Netflix:ఇండియా – పాకిస్తాన్ గురించి ఎలాంటి చిన్న సంఘటన జరిగినా సరే క్షణాలలో వైరల్ గా మారుతూ ఉంటుంది.. ముఖ్యంగా అది సినిమాలైనా.. క్రికెట్ అయినా సరే.. ఆఖరికి యుద్ధం అయినా వైరల్ గా మారుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ కి చెందిన ఒక వెబ్ సిరీస్ చుట్టూ తీవ్ర వివాదం నెలకొంది. నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ జో బచాయ్ హై సంగ్ సమైట్ డిసెంబర్ 4న స్ట్రిమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ భారతదేశంలో విడుదల చేస్తే నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్టులకు సహకరించబోమంటూ, షూటింగ్ లు ఆపివేస్తామంటూ పలువురు కార్మిక సంఘాలు సైతం (FWICE) గట్టి హెచ్చరికను జారీ చేసింది.
నెట్ ఫ్లిక్స్ ను హెచ్చరించిన కార్మిక సంఘాలు..
ఫహాద్ ఖాన్, మహిరా ఖాన్, హనీయా అమీర్, సనమ్ వంటి ప్రముఖ పాకిస్తాన్ నటులు ఇందులో నటించారు. ఈ సిరీస్ ట్రైలర్ విడుదలైన తర్వాత భారత దేశంలో సినీ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలయ్యింది.. ఈ సిరీస్ ను ఇండియాలో స్ట్రీమింగ్ చేస్తే నెట్‌ఫ్లిక్స్(Netflix) ప్రాజెక్టులకు షూటింగ్‌ను ఆపివేస్తామంటూ.. FWICE అధ్యక్షుడు బియ్యం తివారి స్పష్టం చేశారు. తమకు దేశమే ముఖ్యమని పాకిస్తానీ కళాకారుల కంటెంట్ కి తాము వ్యతిరేకమని తేల్చి చెప్పేశారు. ఒకవేళ ఆ ఫ్లాట్‌ఫామ్ తమ ఆదేశాలను పాటించకపోతే మాత్రం అన్ని నెట్‌ఫ్లిక్స్ నిర్మాణాల నుంచి తమ సభ్యత్వాలను కూడా విరమించుకుంటామని వెల్లడించారు.
also read:Akhil Akkineni:జపాన్‌లో అఖిల్ అక్కినేని సందడి.. ‘లెనిన్’ కోసం స్పెషల్ ప్రమోషన్స్.. ఎప్పుడంటే?
తొలగించకపోతే మీకే ఇబ్బంది అంటూ హెచ్చరిక..
అంతేకాకుండా దాని లొకేషన్ లో షూటింగ్‌లను కూడా ఆపి వేస్తామని హెచ్చరించారు. ఇండియాలో పని చేస్తున్న అన్ని స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లకు కూడా పాకిస్తానీ కంటెంట్ ను ప్రదర్శించవద్దంటూ గత ఏడాది ప్రభుత్వం ఆదేశించిన విధానాలను లేదా జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండే కంటెంట్ ని ప్రదర్శించబోమని నెట్ ఫ్లిక్స్ అంగీకరించిందని కూడా తెలియజేశారు.. అయినప్పటికీ ఒక పాకిస్తానీ సిరీస్ ప్రోమోను విడుదల చేసిందని.. ఈ సంస్థ నియంత్రణ అమెరికా నుంచి ఉందనే ప్రసారం కూడా అక్కడే నుంచే జరుగుతోందంటూ అందుకే హెచ్చరిస్తున్నామని తెలిపారు.
also read:Tollywood:ఒకే ఏడాది నాలుగు పాన్ ఇండియా బాంబులు.. బాక్సాఫీస్‌కు పండగే!
మంచి సంబంధాలు ఉన్నాయి..ఆ బంధాన్ని పోగొట్టుకోకండి..
ఇండియాలో ఏ మూల నుంచి అయినా జరిగి ఉంటే మేము దానిని ఇప్పటికే ఆపివేసే వాళ్ళము. ఇప్పటివరకు నెట్‌ఫ్లిక్స్ తో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. కచ్చితంగా వాటిని ఆపకపోతే ఎక్కడైతే వారి షూటింగ్ జరుగుతుందో అక్కడి నుంచి నేను మా సిబ్బందిని ఉపసంహరించుకుంటాను అంటూ తెలియజేశారు. దీంతో ప్రతి దేశంలో కూడా వారు షూటింగ్ ఆగిపోతుందని హెచ్చరించారు . దీంతో మరొకవైపు ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ కూడా ఈ సిరీస్ ని నిషేధించాలంటూ ప్రధాన మంత్రి మోడీకి లేఖ రాస్తూ డిమాండ్ చేశారు. ఇండియాలో పాకిస్తానీ కంటెంట్ పైన ఉన్న ఆంక్షలు , ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ఏర్పడిన పరిణామాలను ప్రస్తావిస్తూ డిసెంబర్ 4 లోపు ఈ సిరీస్ ను తొలగించకపోతే పరిస్థితులు వేరేగా ఉంటాయని హెచ్చరించారు. దీంతో ఈ విషయం పైన నెట్‌ఫ్లిక్స్ ఇంకా అధికారికంగా సరైన స్పష్టత ఇవ్వలేదు.. డిసెంబర్ 4 దగ్గర పడుతున్న కొద్ది ఈ వివాదం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది..




