Monday, September 21, 2026
HomeLATESTRashmika :తెలంగాణ యాస పై ట్రోల్స్..దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన రష్మిక కౌంటర్ !

Rashmika :తెలంగాణ యాస పై ట్రోల్స్..దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన రష్మిక కౌంటర్ !

Rashmika :తెలంగాణ యాసలో రష్మిక మందన్న మాట్లాడిన తీరుపై సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

on
- Advertisement -banner Ad

Rashmika :రష్మిక మందన్న.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఇప్పుడు ఎక్కడ చూసినా సరే రష్మిక మందన్న పేరు మారుమోగిపోతుంది. కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. బాలీవుడ్, అన్ని ఇండస్ట్రీల్లోనూ రష్మిక మందన్న గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.

సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. చాలామంది అలాంటి లిస్ట్‌లో ఉన్నారు. కానీ రష్మిక మందన్న మాత్రం పెళ్లి తర్వాత ఇంకా జెట్ స్పీడ్‌లో సినిమాలు కమిట్ అవుతూ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తుంది. ప్రజెంట్ ఆమె చేతిలో ఆరు బడా సినిమాలు ఉన్నాయి. అంటే రష్మిక మందన్న కెరీర్ ఏ రేంజ్‌లో ముందుకు దూసుకెళ్తుందో అర్థం చేసుకోవచ్చు.

- Advertisement -
Advertisement

యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టిన రష్మిక :

రీసెంట్‌గా నటించిన ‘మైసా’ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు. ‘మైసా’ టీజర్‌లో రష్మిక(Rashmika )మందన్న యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టేసింది. సాధారణంగా హీరోయిన్స్ ఇలాంటి యాక్షన్ సన్నివేశాల్లో డూప్‌ను ఉపయోగిస్తారని అందరికీ ఒక అపోహ ఉంటుంది. కానీ రష్మిక మందన్న మాత్రం ఎటువంటి డూప్ లేకుండా తన ఒరిజినాలిటీని ప్రూవ్ చేసుకుంది.

ఒక్క యాక్షన్ సన్నివేశంలో కూడా డూప్ లేకుండా అంతా ఆమె స్వయంగా చేసింది. దీనికి సంబంధించి మేకర్స్ ఆమెను బాగా ప్రశంసలతో ముంచెత్తారు.

- Advertisement -
Advertisement

also read:Ramanandana Couple:రమానందన వీసా స్కామ్ కేసులో మరో ఊహించని ట్విస్ట్..ఇక చచ్చింది గొర్రె..!

తెలంగాణ యాసలో రష్మిక మాటలు.. సోషల్ మీడియాలో వైరల్ :

రీసెంట్‌గా జరిగిన టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో రష్మిక మందన్న అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే ఆమె భాష, యాస గురించి ఒక రకమైన చర్చ జరిగింది. రష్మిక మందన్న ఒకప్పుడు సినిమా ప్రమోషన్స్‌లో మాట్లాడిన మాటలను, ఇప్పుడు ఆమె మాట్లాడుతున్న మాటలను సోషల్ మీడియాలో కంపేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement

ఒకప్పుడు రష్మిక మందన్న వచ్చీరాని తెలుగుతో ముద్దుముద్దుగా మాట్లాడేది అని.. కానీ ఇప్పుడు మాత్రం పక్కా తెలంగాణ అమ్మాయిలా తన మాట తీరును మార్చేసుకుంది అని అంటున్నారు.

also read:Jailer 2:నీలి చీరలో విద్యాబాలన్.. జైలర్ 2లో ఆ లుక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

విజయ్ దేవరకొండ పుణ్యమేనా? :

ఇదంతా విజయ్ దేవరకొండ పుణ్యమని.. విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె తెలంగాణ ఇంటి కోడలుగా మారిపోయింది అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. తెలంగాణ సాంప్రదాయాలను ఫాలో అవుతూ, తెలంగాణ పద్ధతులను అనుసరిస్తూ తెలంగాణ యాసలోనే మాట్లాడుతుంది అని అంటున్నారు. అది ఆమెకు తెలియకుండానే ఆటోమేటిక్‌గా అలా వచ్చేసింది అంటూ సోషల్ మీడియాలో రష్మిక మందన్నను ఓ రేంజ్‌లో పొగిడేస్తున్నారు.

భాషపై రష్మిక ఏమందంటే? :

దీనికి సంబంధించి ‘మైసా’ టీజర్ ఈవెంట్‌లో కూడా చిన్నపాటి చర్చ జరిగింది. ‘‘నేను ఎలాంటి భాష మాట్లాడినా, ఏ స్టైల్‌లో మాట్లాడినా మీకు అర్థమవుతుంది కదా? ఓకే.. ఐ యామ్ హ్యాపీ’’ అంటూ రష్మిక మందన్న సున్నితంగా ఈ అంశం ముగించేశారు.

దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు రష్మిక మందన్న పేరు బాగా హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. రష్మిక మందన్న తెలంగాణ యాసలో మాట్లాడే పద్ధతి అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ‘మైసా’ టీజర్‌లో దుమ్ము దులిపేసిన రష్మిక మందన్న త్వరలోనే ‘రణబలి’ ప్రమోషన్స్‌లో కూడా సందడి చేయబోతున్నట్లు తెలుస్తుంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you