Saturday, October 24, 2026
HomeLATESTImmortal movie OTT:కయాదు లోహర్ హర్రర్ మూవీ ఓటీటిలోకి ఎప్పుడంటే..?

Immortal movie OTT:కయాదు లోహర్ హర్రర్ మూవీ ఓటీటిలోకి ఎప్పుడంటే..?

Immortal movie OTT: జీవి ప్రకాష్ కుమార్, కయాదులోహర్ జంటగా వచ్చిన ఇమ్మోర్టెల్ మూవీ ఇప్పుడు ఓటిటి స్ట్రీమింగ్ కి సిద్ధమయింది.

on
- Advertisement -banner Ad

Immortal movie OTT:టాలీవుడ్ కోలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకొని హీరోగా మారి వైవిద్యమైన చిత్రాలతో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుతున్నారు జీవీ ప్రకాష్ కుమార్.. తాజాగా ఆయన నటించిన చిత్రం ఇమ్మోర్టల్. నాకు మరణం లేదు అనే క్యాప్షన్ తో వచ్చిన ఈ చిత్రానికి మారియప్పన్ చిన్న దర్శకత్వంలో ఈ సినిమా థియేటర్లలో విడుదల అయింది. ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ఈ చిత్రంలో హీరోయిన్గా కయాదు లోహర్ నటించింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అప్డేట్ అధికారికంగా బయటికి వచ్చింది.

ఓటీటీ లోకి ఇమ్మోర్టల్..

ట్రైలర్ తో ప్రేక్షకులను భయపెట్టి మరొకవైపు రొమాంటిక్ అండ్ థ్రిల్లింగ్ ఎమోషన్స్ తో ఆకట్టుకున్న ఇమ్మోర్టల్(Immortal movie OTT) సినిమా త్వరలోనే ఓటీటిలోకి రావడానికి సిద్ధమయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో ఒకటైన సోనీ లీవ్ వేదికగా ఈ సినిమా అక్టోబర్ 30వ తేదీన డిజిటల్ స్ట్రీమ్మింగ్ కి సిద్ధమయ్యింది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో ఒకేసారి విడుదల కాబోతోంది. హర్రర్ జోనర్ ఇష్టపడే వారు ఈ సినిమా చూసేందుకు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Fauzi:ఫౌజీ సినిమా గ్లింప్స్ వైరల్.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ప్రభాస్..!

స్టోరీ విషయానికి వస్తే:

మహి (జీవి ప్రకాష్) అనే సాధారణ యువకుడు ఉద్యోగరీత్యా అతి తక్కువ బడ్జెట్లో తనకు ఉండడానికి అద్దె ఇల్లు కోసం వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలో సింధు (కయాదు లోహర్) అనే యువతతో పరిచయం ఏర్పడుతుంది. అలా ఆమె ఉంటున్న అపార్ట్మెంట్లోని షేరింగ్ ఫ్లాట్ లో అద్దెకు దిగుతారు. అలా మొదటి చూపులోనే సింధుతో ప్రేమలో పడి మహికి తన జీవితంలో కొన్ని ఊహించని వింతైన సంఘటనలు ఎదురవుతాయి. అసలు సింధు ఎవరు? ఆమె వెనుక ఉన్న వెయ్యేళ్ల నాటి జానపద మిస్టరీ ఏంటి? అసలు ఆ అపార్ట్మెంట్లో జరిగిన భయానక రహస్యాల నుంచి మహి ఎలా బయటపడతారు అనేది ఈ సినిమా స్టోరీ.

- Advertisement -
Advertisement

also read:Aadarsha kutumbam AK 47:ఆకట్టుకుంటున్న వెంకటేష్ ఆదర్శ కుటుంబం ట్రైలర్..!

జీవి ప్రకాష్ సినిమాలు..

జీవి ప్రకాష్ సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది శ్రీనివాస మంగాపురం, ఇరుముడి సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించి మంచి విజయాలను అందుకున్నారు. తమిళంలో విశ్వనాధ్ అండ్ సన్స్, మండాడి వంటి చిత్రాలకు మ్యూజిక్ అందించి విజయాలను అందుకున్నారు జీవి ప్రకాష్. ప్రస్తుతం హిందీలో ఒక సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆకాశంలో ఒక తార అనే చిత్రానికి కూడా అందిస్తున్నారు.

- Advertisement -
Advertisement

కయాదు లోహర్ సినీ కెరియర్..

కయాదు లోహర్ సినీ కెరియర్ విషయానికి వస్తే.. ఈ ఏడాది ప్యారడైజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని భావించి ఒక మలయాళం సినిమా, రెండు తమిళ సినిమాలకు ఓకే చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. మరి ఈ సినిమాలతో నైనా సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి మరి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you