Friday, July 10, 2026
HomeLATESTAkhil:మాజీ వదినమ్మకు భారీ జలక్ ఇచ్చిన అఖిల్..సమంతకి బిగ్ షాక్..?

Akhil:మాజీ వదినమ్మకు భారీ జలక్ ఇచ్చిన అఖిల్..సమంతకి బిగ్ షాక్..?

Akhil:అక్కినేని అఖిల్ నటించిన 'లెనిన్' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో దూసుకెళ్తుండగా, సమంత 'మా ఇంటి బంగారం' రూ.100 కోట్ల కలెక్షన్ల రేసుపై దీని ప్రభావం ఉంటుందా? రెండు సినిమాల బాక్సాఫీస్ పోటీపై పూర్తి విశ్లేషణ తెలుసుకోండి.

on
- Advertisement -banner Ad

Akhil:సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతోంది. సమంత(Samantha) రీసెంట్‌గా నటించిన సినిమా ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెట్టిన దానికి ఏకంగా ట్రిపుల్ లాభాలు దక్కించుకుంది. అంత పెద్ద హిట్ అయింది. మూడేళ్ల గ్యాప్ తర్వాత సమంత నటించిన ఫిల్మ్ కావడంతో జనాలు బాగా ఇంట్రెస్ట్ చూపించారు. దానికి తగ్గట్టే సమంత యాక్షన్ సీన్స్, సమంత ట్రెడిషనల్ లుక్ సినిమాను బాగా హైలెట్ చేశాయి.

95 కోట్ల కలెక్షన్స్.. 100 కోట్లపై అందరి చూపు:

అయితే ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.95 కోట్లను సాధించింది. త్వరలోనే ఈ చిత్రం 100 కోట్ల మైలురాయిని అందుకోవడానికి సిద్ధమవుతుందని అంతా అనుకున్నారు. ఈ వీకెండ్ ముగిసే సమయానికి ఈ సినిమా ఆ ఘనత సాధిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు కూడా భావించారు.

- Advertisement -

‘లెనిన్’ ఎంట్రీతో మారిన లెక్కలు:

కానీ సడన్‌గా ‘లెనిన్’ థియేటర్లలోకి రావడంతో పూర్తిగా ‘మా ఇంటి బంగారం’ లెక్కలు తారుమారు అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం థియేటర్ల వద్ద కలెక్షన్ల వేగం కాస్త తగ్గినట్లు సమాచారం. జూలై 10న అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకుంది. అంతేకాదు, ఇప్పటివరకు అఖిల్(Akhil) కెరీర్‌లో ఎప్పుడూ వినిపించని స్థాయిలో పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. థియేటర్లు ఫుల్ అవుతున్నాయి. పైగా వీకెండ్ కూడా వచ్చేస్తోంది.

ఫ్యామిలీ ఆడియన్స్ ఫోకస్ ‘లెనిన్’ వైపు?:

ఈ వీకెండ్ కచ్చితంగా ‘లెనిన్’ సినిమా చూడటానికి జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫ్యామిలీతో కలిసి వెళ్లడానికి కూడా ఆసక్తి చూపిస్తారు. దీంతో ‘మా ఇంటి బంగారం’ సినిమా చూసే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయేమో అన్న ఫీలింగ్ కలుగుతోంది.

- Advertisement -

సమంతకు కొత్త టెన్షన్?:

100 కోట్ల క్లబ్‌కు కొంచెం దూరంలో ఉన్న సమంతకు ‘లెనిన్’ సినిమా ఇప్పుడు కొత్త తలనొప్పినే తీసుకొచ్చిందని ఫ్యాన్స్ అంటున్నారు. ‘మా ఇంటి బంగారం’ సినిమా కనుక 100 కోట్ల మార్క్‌ను టచ్ చేస్తే, తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘనత సాధించిన తొలి లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా సమంత సరికొత్త రికార్డు సృష్టిస్తుంది. ఈ ల్యాండ్‌మార్క్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి సమంత కూడా భారీ ఈవెంట్ ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

also read:OTT Movie: గుమ్మడికాయ వెనుక దాగిన భయంకర రహస్యం..హారర్ అభిమానులను వణికిస్తున్న ఓటీటీ థ్రిల్లర్!

- Advertisement -

మాజీ వదినమ్మకు మాజీ మరిది షాక్?:

అయితే ఈ లోపే ‘లెనిన్’ థియేటర్లలోకి రావడం, సినిమా సూపర్ డూపర్ హిట్ అవడం, పాజిటివ్ టాక్ దక్కించుకోవడంతో సమంత సినిమా 100 కోట్ల మార్కును వెనక్కి నెట్టేస్తుందేమో అన్న భయం అభిమానుల్లో నెలకొంది. మొత్తానికి మాజీ వదినమ్మకు మాజీ మరిది గట్టి షాక్ ఇచ్చాడంటూ నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు.

also read:Lenin:’లెనిన్’ మూవీ రివ్యూ: అఖిల్ 2.0 మాస్ షో..కెరీర్‌కు ఎట్టకేలకు తొలి హిట్..చించిపడేశాడు రా సామీ..!

100 కోట్లు దాటుతుందా? లేక ‘లెనిన్’ బ్రేక్ వేస్తాడా?:

చూడాలి మరి ‘మా ఇంటి బంగారం’ సినిమా 100 కోట్ల మార్క్‌ను దాటుతుందా? లేక అఖిల్ ‘లెనిన్’ సినిమా ‘మా ఇంటి బంగారం’కు బ్రేక్ వేస్తుందా? తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you