Wednesday, August 5, 2026
HomeLATESTRakul:ఆ ఒక్క కారణంగానే "శూర్పణఖ" పాత్ర చేసా: రకుల్ స్టన్నింగ్ ఆన్సర్

Rakul:ఆ ఒక్క కారణంగానే “శూర్పణఖ” పాత్ర చేసా: రకుల్ స్టన్నింగ్ ఆన్సర్

Rakul:నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ చిత్రంలో శూర్పణఖ పాత్రలో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ తన పాత్ర ఎంపిక వెనుక కారణాన్ని వెల్లడించింది.

on
- Advertisement -banner Ad

Rakul:నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం “రామాయణ”. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎన్ని అంచనాలు నెలకొన్నాయి అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఈ చిత్రంలో సీతగా సాయిపల్లవి నటిస్తుంది. ఆ కారణంగా సోషల్ మీడియాలో మంచి బజ్ కూడా ఏర్పడింది. ఈ చిత్రంలో శూర్పణఖ పాత్రను పోషిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా తన పాత్ర ఎంపిక వెనుక ఉన్న కారణాలను వెల్లడించింది. సోషల్ మీడియా వేదికగా ఓ అభిమాని రాసిన బహిరంగ లేఖను షేర్ చేస్తూ శూర్పణఖగా పాత్రను ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పారు.

అభిమాని లేఖకు సోషల్ మీడియాలో సమాధానం :

శూర్పణఖ పాత్రను ఎందుకు ఓకే చేశారు..? అని ప్రశ్నించిన అభిమాని లేఖని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ రకుల్(Rakul) స్టన్నింగ్ ఆన్సర్ ఇచ్చింది. శూర్పణఖ పాత్రను అంగీకరించినందుకు రకుల్ ని అభినందిస్తూ..” రామాయణ కథలో ఈ పాత్ర కీలక మలుపుకు కారణమైనప్పటికీ చాలామంది ఒకే సంఘటనతో ఆమెను గుర్తు చేసుకుంటారు. అలాగే ఇలాంటి పాత్రను స్వీకరించడానికి కారణమేంటో తెలుసుకోవాలని ఉంది..?” అంటూ అభిమాని రకుల్ ని ప్రశ్నించారు.

- Advertisement -
Advertisement

దీనికి రకుల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. శూర్పణఖ పాత్రలోని భావోద్వేగాలు, అంతర్మదనం, వ్యక్తిత్వంలోని విభిన్న కోణాలే తనని ఎక్కువగా ఆకట్టుకున్నాయని వెల్లడించింది. “చరిత్ర ఆమెను ఒకే కోణంలో చూసిన ఆ పాత్రలో చెప్పుకోదగ్గ ఎన్నో అంశాలు ఉన్నాయని పేర్కొంది”.

also read:OTT:బావిలో డెడ్‌బాడీ..ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళ థ్రిల్లర్..మిస్ అవ్వకండి!

- Advertisement -
Advertisement

రామాయణ విడుదలైన తర్వాత జరగబోయేది ఇదే:

ప్రేక్షకుల అభిప్రాయాలను సవాలు చేసే పాత్రలో నటించడం నాకు ఎప్పుడు ఇష్టమే అంటూ రకుల్ చెప్పింది. కథలోని పాత్రలను కొత్త కోణంలో చూపించడం ద్వారా ప్రేక్షకుల్లో కొత్త ఆలోచనలకు అవకాశం కల్పించవచ్చు అని ఆమె అభిప్రాయపడింది. రామాయణ విడుదలైన తర్వాత శూర్పణఖ పాత్రను ప్రేక్షకుల విభిన్నంగా అర్థం చేసుకుంటారు అని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. “రామాయణ పార్ట్ 1” ఈ ఏడాది దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు ముందుకు రానుంది..!!

also read:Pradeep machiraju:యాంకర్ ప్రదీప్ జీవితంలో ఇంత విషాదముందా? 

- Advertisement -
Advertisement

2009లో గిల్లి అనే కన్నడ సినిమా ద్వారా తన కెరియర్ని ప్రారంభించిన రకుల్ ప్రీతిసింగ్ తెలుగులో కెరటం అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మహేష్ బాబు, అల్లు అర్జున్ ,గోపీచంద్, రవితేజ తదితర హీరోలతో నటించి భారీ విజయాలను అందుకుంది. అయితే బాలీవుడ్ వైపుగా అడుగులు వేసి అక్కడ పలు సినిమాలలో నటించడమే కాకుండా ప్రముఖ నిర్మాత జాకి భగ్నాన్ని ప్రేమించి వివాహం చేసుకొని తెలుగు ఇండస్ట్రీకి దూరమయ్యింది. దీంతో బాలీవుడ్లో అడపా దడపా చిత్రాలలో నటిస్తోంది రకుల్. ప్రస్తుతం సినిమాల విషయానికి వస్తే.. రామాయణ మొదటి భాగం రెండవ భాగంతో పాటుగా ఇండియన్ త్రీ అనే చిత్రంలో నటిస్తోంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you