Tuesday, August 11, 2026
HomeLATESTTanuja :కుకు విత్ జాతిరత్నాలు" సీజన్ 2 విన్నర్ తనూజ.. ప్రైజ్ మనీ ఎంతంటే?

Tanuja :కుకు విత్ జాతిరత్నాలు” సీజన్ 2 విన్నర్ తనూజ.. ప్రైజ్ మనీ ఎంతంటే?

Tanuja :‘కుక్కు విత్ జాతిరత్నాలు’ సీజన్ 2 విజేతగా తనూజ పుట్టస్వామి నిలిచారు.

on
- Advertisement -banner Ad

Tanuja :బుల్లితెర ప్రేక్షకులను వంటలు, వినోదం, సెలబ్రిటీ పంచులతో అలరించిన ప్రముఖ కుకింగ్ రియాలిటీ షో “కుక్ విత్ జాతి రత్నాలు సీజన్ 2” ముగిసిపోయింది. ఆదివారం ఆగస్టు 9 రాత్రి జరిగిన గ్రాండ్ ఫినాలేలో “తనుజ పుట్ట స్వామి” విజేతగా నిలిచి టైటిల్ను సొంతం చేసుకున్నారు. గతంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో రన్నరప్‌గా గా నిలిచిన తనుజ ఈసారి మాత్రం విజేత గా సత్తా చాటింది.

తనుజాకు 10 లక్షల బహుమతి:

టైటిల్ తో పాటు తనుజాకు భారీ నగదు బహుమతి కూడా లభించింది. కుక్ విత్ జాతి రత్నాలు సీజన్ 2 విన్నర్ గా పది లక్షల ప్రైజ్ మనీ అందుకుంది. విజయం అనంతరం తనూజ తనకు అండగాలిచిన అభిమానులు, సహా పోటీదారులు, షో నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపింది. సోషల్ మీడియాలో ఇప్పుడు తనుజ పేరు బాగా ట్రెండ్ అవుతుంది. ఆమె మంచితనం ఆమె నిజాయితీనే ఆమెను ఇంత స్థాయిలో నిలబెట్టింది అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు.

- Advertisement -
Advertisement

also read:Monday movies:సోమవారం టీవీలో అదిరిపోయే సినిమాలు.. ఏ ఛానల్‌లో ఏ మూవీ అంటే?

ఫైనల్ లో ఐదుగురు పోటీ:

గ్రాండ్ ఫినాలే లో తనూజ పాటు జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్, ఆషిక, నిఖిల్, డిమాన్ పవన్ టైటిల్ కోసం పోటీ పడ్డారు. వీరిలో రాకేష్ 5వ స్థానంలో, ఆషిక నాలుగో స్థానంలో, నిఖిల్ మూడో స్థానంలో, డిమాన్ పవన్ రెండో స్థానంలో నిలిచారు. ఫైనల్ గా తనుజ విజేతగా ట్రోఫీ అందుకుంది. ఈ మూమెంట్ కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో వెయిట్ చేసారు. ఫైనల్లి వాళ్ళ ఆశ తీరిపోయింది. అందుకే ఆమె పేరుని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Mamitha Baiju:సంచలన నిర్ణయం తీసుకున్న మమితా బైజు!

తనుజ వండిన వంటకాలే హైలెట్ :

ఫైనల్ రౌండ్‌లో తనూజ(Tanuja )బాసా చేప విత్ చింతచిగురు, మటన్ బిర్యానీ, ఖర్గా మసాలా స్టఫ్డ్ స్కిన్ చికెన్, క్రిస్పీ అవకాడో, ఇరానీ చాయ్ డెజర్ట్ వంటి వంటకాలను సిద్ధం చేసింది. చాలా స్పెషల్గా హెల్తీగా ప్రిపేర్ చేసే విధానం చాలా క్లియర్ గా ఉండడంతో ఆమె విన్నర్గా నిలిచింది. ఆమె తయారు చేసిన వంటకాల రుచికి జడ్జిలు, సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు.

- Advertisement -
Advertisement

సీజన్ 1లో రన్నరప్.. సీజన్ 2లో విన్నర్:

తనుజకు కుక్ విత్ జాతి రత్నాలు షో కొత్తేమీ కాదు. మొదటి సీజన్ లో ఆమె పాల్గొని రన్నరప్ గా నిలిచింది. ఆ సీజన్లో సుజిత్ టైటిల్ గెలుచుకున్నారు. అయితే రెండో సీజన్లో తనూజ మరింత పట్టుదలతో పోటీచేసి ఆమె అనుకున్నది సాధించింది. చివరకు విజేతగా నిలిచింది. “ముద్దమందారం” సీరియల్ తో గుర్తింపు తెచ్చుకున్న తనుజ బిగ్ బాస్ లో తనదైన శైలితో అభిమానులు సంపాదించుకుంది. ఇప్పుడు కుక్ విత్ జాతి రత్నాలు విజయంతో ఆమె కెరియర్లో మరో మైలురాయిగా నిలిచిపోయింది. ఆమె అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఆమె నీతి నిజాయితీయే ఆమె విన్నింగ్ కి కారణం అంటూ పొగిడేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో తనూజ పేరు బాగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది..!!

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you