Wednesday, July 22, 2026
HomeLATESTTollywood:టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్..రూట్ మార్చుతున్న స్టార్ డైరెక్టర్లు!

Tollywood:టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్..రూట్ మార్చుతున్న స్టార్ డైరెక్టర్లు!

Tollywood:టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ మొదలైంది. స్టార్ డైరెక్టర్లు తమ పాత స్టైల్‌కు భిన్నంగా కొత్త కథలు, కొత్త జానర్లతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మార్పుకు కారణాలేంటి? ఎలాంటి సినిమాలతో వారు రూట్ మార్చుతున్నార

on
- Advertisement -banner Ad

Tollywood:పాన్ ఇండియా సినిమాల ప్రభావం రోజురోజుకూ ఎలా పెరుగుతుందో మన అందరికి తెలిసిందే. ఒకప్పుడు ప్రాంతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు తెరకెక్కించిన దర్శకులు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే కథలపై దృష్టి పెడుతున్నారు అన్నది వాస్తవం. అయితే కేవలం కమర్షియల్ ఫార్ములాలతో కాకుండా, కొత్త కాన్సెప్ట్లు, విభిన్న జానర్లతో ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు కూడా తమకు అలవాటైన శైలిని పక్కనపెట్టి కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. ఈ మార్పు ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

త్రివిక్రమ్ నుంచి తొలి మైథలాజికల్ ప్రయోగం:

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు వినగానే కుటుంబ భావోద్వేగాలు, చక్కటి సంభాషణలు, హాస్యం, క్లాస్ టచ్ ఉన్న కథలు గుర్తుకు వస్తాయి. ఆయన ఇప్పటివరకు తెరకెక్కించిన ఎక్కువ సినిమాలు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగానే సాగాయి. అయితే ఈసారి మాత్రం తన కెరీర్‌లో పూర్తిగా భిన్నమైన అడుగు వేయడానికి సిద్ధమవుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ ఓ భారీ మైథలాజికల్ నేపథ్యంలో సినిమా రూపొందించనున్నారు. దీని పై బోలెడు అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్.

- Advertisement -
Advertisement

also read:Bandla Ganesh:బండ్ల గణేష్ కేసులో ట్విస్ట్.. ఆస్తి వేలంపై హైకోర్టు తీర్పుతో కొత్త మలుపు!

అట్లీ నుంచి సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ:

ఈ లిస్ట్ లో కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ కూడా చేరిపోయారు. అట్లీ ఈసారి తన శైలికి భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. అట్లీ అంటే ఇప్పటివరకు మాస్ యాక్షన్, రివెంజ్ డ్రామాలు ఇవే గుర్తు వస్తాయి. ఆ జానర్ లోనే వరుస విజయాలు అందుకున్న ఆయన, ఇప్పుడు పూర్తిగా కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనున్న ఈ భారీ చిత్రం పారలల్ వరల్డ్స్ నేపథ్యంలో సాగే హై-కాన్సెప్ట్ సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీగా రూపుదిద్దుకుంటున్నారు. ఈ సినిమాతో వరల్డ్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంటాడు అట్లీ అనడంలో సందేహమే లేదు.

- Advertisement -
Advertisement

also read:Tollywood: బాలీవుడ్ లో స్టార్ హీరోతో సినిమా చేస్తున్న గీతా గోవిందం డైరెక్టర్!

టాలీవుడ్‌లో కొత్త అధ్యాయానికి నాంది:

మొత్తానికి ఇన్నాళ్ళు ఒక్కే జానర్ లో ఆటలు ఆడిన స్టార్ దర్శకులు తమ సేఫ్ జోన్‌ను వదిలి కొత్త ప్రయోగాలు చేయడం టాలీవుడ్‌కు సానుకూల పరిణామంగా సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది శుభ పరిణాయం అంటున్నారు. విభిన్న కథలు, భారీ విజువల్ అనుభూతులు, ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నాలు పెరగడం తెలుగు సినిమా స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లే అవకాశముంది. రాబోయే రోజుల్లో ఈ కొత్త ట్రెండ్ మరింత బలపడితే టాలీవుడ్ నుంచి మరిన్ని వైవిధ్యభరితమైన పాన్ ఇండియా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. చూద్దాం అమ్రి ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో..??

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you