Tuesday, August 11, 2026
HomeLATESTKiran Abbavaram:కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ?

Kiran Abbavaram:కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ?

Kiran Abbavaram:కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘చెన్నై లవ్ స్టోరీ’ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

on
- Advertisement -banner Ad

Kiran Abbavaram:సినిమా ఇండస్ట్రీలో ఎన్నెన్నో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. రిలీజ్ అయిన ప్రతి సినిమా జనాలని ఆకట్టుకోవాలి అన్న రూల్ లేదు. భారీ బడ్జెట్ తో తెరక్కించి భారీ తారాహాణం ఉన్న సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అసలు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సాదాసీదాగా సింపుల్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద చరిత్ర సృష్టించిన దాఖలాలు ఎన్నెన్నో ఉన్నాయి. అలాంటి వాటిల్లోనే నిలిచింది “చెన్నై లవ్ స్టోరీ”. టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) , శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ థియేటర్లలో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అందుకుంది. జులై 24న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దుమ్ము దులిపేసింది. మంచి వసూలు సాధించింది. బేబీ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సాయి రాజేష్ నిర్మాత ఎస్ కే ఎన్ కాంబినేషన్ లో ఈ మూవీ తెరకెక్కింది. ఈ హిట్ కాంబో పై ముందు నుంచి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ కి ఏమాత్రం తగ్గనీయకుండా డబల్ చేసుకున్నారు మూవీ టీం.

50 కోట్లకు పైగా వసూళ్లు :

చిన్న సినిమాలకి ఎక్కువ లాభాలు రావు అని అందరి ఒపీనియన్. కానీ అది తప్పు అంటూ ప్రూవ్ చేసింది చెన్నై లవ్ స్టోరీ. దాదాపు రూ.15 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా రూ.50 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం. దీంతో నిర్మాతలకు మంచి లాభాలు అందించి క్లీన్ హీట్ గా నిలిచింది. థియేటర్లలో ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్ధ సోనీ లీవ్ దక్కించుకుంది.

- Advertisement -
Advertisement

ALSO READ:OTT:ఈ వారం ఓటీటీలోకి 22 మూవీస్..!

ఆగస్టు 21 నుండి ఓటీటీలో :

అందుతున్న తాజా సమాచారం ప్రకారం కిరణ్ అబ్బవరం నటించిన “చెన్నై లవ్ స్టోరీ”.. ఆగస్టు 21 నుండి సోనీ వీల్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ తేదీ పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే చిత్ర బృందం లేదా ఓటిటి సంస్ధ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

- Advertisement -
Advertisement

ALSO READ:Tanuja :కుకు విత్ జాతిరత్నాలు” సీజన్ 2 విన్నర్ తనూజ.. ప్రైజ్ మనీ ఎంతంటే?

సినిమాకి అదే బిగ్ ప్లస్ :

దర్శకుడిగా ఎదగాలనే కళతో చెన్నైకి వచ్చిన అనాధ యువకుడు స్టీవెన్ శంకర్ పాత్రలో కిరణ్ అబ్బవరం నటన అద్భుతం. ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు. మరోవైపు నిధి అనే యువతి అజయ్ ని ప్రేమిస్తుంది. పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలో అజయ్ ఆమెను ఒంటరిగా వదిలి వెళ్ళిపోవడంతో నివి తీవ్ర మనోవేదనకు గురవుతుంది. ఈ పాత్రలో గౌరీ ప్రియ నటన స్టన్నింగ్. వేరే ఏ హీరోయిన్ కూడా ఇలా నటించలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ సమయంలో ఆమె జీవితంలోకి స్టీవెన్ ప్రవేశిస్తాడు.

- Advertisement -
Advertisement

నిధి చేసిన చిన్న సహాయం అతడి మనసును తాకడంతో ఆమెపై ప్రేమ పెంచుకుంటాడు. క్రమంగా వీరి పరిచయం ప్రేమగా మారుతుంది. అనంతరం ఇద్దరు పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని నిర్ణయించుకుంటారు. అయితే నిధికి సంబంధించిన కొన్ని అనూహ్యపరిణామాలు.. మళ్లీ వారి జీవితాలలోకి వస్తాయి. అజయ్ ఎందుకు నిధిని వదిలి వెళ్ళాడు..? స్టీవెన్ ప్రేమ కథ చివరకు ఎలాంటి మలుపు తిరిగింది..? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం. ఈ సినిమా అభిమానులను బాగా ఆకట్టుకునింది. సోషల్ మీడియాలో ఈ సినిమాకి మంచి రివ్యూస్ వచ్చాయి. ఈ సినిమా జనాలను కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది అంటూ రిలీజ్ మూమెంట్లోనే మూవీ టీం ప్రకటించింది . అన్నట్లే సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది..!

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you