Wednesday, July 22, 2026
HomeLATESTOTT: ఓటీటీలోకి వడ్డే నవీన్ ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT: ఓటీటీలోకి వడ్డే నవీన్ ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT: సీనియర్ హీరో వడ్డే నవీన్ రీ ఎంట్రీలో నటించిన ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఇప్పుడు స్ట్రీమింగ్ కి రాబోతోంది.

on
- Advertisement -banner Ad

OTT:సీనియర్ హీరోలు సైతం ఈ మధ్యకాలంలో ఓటీటిలలో ఎంట్రీ ఇచ్చి తమ హవా కొనసాగిస్తున్నారు. మరికొంతమంది పలు సినిమాలలో కీలకమైన పాత్రలో నటిస్తూ, మరి కొంతమంది ఇప్పటికీ హీరోలుగా నటిస్తూ బాగానే పేరు సంపాదిస్తున్నారు. అలా 1990వ దశకంలో లవ్ స్టోరీలు ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా అలరించిన హీరో వడ్డే నవీన్(Vadde Naveen) గురించి చెప్పాల్సిన పనిలేదు. దాదాపుగా పదేళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న వడ్డే నవీన్ ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చారు. ఆయన నటించిన ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇందులో రాశి సింగ్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ఒక మోస్తారు గానే ఆకట్టుకుంది.

ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు ఓటీటీ స్ట్రీమింగ్..

కానీ వడ్డే నవీన్ సినిమాకి పోటీగా సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా విడుదల అవ్వడంతో ఈ సినిమాకి కొంత మైనస్ గా మారింది. అలాంటి సినిమా ఇప్పుడు ఓటీటిలోకి రానుంది.. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన జీ 5(zee5 Ott) సంస్థ దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే ఈనెల 17వ తేదీన ఈ సినిమా స్ట్రీమింగ్ కి రాబోతున్నట్లు ఓటిటి సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఎదురుచూపులు ముగిసాయి.. ఎప్పటినుంచి ఎదురు చూస్తున్న ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు సినిమా జులై 17న స్ట్రీమింగ్ కానుంది. జీ5లో తెలుగులో స్ట్రీమింగ్ కి రాబోతోంది.

- Advertisement -
Advertisement

also read:Tollywood:లాస్ట్ మినిట్ లో ‘శ్రీనివాస మంగాపురం’ టీం మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్!

హీరోగా గుర్తింపు..

డైరెక్టర్ కమల్ తేజ నర్ల తెరకెక్కించిన ఈ సినిమాలో దేవిశ్రీప్రసాద్, వివేక్ రఘువంశీ, శ్రీనివాస్ తదితర నటీనటులు ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి కళ్యాణ్ నాయక సంగీతం అందించగా సినిమాటోగ్రాఫర్ గా కార్తీక్ సుజాత సాయికుమార్ వ్యవహరించారు. మరి థియేటర్లో మిస్సయిన ఈ సినిమాని ఓటీటిలో చూసేయవచ్చు. 1997లో కోరుకున్న ప్రియుడు అనే సినిమా ద్వారా తన కెరీర్ ని మొదలుపెట్టిన వడ్డే నవీన్ ఆ తర్వాత పెళ్లి, ప్రియా ఓ ప్రియా, స్నేహితులు, మనసిచ్చి చూడు, మా బాలాజీ, చాలా బాగుంది, అయోధ్య, తదితర చిత్రాల నటించారు చివరిగా 2018లో క్రాంతి అనే చిత్రంలో నటించగా ఈ సినిమా యూట్యూబ్లో విడుదలయ్యింది. మళ్లీ ఇన్నాళ్ళ గ్యాప్ తర్వాత ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు సినిమాతో వచ్చారు.

- Advertisement -
Advertisement

also read:Trisha:ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. స్టార్ హీరోయిన్ త్రిష లైఫ్ లో న్యూ చాప్టర్ బిగిన్?

రీ ఎంట్రీ కలిసొస్తుందా?

వడ్డే నవీన్ రీ ఎంట్రీ వల్ల రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలలో నటించే అవకాశాలు వస్తాయని అభిమానులు భావిస్తున్నారు. మరి పాత్ర నచ్చితే వడ్డే నవీన్ ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధంగా ఉన్నారో లేదో చూడాలి మరి హీరోగానే కంటిన్యూ చేస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you