Friday, July 31, 2026
HomeLATESTOTT:'శ్రీనివాస మంగాపురం'ఓటీటీ ఫిక్స్.. ఏ ప్లాట్‌ఫామ్‌లో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్?

OTT:’శ్రీనివాస మంగాపురం’ఓటీటీ ఫిక్స్.. ఏ ప్లాట్‌ఫామ్‌లో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్?

OTT:ఘట్టమనేని జైకృష్ణ హీరోగా నటించిన తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం థియేటర్లలో విడుదలైన కొద్ది రోజులకే ఓటీటీకి రానుంది.

on
- Advertisement -banner Ad

OTT:ఘట్టమనేని కుటుంబం నుంచి హీరోగా పరిచయమైన “జయ కృష్ణ” నటించిన తొలి చిత్రం “శ్రీనివాస మంగాపురం”. నేడు జూలై 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ మనవడు మహేష్ బాబు సోదరుడు దివంగత రమేష్ బాబు తనయుడైన జయకృష్ణ ఈ చిత్రంతో సినీ రంగంలోకి అడుగు పెట్టారు. ఈ సినిమాపై ఇప్పటికే సినీ ప్రేక్షకులలో మంచి ఆసక్తి నెలకొంది. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం పెద్దగా ఆశించినంత టాక్ అందుకోలేకపోయింది . బాలీవుడ్ నటి రాషా తడాని కథానాయికగా నటించగా, ‘RX100’ చిత్రంతో గుర్తింపు పొందిన దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మాణం:

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్విని దత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్ పై జెమినీ కిరణ్ నిర్మించారు. భావోద్వేగాలు, కుటుంబ విలువలు, ప్రేమ కథాంశం తో రూపొందిన ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. విడుదలకు ముందే ప్రచార కార్యక్రమాలతో చిత్ర బృందం మంచి హైప్ తీసుకురావడంలో సఫలమైంది. అయితే సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం అనుకున్నంత టాక్ రాలేకపోయింది.

- Advertisement -
Advertisement

also read:Ramayana:వార్నీ…బ్రహ్మముహూర్తంలో “రామయణం” ట్రైలర్ విడుదల చేసింది అందుకా..?

అమెజాన్ ప్రైమ్ కు డిజిటల్ హక్కులు:

సినిమా విడుదలైన రోజే దీనికి సంబంధించిన ఓటీటీ (OTT)వివరాలు కూడా బయటకు వచ్చాయి. శ్రీనివాస మంగాపురం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సొంతం చేసుకున్నట్లు చిత్ర టైటిల్ కార్డులో వెల్లడించారు. దీంతో థియేటర్లలో సినిమా చూడలేని ప్రేక్షకులు ఓటిటి విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:OTT: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్కామ్..ఇప్పుడు ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్‌గా!

ఎప్పుడు స్రీమింగ్ అయ్యే అవకాశం:

సాధారణంగా పెద్ద సినిమాల మాదిరిగానే ఈ చిత్రం కూడా థియేటర్లలో విడుదలైన తర్వాత సుమారు నాలుగు వారాల గ్యాప్ తో ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఆగస్టు చివరివారంలో లేదా సెప్టెంబర్ ప్రారంభంలో Amazon Prime వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది అంటూ సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు అధికారికంగా స్ట్రీమింగ్ తేదీ పై చిత్ర బృందం లేదా ఓటీటీ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువలేదు. విడుదల తేదీ పై స్పష్టత వచ్చిన వెంటనే ప్రేక్షకులకు అధికారిక సమాచారం అందే అవకాశం ఉంది..!

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you