OTT:మలయాళ చిత్ర సీమ నుండి వచ్చే క్రైమ్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ల సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి ఆదరణ ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సహజతత్వానికి దగ్గరగా ఉండే కథనం.. ఉత్కంఠ భరితమైన స్క్రీన్ ప్లే, న్యాచురాలిటీకి చాలా చాలా దగ్గరగా ఉండేటువంటి అంశాలు. ఈ చిత్రాలకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడుతున్నాయి. ఇప్పుడు కూడా అలాంటి ఒక సూపర్ ధ్రిల్లర్ సినిమా ఓటీటీలో దుమ్ముదులిపేస్తుంది. ఆ సినిమా పేరు మరేంటో కాదు “ఉయిర్” (UYIR MOVIE). ఈ సినిమా ఆగస్టు 4 నుంచి జియో హాట్ స్టార్(OTT) వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు భాషలో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉండటం విశేషం
నిజ జీవిత ఘటన ఆధారంగా కథ :
ప్రముఖ దర్శకుడు ఎం. పద్మకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 26న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఒక పోలీస్ అధికారి తన విధుల్లో ఎదుర్కొన్న వాస్తవ సంఘటన ఆధారంగా ఈ కథను రూపొందించారు. కథను కూడా నిజ జీవిత పోలీస్ అధికారి అందించడం సినిమాపై ఇంకా క్యూరియాసిటీ పెంచేసింది.
మిస్టరీ కేసు చుట్టూ కథనం :
కన్నూర్ జిల్లా ధర్మడం పోలీస్ స్టేషన్‌లో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ప్రొబేషనరీ సబ్-ఇన్‌స్పెక్టర్ అజీబ్ రెహమాన్ పాత్రలో రోషన్ మాథ్యూ కనిపిస్తాడు. విధుల్లో చేరిన కొద్ది రోజుల్లోనే పాడుబడిన భావిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం బయటపడుతుంది. మొదటగా ఇది సాధారణ కేసుగా భావించిన ఈ ఘటన దర్యాప్తు కొనసాగుతున్న కొద్ది అనేక సంచలన విషయాలను బయటపెడుతుంది. చివరకు ఆ మిస్టరీని పోలీస్ అధికారి ఎలా చేదిస్తాడనేది సినిమా ప్రధాన కధాంశం.
ALSO READ:Pradeep machiraju:యాంకర్ ప్రదీప్ జీవితంలో ఇంత విషాదముందా?
నటీనటుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ:
ఈ చిత్రంలో రోషన్ మాధ్యు తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అతనితోపాటు బైజు సంతోష్, సైయామి ఖేర్, శృతి మీనన్, వినోద్ సాగర్, వినీత్ తట్టిల్, దివ్య ఎం. నాయర్, షాజూ శ్రీధర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పోలీసుల దర్యాప్తు విధానాన్ని ఎలాంటి అతిశయోక్తులు లేకుండా వాస్తవికంగా చూపించడం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.
ALSO READ:Udhayanidhi Stalin:త్రిష పేరుతో ఉదయనిధి స్టాలిన్ డబుల్ మీనింగ్ డైలాగ్స్..తమిళనాడులో రచ్చ రచ్చ!
థ్రిల్లర్ అభిమానులకు మంచి ఎంపిక:
రియలిస్టిక్ ఇన్వెస్టిగేటివ్ ద్రిల్లర్ లను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా మంచి ఫీలింగ్ ఇస్తుంది. నిజజీవిత సంఘటన ఆధారంగా రూపొందిన కథ, ఉత్కంఠ భరితమైన దర్యాప్తు.. బలమైన నటీనటుల ప్రదర్శనలు ఈ సినిమాను ఓటీటీలో తప్పక చూడాల్సిన చిత్రంగా నిలబెడతాయి. వీకెండ్ లో ధ్రిల్లింగ్ మూవీ చూడాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక అని చెప్పవచ్చు..!!




