Wednesday, September 30, 2026
HomeLATESTBigg Boss:బిగ్ బాస్ హౌస్‌లో ముఖేష్–వర్షిణి రొమాంటిక్ వీడియో వైరల్..!

Bigg Boss:బిగ్ బాస్ హౌస్‌లో ముఖేష్–వర్షిణి రొమాంటిక్ వీడియో వైరల్..!

Bigg Boss:ముఖేష్ వెనక నుంచి వర్షిణిని హగ్ చేసుకోవడం, వర్షిణి “వద్దు.. వదిలే” అనేటట్లు చెప్పే విధంగా ఆ వీడియో ఉంది.

on
- Advertisement -banner Ad

Bigg Boss:బిగ్ బాస్ సీజన్ 10 ఎంత రసవత్తరంగా సాగుతుంది అనేది ప్రతిరోజూ ఫాలో అయ్యే వాళ్లకి తెలుస్తూనే ఉంటుంది. అసలు బిగ్ బాస్ చూడకూడదు, దాని వల్ల ఎవరికి ఉపయోగం లేదు అనుకుంటూనే చాలామంది బిగ్ బాస్‌కి కనెక్ట్ అయిపోతూ ఉంటారు. బిగ్ బాస్ చూడకపోతే నిద్ర పట్టదు అన్న రేంజ్‌లో కూడా అభిమానులు బిగ్ బాస్‌కి ఉన్నారని చెప్పడంలో సందేహమే లేదు.

తాజాగా జరిగిన ఎపిసోడ్‌పై చర్చ :

తాజాగా జరిగిన ఎపిసోడ్ చూసిన జనాలు మాత్రం.. “వామ్మో! ఏంటి పెర్ఫార్మెన్స్? ఇదంతా ఫేక్ అని తెలుసు.. వాళ్లకు అర్థం కావడం లేదా?” అంటూ మాట్లాడుకుంటున్నారు. కొన్ని కొన్ని సార్లు బిగ్ బాస్‌లో చూపించే సీన్స్ పూర్తిగా కల్పితం అనేలా ఉంటాయి.

- Advertisement -
Advertisement

మరి కొంతమంది కంటెస్టెంట్స్ తెరపై నటిస్తున్నారు, జీవించడం లేదు, ఆట ఆడడం లేదు అని కూడా కౌంటర్స్ వేస్తూ ఉంటారు. జనాలు రీసెంట్‌గా జరిగిన ఎపిసోడ్ కూడా అలానే అనిపించింది.

ముఖేష్, వర్షిణి హంగామా :

బిగ్ బాస్ (Bigg Boss)ఇచ్చిన టాస్క్‌ని ఫినిష్ చేసే పనిలో మిగతా కంటెస్టెంట్స్ బిజీ బిజీగా గేమ్ ప్లాన్స్ మొదలుపెడుతుంటే.. హౌస్‌లో గుడ్ బాయ్‌గా పేరు సంపాదించుకున్న ముఖేష్ గేమ్‌ని తనదైన స్టైల్‌లో ఆడకుండా సేఫ్‌గా సేఫ్ జోన్‌లో ఉండేలా ప్లాన్ చేస్తూ, ఎవరు దొరికితే వారితో మింగిల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న వర్షిణి.. ఇద్దరూ కొంచెం సేపు చేసిన హంగామా హైలైట్‌గా మారింది.

- Advertisement -
Advertisement

ఇప్పుడు ఆ విజువల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. ముఖేష్, వర్షిణి రొమాంటిక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

also read:Allu Sirish:లౌడ్ స్పీకర్లపై లొల్లి.. అల్లు శిరీష్ కి నెటిజన్ ఘాటు కౌంటర్..!

- Advertisement -
Advertisement

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో :

ముఖేష్ వెనక నుంచి వర్షిణిని హగ్ చేసుకోవడం, వర్షిణి “వద్దు.. వదిలే” అనేటట్లు చెప్పే విధంగా ఆ వీడియో ఉంది. అయితే వీళ్లు టాస్కులు ఆడకుండా ఇలా టాస్కుల పేరుతో రొమాన్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు అభిమానులు.

“మీరు హౌస్‌లో రొమాన్స్ చేసుకోండి.. మేం బయట నుంచి మిమ్మల్ని ఓట్లు వేసి గెలిపిస్తాం. అందుకేనా హౌస్‌లోకి వెళ్లింది? ఎందుకు? గేమ్ ఆడి ట్రోఫీ గెలుచుకోవడానికి. ఎవడు సేఫ్ గేమ్ వాడిది?” అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.

also read:Actress Anjali:పెళ్లిపై షాకింగ్ కామెంట్లు చేసిన హీరోయిన్ అంజలి..!

ముఖేష్‌పై నెగెటివిటీ? :

నిన్న మొన్నటి వరకు ముఖేష్‌కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ వర్షిణితో ఈ రొమాంటిక్ వీడియో బయటికి వచ్చాక ఆయన పరువు మొత్తం పోయినట్లు అయింది. ముఖేష్‌పై నెగెటివిటీ ఏర్పడింది.

“గేమ్ ఆడకుండా ఈ రొమాన్స్ ఏంటి రా బాబు?” అంటూ నెగిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. ఇది పూర్తిగా సేఫ్ గేమ్ అన్న విషయం ఇద్దరికీ తెలుసు. కంటెంట్ కోసమే ఇలా చేస్తున్నారు అన్న విషయం కూడా ఇద్దరికీ తెలుసు అంటూ మరి కొంతమంది ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.

నాగార్జున కౌంటర్ ఇస్తారా? :

దీనిపైన నాగార్జున వీకెండ్ ఎపిసోడ్‌లో కౌంటర్ ఇస్తే కానీ వీళ్లు మారరు అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ముఖేష్, వర్షిణి రొమాంటిక్ వీడియో బాగా వైరల్ అవుతోంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you