Thursday, September 24, 2026
HomeLATESTRadhika Apte:బోల్డ్ సీన్స్ లిక్ తో నరకం అనుభవించా.. రాధిక ఆప్టే కామెంట్స్..!

Radhika Apte:బోల్డ్ సీన్స్ లిక్ తో నరకం అనుభవించా.. రాధిక ఆప్టే కామెంట్స్..!

Radhika Apte: ప్రముఖ హీరోయిన్ రాధిక ఆప్టే కాజాగా సినిమాలలో వచ్చే ఇంటిమేట్ సీన్లపై స్పందిస్తూ ఊహించని కామెంట్లు చేసింది.

on
- Advertisement -banner Ad

Radhika Apte:బాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులలో హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది బాలీవుడ్ నటి రాధిక ఆప్టే. అయితే నిరంతరం ఈమె ఎక్కువగా బోల్డ్ క్యారెక్టర్స్ పాత్రలోనే నటిస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధిక ఆప్టే తాను ఇక మీదట బోల్డ్ సీన్స్ లలో అనవసరంగా నటించనని, కథలో తన పాత్ర ఉంది అంటేనే నటిస్తానంటూ తెలియజేసింది. ఇప్పుడు తాజాగా మరో ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన ఒక అత్యంత చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకొని అందరికీ షాక్ ఇచ్చింది.

ఆ బోల్డ్ సన్నివేశం లీక్ అవడంతో 4 రోజులు ఇంటి నుండి బయటకు రాలేదు..

రాధిక ఆప్టే(Radhika Apte) మాట్లాడుతూ గతంలో ఒక సినిమాలో బోల్డ్ సన్నివేశం లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఆ సమయంలో తాను భయంకరమైన నరకాన్ని అనుభవించాను అంటూ తెలిపింది. తన పర్సనల్ లైఫ్ లో కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నానని తెలిపారు. ముఖ్యంగా ఆ క్లిప్ లీక్ అయిన తర్వాత నాలుగు రోజుల పాటు భయంతోనే తాను ఇంట్లో నుంచి కాలు కూడా బయట పెట్టలేకపోయాను అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడింది రాధిక ఆప్టే. ఆన్లైన్లో కామెంట్స్ చేయడం వేరు కానీ ఆ ప్రభావం తన ఇంటి డోర్ తట్టడంతో చాలా భయపడ్డాను అని తెలిపారు.

- Advertisement -
Advertisement

also read:Balakrishna:ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ ఎంబసీ బాలయ్య వీడియోతో వినూత్న కౌంటర్..!

ఆ భయం కారణంగా నరకం చూసాను…

తాను ఉంటున్న అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉండేదాన్ని. ఎవరైనా కోపంతో వచ్చి డోర్ బెల్ కొడతారేమో అని ప్రతిరోజు చాలా భయపడుతూ ఉన్నాను. ఆ లీక్డ్ వీడియో తన చుట్టూ ఉన్నవారి మనస్తత్వాలను ఎలా మార్చుతుందో అనుకొని భయపడ్డాను.. నా డ్రైవర్ కూడా రోజూ ఆ క్లిప్స్ చూసేవాడు అంతే కాదు నువ్వు రాధిక ఆప్టే ఇంటికి వెళ్తున్నావా? అని కొందరు డ్రైవర్ని కూడా అడిగేవారట. చివరికి తన బిల్డింగ్ కి కాపలా ఉన్న వాచ్మెన్ కూడా ఆ వీడియో చూశాడు అంతలా నరకం అనుభవించానని తెలిపింది.

- Advertisement -
Advertisement

also read:Sampoornesh Babu:సంపూర్ణేష్ బాబును టార్గెట్ చేసిన జర్నలిస్టు.. వైరల్ వీడియోపై ఫ్యాన్స్ ఫైర్!

రాధిక ఆప్టే సంచలన నిర్ణయం..

ఆ సమయం నుంచి తన ప్రైవేట్ సేఫ్టీ కోసం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాను.. తన పర్సనల్ డ్రైవర్ , పర్సనల్ అసిస్టెంట్ ని పిలిచి ఆ లీక్ అయిన వీడియో క్లిప్పులను మీకి పంపుతున్నాను అది చూశాక నాకు రక్షణగా ఉంటామంటే ఉండండి లేకపోతే ఇప్పుడే జీతం తీసుకొని వెళ్ళిపోండి అంటూ నిర్మొహమాటంగా చెప్పేశానని .. కానీ వారు ఆమెకు పూర్తిగా ధైర్యాన్ని ఇచ్చి అండగా నిలవడంతో ఆ చేదు సంఘటన నుంచి తాను బయటపడగలిగాను అంటూ తెలిపింది రాధిక ఆప్టే. ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. రాధిక ఆప్టే ప్రస్తుతం నెట్ ఫ్లిక్ లో స్ట్రీమింగ్ అవుతున్న లస్ట్ స్టోరీస్ 3 లో నటించింది. ఈ వెబ్ సిరీస్ ని విక్రమాదిత్య మోత్వాన్ని దర్శకత్వం వహించారు. ఇందులో విజయ్ వర్మతో కలిసి నటించింది. తెలుగులో రక్త చరిత్ర, రక్త చరిత్ర 2, లెజెండ్, లయన్ వంటి చిత్రాలలో కూడా నటించింది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you