Saturday, August 8, 2026
HomeINTERVIEWSRitika Nayak:రితిక నాయక్‌కు ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా..!

Ritika Nayak:రితిక నాయక్‌కు ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా..!

Ritika Nayak:నటి రితిక నాయక్ తనకు అత్యంత ఇష్టమైన కంఫర్ట్ ఫుడ్ గురించి చెప్పిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Ritika Nayak:”రితిక నాయక్”.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరమే లేదు. మిరాయి సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టి ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ క్రేజీ హీరోయిన్ల లిస్ట్‌లోకి చేరిపోయింది. మొదట్లో ఈ అమ్మడు ఫోటోలు చూసినప్పుడు జనాలు పెద్దగా ఇంప్రెస్ అవ్వలేదు. కానీ మిరాయి సినిమాలో ఆమె నటనకు, ఆమె వేసిన డాన్స్ స్టెప్పులకు బాగా ఇంప్రెస్ అయిపోయారు. అదే కాకుండా ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పద్ధతి జనాలను ఇంప్రెస్ చేసే రూట్‌లో కుర్రాళ్లకు బాగా పిచ్చెక్కించేసింది.

మిరాయి సినిమాతో కెరీర్ టర్న్:

మిరాయి సినిమాతోనే టాప్ రేంజ్ హీరోయిన్ లిస్టులో చేరిపోయింది అంటే రితిక నాయక్ అందాల జాతర ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆమె చేసింది తక్కువ సినిమాలే, కానీ చేసిన ప్రతి సినిమా మాత్రం జనాలను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. దీంతో రితిక నాయక్ పేరు ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ హాట్‌గానే ట్రెండ్ అవుతూ ఉంటుంది. రీసెంట్‌గా కొరియన్ కనకరాజు సినిమాలో కూడా ఆమె నటించింది. ఆమె నటనకు మంచి మార్కులు వేయించుకుంది. కొరియన్ కనకరాజు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అటెండ్ అయిన ఇంటర్వ్యూలలో తన ఫ్యామిలీ గురించి, అదే విధంగా తన సినీ కెరీర్ గురించి, తన ఇష్టాయిష్టాల గురించి ఓపెన్‌గా బయటపెట్టింది. దీంతో సోషల్ మీడియాలో ఆమె పేరు మరోసారి ట్రెండ్ అవుతోంది.

- Advertisement -
Advertisement

also read:Chandana Shetty :చందన శెట్టి గుడ్ న్యూస్.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన నటి..!

కొరియన్ సిరీస్‌లు అంటే పిచ్చి:

రితిక నాయక్‌కు కొరియన్ సిరీస్‌లు అంటే చాలా చాలా ఇష్టమట. ఆమె ఫేవరెట్ కొరియన్ డ్రామా “వెన్ లైఫ్ గివ్స్ యూ ట్యాంజరిన్స్”. ఈ సిరీస్‌లో ప్రతి ఎపిసోడ్ చూసి ఆమె ఎమోషనల్ అయిందట. దీంతో పాటు మరెన్నో కొరియన్ ఎపిసోడ్లు కూడా చూసిందట. ఆ కారణంగానే భాష కూడా నేర్చుకుందట. కొరియన్ కనకరాజు సినిమాకు ఇది బాగా హెల్ప్ అయినట్లు చెప్పుకొచ్చింది.

- Advertisement -
Advertisement

also read:TV:ఈరోజు టీవీలో వచ్చే తెలుగు సినిమాలు పూర్తి మూవీ షెడ్యూల్..!

కంఫర్ట్ ఫుడ్ అంటే అదే:

అంతేకాదు, ఫుడ్ విషయం గురించి హోస్ట్ ప్రశ్నించగా ఓపెన్ గానే ఆన్సర్ ఇచ్చింది. తన కంఫర్ట్ ఫుడ్ అంటే మాత్రం టమాటో పులుసు, టమాటో పప్పు, అన్నం, చికెన్ ఫ్రై అంటూ చెప్పుకొచ్చింది. ఏదైనా ఫుడ్ బాగా విపరీతంగా తినేసి నాకు కంఫర్ట్ ఫుడ్ కావాలి అనుకున్నప్పుడు కచ్చితంగా ఇదే ప్రిఫర్ చేస్తుందట. దాంతో పాటు హైదరాబాద్ బిర్యానీ కూడా చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. దీంతో తెలుగు కుర్రాళ్లు అమ్మడు మాటలకు ఫిదా అయిపోయారు. రితిక నాయక్‌కు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్‌గా ఎదిగే రేంజ్ క్వాలిటీస్ ఉన్నాయి అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చూడాలి మరి, కొరియన్ కనకరాజు సినిమా హిట్‌తో రితిక నాయక్‌కు ఎలాంటి అవకాశాలు వస్తాయో అనేది..??

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you