Tuesday, July 21, 2026
HomeLATESTAnupama:హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కు లవ్ బ్రేకప్..?

Anupama:హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కు లవ్ బ్రేకప్..?

Anupama : ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ చెప్పుకుంది అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

on
- Advertisement -banner Ad

Anupama:తెలుగు సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్గా పేరు సంపాదించిన వారిలో అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు. అందం, అభినయంతో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ వంటి భాషలలో పలు చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. అటు ట్రెడిషనల్, ఇటు గ్లామరస్ పాత్రలలో ఆకట్టుకున్న అనుపమ.. గత ఏడాది ఏకంగా అరడజన్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ప్రస్తుతం కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న అనుపమ గత కొద్దిరోజులుగా ఈమె వ్యక్తిగత జీవితం గురించి కొన్ని విషయాలు వైరల్ గా మారాయి. ముఖ్యంగా ప్రముఖ కోలీవుడ్ హీరో ధృవ్ విక్రమ్ తో ప్రేమలో ఉందనే ప్రచారం అయితే జోరుగా వినిపించింది.

ఎవరి అనుమతి అక్కర్లేదు – అనుపమ

ఈ రూమర్స్ పైన అటు అనుపమ(Anupama) గానీ ఇటు ధ్రువ్ విక్రమ్ కాని ఎక్కడ స్పందించలేదు. చివరిగా అనుపమ మే నెలలో తన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్టుని చేసింది . మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు పోస్ట్ చేస్తూ ఇకపై తనకు ఎవరు పర్మిషన్ అవసరం లేదని, ఇప్పుడు ఎలాంటి భయాలు లేవు, వేరొకరి అప్రూవల్స్ కోసం, క్యాప్షన్ కోసం ఎదురు చూడాల్సిన పని లేదంటూ రాసుకుంది. కొన్నిసార్లు మనశ్శాంతిని పొందాలి అంటే ఫలితం లేని దారులను వదిలేయాల్సి ఉంటుంది. ఈరోజు ఆ ప్రశాంతత నన్ను వెతుక్కుంటూ వచ్చింది అన్నట్టుగా తెలియజేసింది.

- Advertisement -
Advertisement

also read:Varun Tej:మెగా హీరో కాలికి గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్!

ప్రకృతిని ఆస్వాదిస్తూ ఫోటోలు షేర్ చేసిన అనుపమ..

శనివారం రోజున అనుపమ ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే అనుపమ ఈ మాటలకు.. సముద్ర తీరాన ఎంజాయ్ చేస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్న ఫోటోలను, వీడియోని జత చేసింది. అంతేకాకుండా వరుసగా ఇన్ని ఫోటోలు పెట్టినందుకు క్షమించండి. ఒక విషయం అయితే అర్థం అయింది. మనం ఎవరి ఆమోదాల కోసం, ఒక పాట ఎంపిక కోసము లేదా మరొకరు రాసే క్యాప్షన్ కోసమో వేచి చూడాల్సిన అవసరం లేనప్పుడు.. సోషల్ మీడియాలో పోస్టులు చేయడం కూడా చాలా సరదాగే ఉంటుందంటూ రాసుకొచ్చింది.

- Advertisement -
Advertisement

also read:Nayanthara :నయనతార ‘హాయ్’ మూవీకి భారీ డీల్.. రిలీజ్‌కు ముందే షాకింగ్ అనౌన్స్‌మెంట్!

అనుపమ బ్రేకప్ చెప్పుకుందా?

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నెటిజన్స్ సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా అనుపమ కి లవ్ బ్రేకప్ అయ్యిందా అనే అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఈ విషయం పైన ఎవరు కానీ అఫీషియల్ గా ప్రకటించలేదు. కానీ అనుపమ ఇన్స్టా పోస్టులతో వీరిద్దరు విడిపోయారని ప్రచారం అయితే జరుగుతోంది. అంతే కాకుండా ధ్రువ్ విక్రమ్(Dhruv Vikram) ను కూడా ఇంస్టాగ్రామ్ లో అన్ఫాలో చేసినట్లు సమాచారం.

- Advertisement -
Advertisement

https://www.instagram.com/reel/Da8ENlupMSX/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you