Pradeep machiraju:తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం ఏలుతున్న టాప్ మెయిల్ యాంకర్లలోయాంకర్ ప్రదీప్ మాచిరాజు కూడా ఒకరు. ముఖ్యంగా సుమ, శ్రీముఖి వంటి వారిని డామినేట్ చేయగలిగే యాంకర్ గా పేరు సంపాదించిన ప్రదీప్.. తనదైన స్టైల్ లో యాంకరింగ్ తో ఆకట్టుకుంటారు. హీరోగా కూడా రెండు మూడు చిత్రాలలో నటించగా..పెద్దగా సక్సెస్ కాలేకపోయారు ప్రదీప్. మళ్లీ తిరిగి యాంకరింగ్ వైపుగానే అడుగులు వేశారు. ప్రస్తుతం పలు రకాల టీవీ షోస్, ప్రోగ్రామ్స్ , రియాల్టీ షోలతో బిజీగా ఉన్న ప్రదీప్ ఆమధ్య కొన్ని రోజులపాటు సైలెంట్ గా ఉన్నారు.
100% చెప్పలేమని వైద్యులు అన్నారు – ప్రదీప్
ఏ టీవీ షోలో కూడా కనిపించలేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా లేరు. దీంతో ప్రదీప్(Pradeep machiraju) కు ఏమైంది? అని అభిమానులు తెగ వెతికేశారు. కానీ ప్రదీప్ ఇలా గ్యాప్ తీసుకోవడానికి గల కారణాలను తాజాగా ఒక షోలో బయటపెట్టారు. ప్రదీప్ తన జీవితంలో జరిగిన అత్యంత విషాదకర సంఘటనను సైతం బయట పెట్టారు. ఒక సినిమా షూటింగ్ సమయంలో చిన్న యాక్సిడెంట్ వల్ల తన కాలికి సర్జరీ జరిగిందని, ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లేటప్పుడు డాక్టర్స్ 50 – 50 చాన్స్ అని చెప్పారని ప్రదీప్ చెప్పారు.
నా జీవితంలో అదే అత్యంత గడ్డుకాలం – ప్రదీప్
దీంతో అప్పుడు కంప్లీట్ గా ఫిట్గా నడవగలుగుతానా? లేదా అని చాలా కుమిలిపోయాను. ఆ సమయంలో నా మనసు నిండా ఓకే ఆలోచనలు ఉన్నాయి. కూర్చొని చేసే పనులు ఏమి ఉంటాయని ఎక్కువగా ఆలోచించాను. కూర్చొని మరి యాంకరింగ్ చేయవచ్చా? లేకపోతే ఇంకేమైనా చేయవచ్చా? అని తన మనసులో చాలా ఆలోచనలు మెదిలాయని తెలిపారు. ఆ సమయంలో మానసికంగా చాలా కుమిలిపోయి, ఫిజికల్ గా ఎంత లేచి నిలబడి రావాలనుకున్నా.. రాలేకపోయాను.. అదే నా జీవితంలో అత్యంత గడ్డు పరిస్థితులు అంటూ తెలిపారు.
ప్రదీప్ షోలు..
ప్రదీప్ మాటలు విన్న తర్వాత అక్కడున్న వారందరూ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ విషయం తర్వాత ప్రదీప్ కి ధైర్యం చెప్పి మరి ఓదార్చారు కంటెస్టెంట్స్. ప్రదీప్ ప్రస్తుతం కుక్ విత్ జాతి రత్నాలు, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలకు హొస్టుగా వ్యవహరిస్తున్నారు. యాంకర్ ప్రదీప్ పెళ్లి గురించి కూడా గుడ్ న్యూస్ చెబుతారేమో అని అభిమానులు చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తున్నారు. ఇటువంటి తరుణంలో ప్రదీప్ ఈ వ్యాఖ్యలు చేయడం అభిమానులను నిరాశకు గురిచేసింది. అయితే ఈ విషయం విన్న తర్వాత అభిమానులు మాత్రం ప్రదీప్ సినిమాలలో నటిస్తారా లేదా అనే విషయంలో ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి ప్రదీప్ మాత్రం తాను గ్యాప్ తీసుకోవడానికి గల కారణాన్ని తెలియజేయడంతో పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.




