Peddi:మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమా ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యింది అనేది అందరికి తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందన అందుకుంది. బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, శివరాజ్‌కుమార్, దివ్యేందు త్రిపాఠి తదితరులు కీలక పాత్రల్లో కనిపించి మెప్పించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమా కి బిగ్ ప్లస్ గా మారింది. జూన్ 4న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ వసూళ్లు సాధించి… ప్రస్తుతం ఓటీటీలోనూ ఈ మూవీ క్రేజీ సందడి చేస్తోంది.
సినిమాపై పరుచూరి ప్రశంసలు:
ప్రముఖ నటుడు, రచయిత పరుచూరి గోపాలకృష్ణ గురించి అందరికి తెలిసిందే. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు. ఈ మధ్యా యూట్యూబ్ ద్వార సినిమాలకి సంబంధించి ప్లస్ లు ఏంటి..? మైనస్ లు ఏంటి ? అనే వాటి పై ఓపెన్ గా స్పందిస్తున్నారు. రీసెంట్ గా ‘పెద్ది’ (Peddi)సినిమాను చూసి తన అభిప్రాయాలను ‘పరుచూరి పాఠాలు’ యూట్యూబ్ ఛానల్ ద్వారా వెల్లడించారు. సినిమా కథాంశాన్ని, రామ్ చరణ్ నటనను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఒక చిన్న గ్రామంలో రైలు ఆపించాలనే అంశాన్ని తీసుకుని మూడు గంటలకు పైగా కథను నడిపించడం దర్శకుడి సాహసమని పొగిడేశారు.
also read:Vijay Thalapathy: సంగీత, విజయ్ కేసులో బిగ్ ట్విస్ట్!
చరణ్ నటనే సినిమాకు బలం:
‘పెద్ది’ విజయానికి రామ్ చరణ్ నటన ప్రధాన కారణమని పరుచూరి అభిప్రాయపడ్డారు. ఈ పాత్రను చరణ్ తప్ప మరెవరైనా చేసి ఉంటే సినిమా ఈ స్థాయిలో హిట్ అయ్యేది కాదని చెప్పారు. కథ మొత్తాన్ని చరణ్ తన నటనతో ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. అలాగే జగపతిబాబు పాత్ర కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని, ఆయన ఎంతో అంకితభావంతో నటించారని ప్రశంసించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం కూడా సినిమాకు బలాన్ని చేకూర్చిందన్నారు.
also read:Varun Tej:సీనియర్ ఎన్టీఆర్ ని ట్రోల్ చేయడంపై క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్.
ఆ ఒక్క అంశమే అప్సెట్ చేసింది:
అయితే సినిమాలో కొన్ని లోపాలు ఉన్నాయని పరుచూరి ఓపెన్ గానే చెప్పరు. ముఖ్యంగా రామ్ చరణ్, జాన్వీ కపూర్ వేషధారణ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి పూర్తిగా సరిపోలలేదని అభిప్రాయపడ్డారు. కథ నేపథ్యానికి అనుగుణంగానే ఆ కాస్ట్యూమ్స్ ఎంచుకుని ఉండొచ్చని అన్నారు. హీరోయిన్ పాత్రకు తగినంత ప్రాధాన్యం, స్క్రీన్ టైమ్ లేకపోవడం కూడా మైనస్‌గా పేర్కొన్నారు.
రన్‌టైమ్ తగ్గిస్తే మరింత బాగుండేది:
‘పెద్ది’ సినిమా నిడివిని మరో 30 నుంచి 40 నిమిషాలు తగ్గించి ఉంటే సినిమా మరింత ప్రభావవంతంగా ఉండేదని పరుచూరి అన్నారు. హీరోయిన్ పాత్రను కొంత హైలెట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అని, అనవసరమైన సన్నివేశాలను తగ్గించి ఉంటే ఓటీటీలో సినిమాను మరింత మంది ప్రేక్షకులు చూసే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డారు.




