hero karthi:కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన కార్తీ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి.. ముఖ్యంగా ఆయన ఎప్పుడూ కూడా విభిన్నమైన పాత్రలు చేయడానికి మక్కువ చూపుతుంటారు. కానీ 2019లో వచ్చిన ఖైదీ సినిమా మాత్రం కార్తీ కెరియర్ లోనే ఒక స్పెషల్ అని కూడా చెప్పవచ్చు. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కార్తీ కెరియర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. 2019లో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఖైదీ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టింది.
కార్తీ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్..
ఈ చిత్రం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా భారీ విజయాన్ని అందించింది. ఇందులో నటించిన ప్రతి ఒక్కరి పాత్ర కూడా ఆకట్టుకుంది. కార్తి నటించిన ఢిల్లీ బాబు పాత్ర ఈ సినిమాకి మరింత హైలెట్గా నిలిచింది. అందుకే ఈ సినిమా సీక్వెల్ పైన కూడా చిత్ర బృందాన్ని, హీరో కార్తీ ని ఎక్కడ కనిపించినా కూడా అడుగుతూ ఉంటారు. ఈ సినిమాలో కార్తీ తప్ప మరెవరు కూడా సెట్ అవ్వరు అనే విధంగా నటించారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన న్యూస్ వైరల్ గా మారింది.
also read:Nandi awards:నంది అవార్డులపై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. చైర్మన్గా బాలకృష్ణ..!
ఖైదీ సినిమాకి మొదటి ఛాయిస్..
అదేమిటంటే ఖైదీ సినిమాకి మొదటి ఛాయిస్ హీరో కార్తీ(hero karthi) కాదట.. ఈ సినిమా కోసం ముందుగా ఒక స్టార్ హీరోని అనుకున్నారట. అయితే అది కొన్ని కారణాల చేత ఆ హీరో తప్పుకోవడంతో కార్తీకి అవకాశం వచ్చిందని సమాచారం. అలా ఖైదీ సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో కాదు విజయ్ సేతుపతి.. ఈయనే ఈ విషయాన్ని స్వయంగా తెలియజేశారు.. ఖైదీ సినిమా ముందు నా దగ్గరకే వచ్చింది ఆ ప్రాజెక్టు గురించి కూడా చర్చలు జరిగాయి. అయితే కొన్ని కారణాల చేత చివరికి ఒప్పుకోలేదు. కానీ కార్తీ ఆ సినిమా చేయాలనుకున్నారు.. నాకు ఫోన్ చేసి.. నేను చేస్తానయ్యా అన్నారు .. అందుకే చాలా బాగా చేయండి సార్ అని చెప్పానంటూ తెలిపారు.
also read:Rohit Naidu:రాంప్రసాద్ గుంట నక్క.. దెబ్జానీ ఫేక్జానీ.. రోహిత్ షాకింగ్ కామెంట్స్!
అందుకే వదిలేసాను..
లోకేష్ కనగరాజ్ కూడా నాకు బాగా తెలుసు. నాకు సోదరుడు లాంటి వాడు, నాకు కార్తీ పట్ల చాలా గౌరవం ఉంది. కథ విన్నప్పుడే ఈ సినిమా విజయమందుకుంటుందని అర్థం అయింది . తెలుగు , తమిళ భాషలలో ఈ సినిమా చాలా బాగా ఆడుతుందని కూడా చెప్పాను. ఇది అద్భుతమైన చిత్రం.. మంచి సినిమా. ఒక మంచి మూవీ ని కోల్పోయానని బాధ పడడం లేదు” అంటూ తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒకవేళ విజయ్ సేతుపతి ఖైదీ సినిమాలో చేసి ఉంటే ఎలా ఉండేదో అంటూ అభిమానులు, నెటిజన్స్ సైతం కామెంట్ చేస్తున్నారు.
#Kaithi came to me, and we were in talks about the project, but it didn’t get fixed. #Karthi sir wanted to do it. He called me and said, “Yov VS, naan panran ya.” I said, “Super-ah pannunga, sir.”
I don’t have any worries. I’ve known #LokeshKanagaraj well; he’s like my brother. I have great respect for #Karthi. I knew the movie would be successful after the narration. I told them the movie would run great in Tamil and Telugu. It’s a superb film and a good film. I don’t think I’ve missed another good film like that.
– #VijaySethupathi https://t.co/4w0Cl4kUAv— Movies Singapore (@MoviesSingapore) November 26, 2026




