Friday, July 10, 2026
HomeLATESTShobhan Babu:నటుడు శోభన్ బాబు ఇంట విషాదం?

Shobhan Babu:నటుడు శోభన్ బాబు ఇంట విషాదం?

Shobhan Babu: దివంగత నటుడు శోభన్ బాబు భార్య శాంత కుమారి తన నివాసంలో వయోభారంతో కన్నుమూశారు.

on
- Advertisement -banner Ad

Shobhan Babu:సినీ ఇండస్ట్రీలో దిగ్గజ నటుడుగా పేరు సంపాదించిన శోభన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను తన సినిమాలతో బాగా అలరించారు. కానీ చాలా తక్కువ మందికి మాత్రమే శోభన్ బాబు ఫ్యామిలీ గురించి తెలుసు అనే చెప్పాలి.. ముఖ్యంగా శోభన్ బాబు(Shobhan Babu) భార్య శాంతకుమారి ఎప్పుడూ కూడా బయటికి వచ్చిన సందర్భాలు కనిపించలేదు. కానీ తాజాగా ఈమె కన్నుమూసినట్లు తెలుస్తోంది. చెన్నైలోని కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్న శాంతా కుమారి గత కొన్నేళ్లుగా వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ( జూలై 9) తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది.

శోభన్ బాబు భార్య కన్నుమూత..

ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు సైతం అధికారికంగా వెల్లడించినట్లు తెలుస్తోంది.శాంతకుమారి మరణ వార్త విన్న శోభన్ బాబు అభిమానులు, సినీ సెలబ్రిటీలు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. జూలై 10న శాంత కుమారి అంతక్రియలు చెన్నైలో నిర్వహించబోతున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. 1958 మే 15న శోభన్ బాబుకి, శాంత కుమారితో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు జన్మించారు. తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా ఒక వెలుగు వెలిగిన శోభన్ బాబు ప్రేమ కథ , కుటుంబ కథ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.

- Advertisement -

also read:Payal Rajput:ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ మొదలుపెట్టిన టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ!

శోభన్ బాబు కెరియర్..

సౌత్ ఇండస్ట్రీలో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న శోభన్ బాబు చివరి శ్వాస వరకు కూడా హీరో గానే నటించేందుకు ప్రయత్నాలు చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో అవకాశాలు వచ్చినా కూడా వాటిని వదిలేసుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభన చలపతిరావు. ఈయన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లాలో నందిగామ ప్రాంతంలో జన్మించారు. అనంతరం తన విద్యాభ్యాసాన్ని విజయవాడలో పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే మక్కువ ఉండడంతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు.

- Advertisement -

also read:Trikala : ఓటీటీలోకి వచ్చిన శ్రద్ధాదాస్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ..!

శోభన్ బాబు సినిమా జీవితం..

శోభన్ బాబు మద్రాసులో లా కోర్సు చదువుకునే సమయంలో తనకు నటన పైన ఆసక్తి ఉండడంతో సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అవకాశాల కోసం ఎన్నో స్టూడియోల చుట్టూ కూడా తిరిగేవారు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత శోభన్ బాబు గా పేరు మార్చుకున్నారు. అలా దైవబలం చిత్రంలో రామారావు ఒక పాత్రను ఇచ్చారు. 1959 సెప్టెంబర్ 17న ఈ సినిమా విడుదలై పెద్దగా ఆకట్టుకోలేదు. 1960 జూలై 15న భక్త శబరి అనే చిత్రంలో ముని కుమారునిగా శోభన్ బాబు నటించగా..ఆ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఎన్నో ఫ్యామిలీ చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్న శోభన్ బాబు 2008లో గుండెపోటుతో కన్నుమూశారు.

- Advertisement -

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you