Thursday, July 9, 2026
HomeLATESTTrikala : ఓటీటీలోకి వచ్చిన శ్రద్ధాదాస్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ..!

Trikala : ఓటీటీలోకి వచ్చిన శ్రద్ధాదాస్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ..!

Trikala Movie: శ్రద్ధా దాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సైకాలజికల్ మిస్టరీ థ్రిల్లర్ హారర్ మూవీ ఇప్పుడు ఓటిటి స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.

on
- Advertisement -banner Ad

Trikala : ఓటీటీలోకి సైలెంట్ గా కొన్ని చిత్రాలు విడుదలై ప్రేక్షకులను సడన్ సర్ప్రైజ్ చేస్తుంటాయి . అలా థియేటర్లో ప్రేక్షకులను బాగా భయపెట్టిన త్రికాల(Trikala )చిత్రం ఇప్పుడు ఓటిటి ప్రేక్షకులను కూడా మరింత భయ పెట్టేందుకు సిద్ధమయ్యింది. మే 28- 2026న థియేటర్లలో విడుదలైన ఈ థ్రిల్లర్ మిస్టరీ సస్పెన్స్ చిత్రం. థియేటర్లలో మోస్తారు గానే ఆడింది. సుమారుగా విడుదలైన 40 రోజుల తర్వాత ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యింది. సన్ నెక్స్ట్ (Sun Next) జులై 9వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్నట్లు అనౌన్స్మెంట్ కూడా చేశారు.

త్రికాల మూవీ స్టోరీ..

సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఈ సినిమా పౌరాణిక నేపథ్యంతో కూడిన కుమారి ఖండం నుంచి మొదలవుతుంది. ప్రపంచ వినాశనం నుంచి కాపాడేందుకు కొంతమంది మహర్షులు శక్తివంతమైనటువంటి గ్రంథాలను దాచిపెట్టే కథాంశంతో తెరకెక్కించారు. అలాగే ప్రస్తుత కాలంలో కథను మూడు విభిన్నమైన జీవితాల చుట్టూ ముడిపెడుతూ చూపించారు. తన ప్రేయసి నిధి కోసం వెతుకుతున్న శివకు ఒక రహస్యమైన శక్తి కలిగిన మొబైల్ లభిస్తుంది. మరొకవైపు వింత వ్యాధితో బాధపడుతున్న వైతరణ్, విషాద సంఘటన తర్వాత ఒక భవనాన్ని వెంటాడే ఆత్మగా కనిపిస్తారు. ఆ సమయంలోనే వైద్యురాలు మాయ సంఘటనలను వెనుక నిజాన్ని తెలుసుకోవడానికి.. ఆ రహస్యం ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత జరిగిన అక్కడ పరిణామాలతో చీకటి కాంతి మధ్య జరిగే పోరాటంతో కథ క్లైమాక్స్ కి చేరుతుంది.

- Advertisement -

also read:Janhvi Kapoor:జాన్వీ కపూర్ ధరించిన వాచ్ ధర ఎన్ని కోట్లో తెలుసా..?

ఓటీటీలో మెప్పిస్తుందా?

ఈ చిత్రంలో మహేంద్రన్, శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలో నటించారు. అలాగే సాహితి అవంచ, అజయ్, రోబో శంకర్, రోహిణి తదితరులు కీలకమైన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి మణి తెల్లగూటి దర్శకత్వం వహించగా.. సంగీతాన్ని హర్షవర్ధన్ రామేశ్వర్ అందించారు. థియేటర్లో మిస్టరీ ఫాంటసీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటి లో ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

- Advertisement -

also read:FAUJI:ఫౌజీ షూటింగ్లో నటుడు రాజేష్ శర్మకు విషపురుగు కాటు!

శ్రద్ధాదాస్ సినిమాలు..

శ్రద్ధాదాస్ సినిమాల విషయానికి వస్తే.. 2008వ సిద్దు ఫ్రం శ్రీకాకుళం అనే సినిమాతో ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అధినేత, ఆర్య 2, మరోచరిత్ర, డార్లింగ్, రేయ్, బందిపోటు, గుంటూరు టాకీస్, గరుడవేగ, ఏక్ మినీ కథ, తదితర చిత్రాలలో నటించింది. చివరిగా లేచింది మహిళా లోకం అనే సినిమాలో నటించింది. అందం , అభినయం ఉన్నప్పటికీ ఎందుకో సక్సెస్ మాత్రం అందుకోలేకపోతోంది ఈ ముద్దుగుమ్మ. మరి రాబోయే రోజుల్లోనైనా మంచి విజయాలను అందుకుంటుందేమో చూడాలి.

- Advertisement -

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you