Wednesday, July 22, 2026
HomeLATESTVishnu Vishal:అరుదైన వ్యాధితో బాధపడుతున్న స్టార్ హీరో.. షాకింగ్ విషయాలు బట్టబయలు!

Vishnu Vishal:అరుదైన వ్యాధితో బాధపడుతున్న స్టార్ హీరో.. షాకింగ్ విషయాలు బట్టబయలు!

Vishnu Vishal: ప్రముఖ కోలీవుడ్ హీరో ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు ఆ విషయాన్ని అభిమానులతో ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు

on
- Advertisement -banner Ad

Vishnu Vishal:సినిమా సెలబ్రిటీలు తెరపై అందంగా ,హుందాగా, సంతోషంగా కనిపించినప్పటికీ తెర వెనుక వారు పడే కష్టాలు వర్ణనాతీతం. ముఖ్యంగా కోలుకోలేని జబ్బులతో కొంతమంది బాధపడితే.. మరి కొంతమంది ఆ సమస్యలను అధిగమించడానికి ఎన్నో చికిత్సలు తీసుకుంటూ ఉంటారు. మరి కొంతమంది ఆ వ్యాధులను జయించలేక స్వర్గస్తులైన వారు కూడా ఉన్నారు. ఇకపోతే ఇక్కడ ఒక యంగ్ టాలెంటెడ్ హీరో గత కొంతకాలంగా తాను అలాంటి జబ్బుతో బాధపడుతున్నాను అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆయన ఎవరో కాదు కోలీవుడ్ టాలెంటెడ్ హీరో విష్ణు విశాల్.

అలాంటి వ్యాధితో బాధపడుతున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో..

పేరుకే తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా ప్రేక్షకులను అలరించారు . ముఖ్యంగా ఈయన నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా విడుదలవుతూ ఇటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తున్నాయి..ముఖ్యంగా దగ్గుబాటి రానా అరణ్య, ఎఫ్ ఐ ఆర్ వంటి తెలుగు చిత్రాలలో కూడా నటించారు. ఇకపోతే హైదరాబాద్ కి చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా ఈయన ఆరోగ్యం గురించి కొన్ని రకాల రూమర్లు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఒక ఎమోషనల్ నోట్ పంచుకున్నారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Samantha:హమ్మయ్య.. శుభవార్త చెప్పిన సమంత.. కానీ?

ఎమోషనల్ నోట్ పంచుకున్న విష్ణు విశాల్..

విష్ణు విశాల్ (Vishnu Vishal)పంచుకున్న ఆ ఎమోషనల్ నోట్ విషయానికొస్తే.. “అందరికీ నమస్కారం.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న మీ కామెంట్స్, మెసేజ్లు చూసి మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు , శ్రద్ధకు రుణపడి ఉంటాను. ఇది నిజంగా నాకు చాలా విలువైనది. అందుకే ఈ విషయాన్ని నేను మీ అందరితో కూడా పంచుకోవాలనుకున్నాను. ఈమధ్య నా ముఖం చాలా అలసిపోయినట్టు కనిపిస్తోందని మీలో చాలామంది గమనించారు. దీనికి కారణం నేను గత నాలుగు సంవత్సరాలుగా ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నాను.

- Advertisement -
Advertisement

ALSO READ:Singer Sunitha: ఇండస్ట్రీ మహిళలకు సేఫ్ ప్లేస్ కాదు .. సింగర్ సునీత బోల్డ్ స్టేట్మెంట్!

రుణపడి ఉంటాను..

చికిత్సలో భాగంగా వైద్యులు కొన్ని మందులను సూచించారు. వాటిని తీసుకున్నందుకు నేను ఇలా మారిపోయాను. ముఖ్యంగా ఈ మందులు తీసుకుంటున్నప్పుడు కడుపుబ్బరంతో పాటు శరీరంలో కొన్ని మార్పులు కూడా కలుగుతున్నాయి. నా ఆరోగ్యానికి నేను మొదట ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాను ..అందుకే వైద్య పరంగా ఈ చికిత్స చాలా అవసరం. ఈ క్లిష్ట సమయంలో మీ ప్రేమ, అభిమానం నన్ను ముందుకు నడిపిస్తున్నాయి. ఇటీవల నేను నటించిన మట్టి కుస్తీ 2 కోసం విశ్రాంతి లేకుండా పనిచేసిన ప్రతి ఒక్కరి పట్ల నాకున్న బాధ్యతను నిర్వర్తించాలనుకుంటున్నాను. అందుకే నేను ప్రమోషన్ లకి కూడా హాజరవుతూనే ఉన్నాను ” అంటూ విష్ణు విశాల్ ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు. మొత్తానికైతే విష్ణు విశాల్ తనకు ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉన్నట్లు తెలిపి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఇదిలా ఉండగా మరొకవైపు సమంతా కూడా ఇలా ఆటో ఇమ్యూన్ సమస్యతో బాధపడి కోలుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -
Advertisement

 

View this post on Instagram

 

A post shared by Vishnu Vishal (@thevishnuvishal)

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you