Blast Movie: ఎప్పటిలాగే ప్రతివారం కూడా ప్రేక్షకులను అలరించడానికి కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ శుక్రవారం కూడా ప్రేక్షకులను అలరించడానికి ముఖ్యంగా ఒక యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఆ చిత్రం ఏంటి? దాని కథ ఏంటో? ఇప్పుడు చూద్దాం..
ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న కొత్త మూవీ..
అదేదో కాదు బ్లాస్ట్.. ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రిలీజ్ కి ముందే సినిమాపై ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చింది. పైగా ఇందులో సీనియర్ హీరో, హీరోయిన్లు చాలామంది ఆడియన్స్ ఈ చిత్రాన్ని లైట్ తీసుకున్నారు. కానీ ఒక్కోసారి ఇలాంటి చిన్న సినిమాలు కూడా సంచలనాలు సృష్టిస్తాయని మరోసారి ఈ సినిమా నిరూపించింది. కేవలం మౌత్ టాక్ తోనే భారీ కలెక్షన్లు వసూలు చేసింది. రూ.15 కోట్ల బడ్జెట్ తో జరిగే సినిమా ఏకంగా రూ.75 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇప్పటికే అక్కడ పలు థియేటర్లలో ఈ సినిమా ఆడుతోంది. అయితే అంతలోనే ఓటీటీ ఆడియన్స్ ను అలరించడానికి వచ్చేసింది.
ALSO READ:Vishnu Vishal:అరుదైన వ్యాధితో బాధపడుతున్న స్టార్ హీరో.. షాకింగ్ విషయాలు బట్టబయలు!
అంచనాల లేకుండానే బ్లాక్ బస్టర్..
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జ(Arjun sarja) ప్రధాన పాత్రలో రాబోతున్న ఈ సినిమా ద్వారా సుభాష్ కె రాజ్ అనే కొత్త కుర్రాడు దర్శకుడుగా ఈ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. మొదటి సినిమానే అయినా తన అద్భుతమైన టేకింగ్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక ఇందులో చెప్పవే చిరుగాలి సినిమా హీరోయిన్ అభిరామి (Abirami) కన్నప్ప హీరోయిన్ ప్రీతి ముకుందన్ హీరోయిన్ లుగా నటించారు. వివేక్ ప్రసన్న, అర్జున్ చిదంబరం , వినోద్ సాగర్, పవన్, దిలీపన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
బ్లాస్ట్ సినిమా స్టోరీ..
నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. రాజారాం (అర్జున్ సర్జ)కరాటే లో ఛాంపియన్. కరాటే మాస్టర్ గా పనిచేస్తూ ఉంటారు. ఒక ఇన్స్టిట్యూట్ కూడా నడిపిస్తూ ఉంటాడు. ఇక ఈయన భార్య నీలవేణి (అభిరామి) కూడా కరాటే లో ఛాంపియన్. దీంతో కూతురు నీలా (ప్రీతి ముకుందన్) ను కరాటే ఛాంపియన్గా తయారు చేస్తారు. వీరి బాబాయ్ (వివేక ప్రసన్న) మెడికల్ షాప్ ని చూసుకుంటాడు. చిన్నప్పుడు నీలాకి మన కళ్ళ ముందు అన్యాయం జరిగితే ఎదిరించాలని , పోరాడాలని చెబుతూ ఉంటాడు రాజారాం. దీంతో నీలా అందరితో గొడవలు పెట్టుకుంటూ ఉంటుంది.
ALSO READ:Nabha Natesh: దేవకన్యలా మెరిసిపోతున్న నభా నటేష్!
ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే!
ఒక పేద మహిళ కోసం పెద్ద రౌడీ షీటర్ ని కూడా కొడుతుంది. మరొకవైపు 7వేల కోట్ల మైనింగ్ కోసం స్థానిక ఎమ్మెల్యే పెద్ద బిగ్ షాట్ వరుణ్ తో డీల్ కుదుర్చుకుంటాడు. దీనికి తోడు ఎమ్మెల్యే ట్రస్ట్ కి వరుణ్ నుంచి 1000 కోట్లు వైట్ లో పంపించాల్సి ఉంటుంది. దీనికి వంద రూపాయల నోటు కీలకంగా మారుతుంది. ఈ పనిని అబ్రహం కి అప్పగిస్తారు. అయితే అబ్రహం ఒక యాక్సిడెంట్ వల్ల పోలీసుల కంట్రోల్లో ఉంటాడు. కానీ అతను క్రిమినల్ అనే విషయం వారికి తెలియదు. కానీ తనను తీసుకెళ్లడానికి రౌడీలు రావడంతో పోలీసులకు అనుమానం వస్తుంది. అతని చుట్టూ పోలీసులు పహారీ పెట్టగా తప్పించుకొని పారిపోతాడు. మరి ఈ గొడవలకు, రాజారాం కుటుంబం కి సంబంధం ఏమిటి? 1000 కోట్ల డీల్ కి సంబంధించిన 100 రూపాయల నోటు వీరి వద్దకు ఎలా వచ్చింది? అత్యంత పవర్ఫుల్ విలన్ అయిన అబ్రహం రాజారాంకెందుకు దొరికిపోయాడు ?అనేది మిగతా కథ. అధ్యంతం ఆకట్టుకునే ఈ యాక్షన్ థ్రిల్లర్ ను కచ్చితంగా ఒక్కసారైనా చూడాలని చూసిన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.


