Thursday, July 9, 2026
HomeLATESTPayal Rajput:ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ మొదలుపెట్టిన టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ!

Payal Rajput:ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ మొదలుపెట్టిన టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ!

Payal Rajput: ఇంస్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ మొదలు పెట్టడంపై ఆర్ ఎక్స్ 100 బ్యూటీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Payal Rajput:ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు ఇంస్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ పద్ధతిని మొదలుపెట్టడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. ముఖ్యంగా అందులో ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంటూ కొంతమంది ఇంస్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ని మొదలు పెడుతున్నారు. అలా బుల్లితెర నటీమణుల నుంచి సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా వెలుగుతున్న వారు కూడా ఇలాంటి పద్ధతే స్టార్ట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తమ ఖాతాలో డబ్బు జమ చేస్తే చాలు పిచ్చెక్కించే ఫోటోలతో , ఆఫ్ న్యూడ్ ఆఫర్ అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్టులను పెడుతున్నారు.

సబ్‌స్క్రిప్షన్ బాట పట్టిన సెలబ్రిటీలు..

దీంతో చాలామంది ఇలాంటి సబ్ స్క్రిప్షన్ పెట్టడం చూసి నెటిజన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. గడిచిన కొద్ది రోజుల క్రితం యాంకర్ విష్ణు ప్రియా ఎక్స్ క్లూజివ్ కంటెంట్ కోసం డబ్బులు కట్టి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి అంటూ తన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. దీంతో అటు సోషల్ మీడియాలో కూడా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత మరొక హీరోయిన్ అనన్య నాగళ్ల కూడా ఇలాంటి సబ్‌స్క్రిప్షన్ పద్ధతిని మొదలు పెట్టగా.. ఆ తర్వాత ఆమెను కూడా ట్రోల్ చేయడంతో కేవలం తాను దేవుడికి సంబంధించిన కంటెంట్ ను మాత్రమే షేర్ చేస్తానంటూ చెప్పుకొచ్చింది.

- Advertisement -

ఈ జాబితాలోకి చేరిన పాయల్..

ఆ తర్వాత అటు అషు రెడ్డి, నేహా శెట్టి, డింపుల్ హయతి తదితర సెలెబ్రెటీలు కూడా ఇంస్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ మొదలుపెట్టారు. ఇప్పుడు వీరి జాబితాలోకి మరొక హీరోయిన్ చేరిపోయింది. ఆమె ఎవరో కాదు బోల్డ్ బ్యూటీగా పేరు సంపాదించిన పాయల్ రాజ్ పుత్(Payal Rajput). ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వరుసగా ఎన్నో చిత్రాలలో నటించి భారీ క్రేజ్ అందుకుంది. తాను నటించే సినిమాలలో ఎక్కువగా బోల్డ్ సీన్స్ లలో కనిపిస్తూ ఉంటుంది.అయినా ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు.

అలాంటివి ఆశించవద్దు అంటూ కామెంట్..

చివరిగా ఈమె లీడర్ అనే ఒక చిత్రంలో నటించింది. ఇప్పుడు తాజాగా ఇన్స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ మొదలు పెట్టింది. నా చానల్లో నేను ఎలాంటి కంటెంట్ షేర్ చేయబోతున్నాననే విషయంపై చాలామంది మెసేజ్లు చేస్తున్నారు . నా దగ్గర నుంచి బోల్ట్ కంటెంట్ ఎవరు ఆశించకండి కేవలం నా జీవితంలో తెర వెనుక జరిగిన విషయాలను మాత్రమే తాను అక్కడ చూపించాలనుకున్నాను అంతకుమించి మీరేమీ ఆశించవద్దండి అంటూ తెలియజేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం వైరల్ గా మారింది.

- Advertisement -

 

View this post on Instagram

 

- Advertisement -

A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal)

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you