Sunday, July 5, 2026
HomeLATESTRegina Cassandra:నక్క తోక తొక్కిన రెజీనా..టాప్ హీరోయిన్స్ కుల్లుకునే ఛాన్స్ కొట్టేసింది..!

Regina Cassandra:నక్క తోక తొక్కిన రెజీనా..టాప్ హీరోయిన్స్ కుల్లుకునే ఛాన్స్ కొట్టేసింది..!

Regina Cassandra:లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న తదుపరి సినిమాలో హీరోయిన్ రెజీనా కసాండ్రాకు భారీ అవకాశం దక్కినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో ఆమె పోషించబోయే పాత్ర, సినిమా విశేషాలు, తాజా అప్‌డేట్స్ మరియు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

on
- Advertisement -banner Ad

Regina Cassandra:ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్స్ ఎలాంటి సినిమాలు చేసుకుంటున్నారో అందరికీ తెలిసిందే. వాళ్ల పాత్రకు పెద్దగా ఇంపాక్ట్ లేకపోయినా, అందాల ప్రదర్శన కోసమే కొన్ని సినిమాలను ఓకే చేస్తున్నారు. ఇది చాలా మంద్కి హీరోయిన్స్ చేస్తున్నారు. కొందరు గ్లామరస్ పాత్రలు వద్దు అని అనుకోని సైలెంట్ గా ఉంటే..మరికొందరు గ్లామరస్ పాత్రలు అయినా పర్లేదు పెద్ద సినిమా అయితే చాలు అని అనుకుంటున్నారు. అలాంటి హీరోయిన్స్‌కు పూర్తి భిన్నంగా ఉంటుంది రెజీనా.

రెజీనా స్పెషాలిటీస్:

రెజీనా..ఈ అమ్మాయి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. రీసెంట్‌గా రెజీనా పేరు మరోసారి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. సౌత్ ఇండియా దర్శకుడు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) మరో కొత్త ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈసారి నిర్మాతగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారట.

- Advertisement -

also read:Tollywood:టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్..రూట్ మార్చుతున్న స్టార్ డైరెక్టర్లు!

అదే చూసే రెజీనా ను సెలక్ట్:

ఇప్పటికే ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘కూలీ’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను తెరకెక్కించిన లోకేష్, ఇప్పుడు నిర్మాతగా మారి ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి విశాల్ వెంకట్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్‌గా రెజీనాను(Regina Cassandra) ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. రెజీనా కమిట్‌మెంట్, కాన్ఫిడెన్స్, అలాగే ఆమె అద్భుతమైన నటనను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజంగా నిజం అయితే మాత్రం రెజీనా జాక్ పాట్ ఛాన్స్ కొట్టేసినంట్లే. ఇది మంచి ఆఫర్ ఆమెకి దక్కడం వెరీ లక్కి అంటున్నారు ఫ్యాన్స్.

- Advertisement -

also read:Bandla Ganesh:బండ్ల గణేష్ కేసులో ట్విస్ట్.. ఆస్తి వేలంపై హైకోర్టు తీర్పుతో కొత్త మలుపు!

లోకేష్ కనగరాజ్ ఏరి కోరి ఎంపిక:

ఇప్పటికే సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని, త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. లోకేష్ కనగరాజ్ స్వయంగా రెజీనా కసాండ్రా పేరును సూచించారంటే, ఆమె నటనపై ఆయనకు ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోంది. దీంతో సోషల్ మీడియాలో రెజీనా పేరు మరోసారి మార్మోగుతోంది. ఇది హిట్ అయితే ఇల లోకేష్ కనగరాజ్ ఆమె కి వరుస అవకాశాలు ఇస్తారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇది మిగతా హీరోయిన్స్‌కు అసూయ పుట్టించే అవకాశం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రెజీనా ఈ అవకాశాన్ని హిట్‌గా మార్చుకుని మరోసారి తన సత్తా చాటుతుందా..? లేదా..? అనేది చూడాలి. అలాగే నిర్మాతగా లోకేష్ కనగరాజ్ చేస్తున్న ఈ సినిమా ఎంతవరకు విజయం సాధిస్తుందో కూడా ఆసక్తికరంగా మారింది..!!

- Advertisement -

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you