Irumudi:టాలీవుడ్ మాస్ హీరోగా పేరు సంపాదించిన రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ఇరుముడి. ఈ సినిమా పైన రవితేజ అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ కూడా హైలెట్ గా మారింది.ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది .ఈ సినిమాని ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధమయింది.ఈ క్రమంలో భాగంగా ఈ సినిమా నుంచి నేడు మేకర్స్ అధికారికంగా ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ లో ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ కంటెంట్ తో ఆకట్టుకుంటోంది.
ఇరుముడి ట్రైలర్ రిలీజ్..
విడుదలైన ట్రైలర్ విషయానికి వస్తే.. శబరిమల అయ్యప్ప స్వామి భక్తి నేపథ్యానికి సంబంధించి స్టోరీ అన్నట్టుగా కనిపిస్తోంది. అలాగే కుటుంబంలోని భావోద్వేగ సన్నివేశాలను కూడా జోడించినట్టుగా కనిపిస్తోంది .ముఖ్యంగా తండ్రి, కూతురు మధ్య బాండింగ్ చూపించిన తీరు కూడా హైలెట్గా కనిపిస్తోంది. రవితేజ తనదైన స్టైల్ లో ఒక భక్తుడిగా, తండ్రిగా, భర్తగా విభిన్నమైన పాత్రలలో అలరించారు. అలాగే ఇరుముడి(Irumudi) కట్టు శబరిమల ఎక్కు.. లిరిక్ సాంగ్ కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. దీనితో ఈ సినిమా పైన మరింత అంచనాలను పెంచేసిందని కూడా చెప్పవచ్చు.
also read:janhvi kapoor :యదార్థ సంఘటనల కథతో తమిళ ఇండస్ట్రీలోకి జాన్వీ కపూర్ ఎంట్రీ..!
ట్రైలర్ ఎలా ఉందంటే?
భక్తి వాతావరణ, డైరెక్టర్ శివ నిర్వాణ మార్క్ ఎమోషన్స్ కూడా ఇందులో చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఈ సినిమా కనుక ప్రేక్షకులకు కనెక్ట్ అయితే మాత్రం రవితేజ కెరియర్ లోను ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని తెలియజేస్తున్నారు. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి. రవితేజ చెప్పే డైలాగులు కూడా ట్రైలర్ కి హైలెట్గా నిలుస్తున్నాయి. జీవి ప్రకాష్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ వారు. ఈ సినిమాని భారీ బడ్జెట్లోనే నిర్మించారు.
also read:Actress Roja:రోజా నటించిన రీ ఎంట్రీ మూవీ.. ఏ ఓటీటీలో అంటే?
రవితేజ సినిమాలు..
రవితేజ సినిమాల విషయానికి వస్తే.. గత కొన్నేళ్లుగా వరుస ఫెయిల్యూర్ తో సతమతమవుతున్న రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో కొంతమేరకు అభిమానులను అలరించింది. ఇప్పుడు తాజాగా ఇరుముడి సినిమాతో మరొకసారి మంచి విజయాన్ని అందుకోబోతున్నట్లు వినిపిస్తోంది. ప్రస్తుతం ఇరుముడి సినిమాకి సంబంధించి ట్రైలర్ వైరల్ గా మారింది.




