రాజు మాట్లాడుతూ.. సీనియర్ ఎన్టీఆర్ గారికి నేను చిన్నప్పటినుంచి అభిమానిని, సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి సినిమా చేసే సమయంలో కూడా నేను కృష్ణ గారికి చెప్పిన మాట నేను ఎన్టీఆర్ అభిమానిని అని చెప్పానని తెలిపారు.
also read:Sandeep Reddy:పవన్ కల్యాణ్‌కు సందీప్ రెడ్డి వంగా దూరం..? ఫ్యాన్స్‌లో కొత్త అనుమానాలు!
సీనియర్ ఎన్టీఆర్ తో అనుబంధం..
కానీ నాకు ఎన్టీఆర్ కుటుంబంతో సినిమా చేసే అవకాశం రాలేదు. మా నాన్నగారికి ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం లభించింది . దాసరి గారితో కూడా సినిమా అనుకున్నారు అయితే ఆయన రాజకీయాలలోకి వెళ్లడం వల్ల అది కుదర లేకపోయింది. అప్పట్లో నేను ఆయన ఇంటికి వెళ్లి మరి కాళ్లకు దండం పెట్టుకునే వాడిని. ఎన్టీఆర్ గారు ఉదయం లేవగానే వ్యాయామం , ఒక ఇసుక కుప్పను ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఎత్తే వాళ్ళని.. ఆ తర్వాతే స్నానం చేసి మరి పూజ చేసే వారిని తెలిపారు.
also read:hyper aadi:జెన్‌జీ వర్సెస్ 90స్.. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో ఫుల్ కామెడీ!
సీనియర్ ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు..
ఆ తర్వాత మేము ఉంటే మమ్మల్ని కూడా తినడానికి రమ్మనే వారు.. మాకు కూడా గారెలు , చికెన్ వంటివి తెప్పించేవాళ్లు. ఆయన మంచి కోడిని ఎదురుగా పెట్టుకుని తినేవారు. నేను జరిగిందే చెబుతున్నాను. ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఆయన ఒక గొప్ప వ్యక్తి ఆయనలా ఉండాలనుకున్నాను.. ఆయనలా ఉదయం లేచి పూజలు చేసి భోజనం చేసే వాడిని కేవలం చికెన్ ఒక్కటే తినలేదు కాబట్టి ఆ మాట చెప్పాను అంతే. సీనియర్ ఎన్టీఆర్ గారి ఆత్మ మాత్రం నన్ను ట్రోల్ చేయాలని .. మిగతావారు ట్రోల్ చేసినా పట్టించుకోనని తెలిపారు.




