Tuesday, July 21, 2026
HomeLATESTOTT: ఒక్కో హత్య వెనుక ఒక్కో ట్విస్ట్.. ప్రతి క్లూ మోసం.. చివరిలో మైండ్ బ్లాక్...

OTT: ఒక్కో హత్య వెనుక ఒక్కో ట్విస్ట్.. ప్రతి క్లూ మోసం.. చివరిలో మైండ్ బ్లాక్ అయ్యే థ్రిల్లర్!

OTT:అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న M4M: Motive For Murder మూవీ ప్రస్తుతం ఓటీటీలో ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

on
- Advertisement -banner Ad

OTT:ప్రస్తుతం ఓటీటీ ప్రేక్షకులు సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. చివరి వరకు ఉత్కంఠని కొనసాగించే కథలు.. ఊహించని మలుపులు.. బలమైన స్క్రీన్ ప్లే ఉన్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. అలాంటి చిత్రాలలో ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా ‘M4M: మోటివ్ ఫర్ మర్డర్’ థియేటర్లలో పెద్దగా వాణిజ్య విజయం సాధించకపోయినా ఇప్పుడు ఓటీటీ(OTT)లో ఈ చిత్రం కొత్త ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది

ఉత్కంఠ భరితమైన కథ :

మోహన్ వడ్లపట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సైకలాజికల్ లో అమెరికన్ నటి జో శర్మ, సంబిత్ ఆచార్య ప్రధాన పాత్రలో నటించారు. హైదరాబాద్ నగరంలో వరుసగా జరుగుతున్న దారుణ హత్యల నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ హత్యలు సాధారణమైనవి కావు. హంతకుడు మృతదేహాలను గుర్తుపట్టలేని విధంగా మార్చి వాటిపై పెయింటింగ్ చేయడం కేసును మరింత క్లిష్టంగా మార్చేస్తుంది. ఈ విచిత్రమైన నేరాల వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటన్న ఆసక్తి దర్శకుడు ప్రారంభం నుంచే పెంచుతాడు.

- Advertisement -
Advertisement

ALSO READ:Jabardasth:జబర్దస్త్‌ లో షాకింగ్ మార్పు..ఇకపై ఆ రోజే టెలికాస్ట్.. ఈటీవీ అధికారిక ప్రకటన!

దర్యాప్తులో మలుపులే మలుపులు :

ఈ కేసును చేదించే బాధ్యత ఏసీపీ కృష్ణతో పాటు పరిశోధనాత్మక జర్నలిస్టు రాధాపై పడుతుంది. ప్రతి హత్య వెనుక ఒక ప్రత్యేక సందేశం.. ఉండడం దర్యాప్తులో బయటపడే కొత్త ఆధారాలు పాత్రల గతానికి సంబంధించిన కీలక విషయాలు కథను మరింత ఉత్కంఠ భరితంగా మారుస్తాయి. అసలు సైకో కిల్లర్ ఎవరు..? ఈ హత్యలు వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి..? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చివరి వరకు చూడాల్సిందే. దర్శకుడు కథను ఆసక్తికరమైన ట్విస్టులతో ముందుకు నడిపించడం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

- Advertisement -
Advertisement

ALSO READ:Anupama:హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కు లవ్ బ్రేకప్..?

ఓటీటీలో మంచి స్పందన :

థియేటర్లలో విడుదలైన సమయంలో విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నప్పటికీ సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో ఈ సినిమా ఆశించిన స్థాయిలో వస్తువులు సాధించలేకపోయింది. అయితే కథ , స్క్రీన్ ప్లే, థ్రిల్లింగ్ అంశాల కారణంగా ప్రేక్షకులనుంచి సానుకూల స్పందన లభించింది. ఈండ్భ్ కూడా ఈ చిత్రానికి మంచి రేటింగ్ నమోదయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు లయన్స్‌గేట్ ప్లేలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది . సస్పెన్స్ సైకాలజికల్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే వారికి నిలుస్తుంది అని చెప్పవచ్చు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you