Wednesday, June 24, 2026
HomeINTERVIEWSSinger Sunitha: ఇండస్ట్రీ మహిళలకు సేఫ్ ప్లేస్ కాదు .. సింగర్ సునీత బోల్డ్ స్టేట్మెంట్!

Singer Sunitha: ఇండస్ట్రీ మహిళలకు సేఫ్ ప్లేస్ కాదు .. సింగర్ సునీత బోల్డ్ స్టేట్మెంట్!

Singer Sunitha: ప్రముఖ సింగర్ సునీత తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఇండస్ట్రీ మహిళలకు సేఫ్ కాదు అంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది.

on
- Advertisement -banner Ad

Singer Sunitha: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సింగర్ సునీత(Singer Sunitha) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో అంతకుమించిన గాత్రంతో శ్రోతలను అలరించే ఈమె ఎంతో మంది హీరోయిన్లకు గాత్ర దానం చేసింది. ముఖ్యంగా సీనియర్ స్టార్ హీరోయిన్లను మొదలుకొని యంగ్ బ్యూటీల వరకు ఎంతో మందికి డబ్బింగ్ చెప్పిన ఈమె.. తన వాయిస్ తో అందరి దృష్టిని మెస్మరైజ్ చేసింది. అలాంటి ఈమె తాజాగా ఇండస్ట్రీ అమ్మాయిలకు అంత సేఫ్ కాదు అంటూ ఊహించని కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి సింగర్ సునీత అలాంటి కామెంట్లు చేయడం వెనుక అసలు కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఇండస్ట్రీ అమ్మాయిలకు సేఫ్ కాదు..

సింగర్ సునీత మాట్లాడుతూ..”సినిమా ఇండస్ట్రీ ఖచ్చితంగా మహిళలకు సేఫ్ కాదు.. నేను ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ ఉమెన్ అయినప్పటికీ కూడా ఈ మాట చెబుతున్నాను. బయటకు వచ్చి.. ఇండస్ట్రీలో నాకు ఇలా జరిగింది తెలుసా ? అని మాట్లాడడం మాత్రం నాకు ఇష్టం ఉండదు . ఎందుకంటే ఇది ఇండస్ట్రీలో ఉండే ప్రతి మహిళ యొక్క సమస్య. ఇండస్ట్రీలో దోపిడీ ఉంది.. చేతులు వేయడం వంటివి ఈ రోజుల్లో పెద్ద విషయాలే కాదు. ముఖ్యంగా నాకు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులను ఎన్నో ఎదుర్కొన్నాను. అందుకే ఇవన్నీ ఇప్పుడు చర్చించడం నాకు ఇష్టం లేదు..

- Advertisement -

ALSO READ:Faima: 9 ఏళ్ల ప్రేమ.. సడన్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన ఫైమా!

ఈ సమస్య ఎప్పటికీ ఎండ్ కాదు..

అయితే ఇది ఎక్కడ ఎండ్ కాదు.. ఇండస్ట్రీలో ఒకరు ఒకళ్ళతో పెద్దమనిషిలా బిహేవ్ చేయొచ్చు.. అదే పెద్దమనిషి ఇంకొకరితో ఇంకోలా బిహేవ్ చేయొచ్చు.. డ్రెస్సింగ్ కి సంబంధించి నా శరీరం నా ఇష్టం అని మహిళ చెబితే.. అతడి కళ్ళు అతడి ఇష్టం అనే మాట బయటకు వస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్లు, మగవాళ్ళు సమానం కానే కాదు.. సిగరెట్ లైట్ ను టార్చ్ ఫర్ ది ఫ్రీడమ్ అనుకుంటున్నారు” అంటూ ఇండస్ట్రీలో మహిళల పట్ల చూస్తున్న తీరుపై ఆమె సెన్సేషనల్ కామెంట్లు చేసింది . మొత్తానికైతే సింగర్ సునీత ఇండస్ట్రీ గురించి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -

ALSO READ:OTT : వెన్నులో వణుకు పుట్టిస్తున్న క్రైమ్ మూవీ.. ఓటీటీని షేక్ చేస్తున్న రియల్ స్టోరీ!

క్యాస్టింగ్ కౌచ్ పై నెటిజన్స్ కామెంట్స్..

ఇకపోతే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ సమస్య ఉందనడానికి ఎంతో మంది హీరోయిన్లు ఉదాహరణగా చెప్పుకోవాలి. సమంత, అనుష్క లాంటి స్టార్ హీరోయిన్లు కూడా మహిళల సేఫ్టీ కోసం ఒక కమిటీ వేయాలని కోరారు అంటే ఇక ఇండస్ట్రీలో మహిళలు ఏ రేంజ్ లో పరిస్థితులు ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవచ్చు అంటూ సునీత మాటలు విన్న నెటిజన్స్ కూడా సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా చూసే చూపును బట్టి చేసే పనులను బట్టి పరిస్థితులు మారిపోతాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you