Janhvi Kapoor:టాలీవుడ్ ,బాలీవుడ్ లో హీరోయిన్ గా వరుసగా అవకాశాలు అందుకుంటున్నారు హీరోయిన్ జాన్వీ కపూర్. తన అందం అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ నిరంతరం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలతో కట్టిపడేస్తుంది. ఇటీవలే రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రంలో కూడా తన నటనతో ఆకట్టుకుంది. అలాగే తన అక్క అన్షులా కపూర్ పెళ్లి వేడుకలలో కూడా చాలా అట్రాక్షన్ గా కనిపించింది జాన్వీ కపూర్. ఈ పెళ్లి వేడుకల అనంతరం జరిగిన కార్యక్రమాలలో జాన్వీ కపూర్ సింపుల్ గా కనిపించినప్పటికీ.. ఆమె వేసుకొచ్చిన వాచ్ మాత్రం అందరి దృష్టిని ఆకట్టుకుంది.
అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న జాన్వి కపూర్ వాచ్..
జాన్వీ కపూర్ (Janhvi Kapoor)పెట్టుకున్న వాచ్ అంతర్జాతీయ బ్రాండ్ పాటెక్ ఫిలిప్ కంపెనీకి చెందింది.ఆ బ్రాండ్ కి చెందిన గోండోలో హాట్ క్లేర్ పెర్ల్ అనే మోడల్ లో కలదు. రోజ్ గోల్డ్ కలర్ వాచ్ ని జాన్వీ పెట్టుకుంది. ఈ లగ్జరీ వాచ్ సుమారుగా రెండున్నర కోట్ల రూపాయలు ఉంటుందని.. దేశాన్ని బట్టి ఈ ధర కూడా మారుతూ ఉంటుందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీదేవి, బోణీ కపూర్ కూతురు ఇలాంటి వాచ్ పెట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఈ వాచ్ అంత ధర ఎందుకు ఉంది అనే విషయంపై ఇప్పుడు ఆరా తీస్తున్నారు.
ALSO READ:FAUJI:ఫౌజీ షూటింగ్లో నటుడు రాజేష్ శర్మకు విషపురుగు కాటు!
ఎందుకంత ప్రత్యేకత?
అందుకు గల ముఖ్య కారణం ఏమిటంటే.. ఈ వాచీలో వజ్రాలు, ముత్యాలనే ఉపయోగించారట. ఈ వాచ్ తయారీలో సుమారుగా 250 చిన్న చిన్న వజ్రాలు, 79కి పైగా ఖరీదైన ముత్యాలను అమర్చారు అలాగే 18 క్యారెట్ల గోల్డ్ ప్లేటుతో ఈ వాచ్ ని తయారు చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఈ వాచ్ ధర అంత ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి జాన్వీ కపూర్ ధరించిన ఈ వాచ్ ధర తెలిసి అటు నెటిజన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు.
ALSO READ:TV:అమృతం సీరియల్ నటుడు హనుమంతరావు ఫ్యామిలీకి అండగా స్టార్ నటుడు..!
జాన్వీ కపూర్ సినిమాలు..
జాన్వీ కపూర్ సినిమాల విషయానికి వస్తే.. 2018లో దఢక్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత పలు రకాల చిత్రాలలో నటించింది. తెలుగులో ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాలో తన కెరీర్ ని మొదలుపెట్టి, పెద్ది వంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకుంది. అలాగే పలు తెలుగు సినిమాలలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. కథ నచ్చితే తనకి భాషతో సంబంధం లేకుండా ఏ భాషలోనైనా సరే నటించడానికి సిద్ధమవుతోంది.


