Saturday, June 27, 2026
HomeLATESTBahubali 3:బాహుబలి 3 వచ్చేస్తోంది.. రంగంలోకి అనుష్క - ప్రభాస్!

Bahubali 3:బాహుబలి 3 వచ్చేస్తోంది.. రంగంలోకి అనుష్క – ప్రభాస్!

Bahubali 3: ప్రభాస్ రానా మల్టీస్టారర్ గా వచ్చిన బాహుబలి సినిమాకు సంబంధించి బాహుబలి 3 రాబోతోందని ప్రభాస్ క్లారిటీ ఇచ్చారు.

on
- Advertisement -banner Ad

Bahubali 3:రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్(Prabhash), దగ్గుబాటి రానా(Rana) దిగ్గజ ద్వయంలో మల్టీస్టారర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బాహుబలి. తమన్నా, అనుష్క శెట్టి(Anushka) ప్రధాన పాత్రల్లో రమ్యకృష్ణ లీడ్ రోల్ పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించని విజయాలను సొంతం చేసుకుంది. ముఖ్యంగా అప్పటివరకు ప్రాంతీయంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన హీరోలు ఈ పాన్ ఇండియా వెర్షన్తో ఒక్కసారిగా తమ రూటు మార్చేశారు. ముఖ్యంగా తెలుగులో సినిమా తెరకెక్కినా.. ఒకేసారి అన్ని భాషల్లో విడుదలై పాన్ ఇండియా మూవీగా రికార్డు సృష్టించింది.

బాహుబలి 3 వస్తుందా?

శివగామి పాత్రలో రమ్యకృష్ణ రాజసం.. దేవసేన పాత్రలో అనుష్క నటన అందరిని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు వసూలు చేసి రికార్డులు సృష్టించింది ఈ సినిమా. అంతేకాదు ఈ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన బాహుబలి 2 కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన రెండవ చిత్రంగా నిలిచింది. ఇక ఈ సినిమాకి కొనసాగింపుగా బాహుబలి 3 కూడా రావాలని అప్పట్లో చాలా మంది అభిమానులు అనుకున్నారు. కానీ బాహుబలి అభిమానులను మెప్పించడానికి బాహుబలి ది ఎపిక్ పేరిట రెండు భాగాలను కలిపి గత ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -

బాహుబలి 3 పై అప్డేట్..

మరోవైపు బాహుబలి ది ఎటర్నల్ వార్ పేరుతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రా అన్నారు ఇందుకు సంబంధించిన టీజర్ ని కూడా విడుదల చేశారు. బాహుబలి ది టార్చ్ ఆఫ్ బేరర్ అనే నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నాలుగు ఎపిసోడ్లతో ప్రసారమవుతున్న ఈ వెబ్ సిరీస్ లో రాజమౌళి, అనుష్క, రాణా, ప్రభాస్, సెంథిల్ కుమార్, రమ్యకృష్ణ ఇలా వీరంతా కూడా సినిమా గురించి, సినిమా అనుభవాల గురించి అభిమానులతో పంచుకున్నారు . ఇక అందులో భాగంగానే అనుష్క, ప్రభాస్ , రానా కలిసి ముచ్చట్లు పెట్టుకోగా.. ఈ సందర్భంలో ఈ ముగ్గురు బాహుబలి 3 గురించి అప్డేట్ ఇచ్చేశారు.

ALSO READ:Blast Movie: ఓటీటీలో దడ పుట్టిస్తున్న యాక్షన్ థ్రిల్లర్.. గూస్ బంప్స్ గ్యారెంటీ!

- Advertisement -

క్లారిటీ ఇచ్చిన ప్రభాస్, రానా, అనుష్క..

ముఖ్యంగా వీరు ముగ్గురు చిట్ చాట్ చేస్తున్న సమయంలో.. రానా మాట్లాడుతూ.. అభిమానులు బాహుబలి 3 గురించి అడుగుతున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయం నేను చెప్పొచ్చో లేదో తెలియదు. రాజమౌళి ఇక్కడ లేడు కాబట్టి నేను సులభంగా చెప్పొచ్చు. ప్రపంచం దీనికోసం సిద్ధంగా లేదు. కానీ త్వరలో బాహుబలి 3 మీ ముందుకు రాబోతోంది” అంటూ రానా అనుష్క ప్రభాస్ ముగ్గురు కలిసి ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు . మొత్తానికైతే బాహుబలి 3 రాబోతోందని ప్రకటించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. ఇక బాహుబలి ఫ్రాంచైజ్ లో భాగంగా బాహుబలి 3 ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

రికార్డ్స్ ఖాయమా?

బాహుబలి గా ప్రభాస్ , భల్లాల దేవుడిగా రానా మరొకసారి ఢీకొట్టబోతున్నారని తెలియడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. మరి భారీ అంచనాల మధ్య రాబోయే ఈ బాహుబలి 3 ప్రేక్షకులను ఆకట్టుకొని మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని అటు ఏకంగా ఆస్కార్ కూడా అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇక రాజమౌళి విషయానికి వస్తే.. ప్రస్తుతం మహేష్ బాబుతో వారణాసి సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ సినిమా సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

- Advertisement -

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you