Monday, August 24, 2026
HomeLATESTYash :టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. కారణం ఇదేనా?

Yash :టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. కారణం ఇదేనా?

Yash : యష్ నటించిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చోటుచేసుకున్న అపశృతిపై చర్చ జరుగుతోంది.

on
- Advertisement -banner Ad

Yash:పాన్ ఇండియా స్టార్ యష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ టాక్సిక్. ఈ సినిమా కోసం జనాలు ఎంత ఆశగా ఎదురుచూస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, మ్యూజిక్.. అన్ని అప్డేట్స్ అభిమానులను వేరే లెవెల్‌కి తీసుకెళ్లిపోయాయి. ఇప్పటివరకు యష్ కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో నటించినా.. ఈ సినిమా మాత్రం వేరే లెవెల్ హైప్ అందుకోబోతుంది అంటూ సినిమా రిలీజ్‌కి ముందే ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేశారు.

డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్‌ను భారీ స్థాయిలో నిర్వహించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీ, దూలపల్లిలో టాక్సిక్ (Yash)ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. అయితే అనుకోకుండా అక్కడ ఊహించని ఘటన చోటుచేసుకుంది. దీంతో పరిస్ధితి గదరగోళం అయిపోయింది.

- Advertisement -
Advertisement

టాక్సిక్ ఈవెంట్‌లో అపశృతి:

అయితే అంతా బాగా జరుగుతుంది అనుకున్న సమయంలో అపశృతి జరిగింది. దీంతో ఈవెంట్ మొత్తం గందరగోళ పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీ, దూలపల్లిలో జరిగిన టాక్సిక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి భారీ ఎత్తున విద్యార్థులు, అభిమానులు హాజరయ్యారు. ఈ క్రమంలో హీరో యష్‌ను చూసేందుకు విద్యార్థులు ఎగబడ్డారు. ఒకరిపై ఒకరు ఎక్కుతూ ముందుకు వచ్చారు. యష్ స్టేజ్‌పై మాట్లాడుతూ ఉండగా.. కుప్పకూలిన భారీ సౌండ్ బాక్స్ సెట్ కింద పడిపోయింది. దీంతో విధ్యార్ధులు భయపడిపోయారు.

also read:Manchu Lakshmi :రాకా సినిమాపై మంచు లక్ష్మీ అదిరిపోయే అప్డేట్..!

- Advertisement -
Advertisement

విద్యార్థులకు గాయాలు:

ఒక్కసారిగా కింద పడిన భారీ సౌండ్ సెట్‌తో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. విద్యార్థులకు గాయాలైనట్లు సమాచారం. అంతేకాదు, ఇద్దరు విద్యార్థులకు కాలు విరిగినట్లు కూడా సమాచారం అందుతుంది. గాయపడిన వారిలో ఓ అమ్మాయి కాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఈవెంట్ ప్రాంగణం మొత్తం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. దీంతో విద్యార్థులు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు.

also read: హైపర్ ఆది టంగ్ స్లిప్..NTR ఫ్యాన్స్ ఫైర్..మధ్యలో మహేశ్ ఎందుకు వచ్చాడు..?

- Advertisement -
Advertisement

రంగంలోకి దిగిన పోలీసులు:

పోలీసులు, నిర్వాహకులు రంగంలోకి దిగి విద్యార్థులకు నచ్చజెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఎమ్మెల్యే మల్లారెడ్డి సైతం విద్యార్థులను సముదాయించాల్సి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు. అసలు ఈ సౌండ్ బాక్స్ ఎందుకు అలా కింద పడిపోయింది? దానికి గల కారణాలు ఏంటి? వేడుకకు భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరు కావడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందా? అంటూ రకరకాలుగా జనాలు మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హోమా ఖురేషి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 26న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you