FAUJI:పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తున్నారు. డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ఫౌజీ(FAUJI). ఈ సినిమా ఆర్మీ నేపథ్యం ఉండే కథ కావడం చేత ఈ సినిమా పైన ఇప్పటికే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న క్రమంలో తాజాగా ఒక అనూహ్య ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ చిత్రీకరణ హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోంది. అయితే ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజేష్ శర్మను విషపు పురుగు కాటేసినట్లు తెలుస్తోంది.
ప్రభాస్ మూవీ షూటింగ్ సెట్ లో నటుడికి అస్వస్థత..
దీంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని , సినిమా షూటింగ్ సెట్ లో కొంతమంది టెక్నీషియన్ లతో మాట్లాడుతూ ఉండగా తన కాలికి విషపు పురుగు కుట్టిందని, మొదట అది సాధారణ కీటకమే అనుకొని నిర్లక్ష్యం చేయగా.. కానీ ఆరు గంటల తర్వాత తీవ్రమైన నొప్పి, జ్వరం, శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందులు తలెత్తాయని, దీంతో వెంటనే అక్కడ చిత్ర బృందం ఆసుపత్రికి తరలించినట్లు ప్రచారం అయితే జరుగుతోంది. ఈ విషయం తెలిసి పలువురు అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మెరుగైన వైద్య చికిత్స కోసం తన స్వస్థలమైన కోల్కత్తాకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వినిపిస్తున్నాయి.
ALSO READ:TV:అమృతం సీరియల్ నటుడు హనుమంతరావు ఫ్యామిలీకి అండగా స్టార్ నటుడు..!
వేగంగా వ్యాపించిన ఇన్ఫెక్షన్..
వైద్యుల ప్రాథమిక పరీక్షల అనంతరం తెలిపిన వివరాల ప్రకారం విషపు పురుగు కాటు వేయగానే పాదం నుంచి మోకాలు వరకు ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.జ్వరం తగ్గకపోవడం ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తాడంతో నటుడు రాజేష్ శర్మని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు అయితే ఈ విషయం పైన చిత్ర బృందం నుంచి ఇంకా ఎటువంటి అధికారికంగా ప్రకటన అయితే రాలేదు.
ALSO READ:OTT: కర్మకాలి మీ ఫోన్‌లోనూ ఇలా జరిగితే..? ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తున్న సస్పెన్స్ సిరీస్..!
అసలు విషయం చెప్పిన పిఏ..
కానీ నటుడు రాజేష్ శర్మ పైన నడుస్తున్న వ్యవహారంపై ఆయన పీఏ సుభాశీష్ పాండా స్పందిస్తూ.. ఫౌజీ షూటింగ్లో నటుడుకి విషపు పురుగు కాటేసిందని ప్రచారంపై ఒక వీడియోను విడుదల చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని రాజేష్ శర్మ కేవలం డయాబెటిస్ కారణంగానే ఆసుపత్రిలో చేరారని ఇప్పుడు ఆయన ఆరోగ్యం కుదుటపడిందని గురువారమే డిశ్చార్జ్ అవుతున్నారంటూ తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఈ సినిమాలో గుల్షన్ కుమార్, జయప్రద, మిథున్ చక్రవర్తి, రాజేష్ శర్మ, అనుపమ ఖేర్ తదితర నటీనటులు కీలకమైన పాత్రలు నటిస్తున్నారు.
Bollywood Actor #RajeshSharma is Safe & admitted to Hospital because of Diabetes not by Poisonous snake bite in Prabhas #Fauzi Movie Shoot. The false news is Circulating over Social media clarified by his Assistant. pic.twitter.com/eqd9FlNc6G
— Prabhas Fan (@Itsaprank132511) July 8, 2026


