Wednesday, August 5, 2026
HomeLATESTShruti Haasan:"హైకోర్టులోనే తేల్చుకుంటా"..గూబ గుయ్యమనే షాక్ ఇచ్చిన శృతి హాసన్..!

Shruti Haasan:”హైకోర్టులోనే తేల్చుకుంటా”..గూబ గుయ్యమనే షాక్ ఇచ్చిన శృతి హాసన్..!

AI ద్వారా తన అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు, డిజిటల్ కంటెంట్ వినియోగించడాన్ని అడ్డుకోవాలని ప్రముఖ నటి శృతి హాసన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

on
- Advertisement -banner Ad

Shruti Haasan:స్టార్ హీరోయిన్ శృతిహాసన్ తన వ్యక్తిత్వ హక్కులు, ప్రచార హక్కులు పరిరక్షించాలి అని కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా ఏఐ సాంకేతికతను ఉపయోగించి రూపొందిస్తున్న డీప్ ఫేక్ వీడియోలు.. అదేవిధంగా మార్ఫింగ్ ఫోటోలు.. నకిలీ ప్రకటనలు మరియు ఇతర డిజిటల్ కంటెంట్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి అని ఆమె కోర్టుని కోరారు.

అనుమతి లేకుండా పేరు, ఫోటోల వినియోగం :

శృతిహాసన్(Shruti Haasan) పేరు అదే విధంగా ఫోటోలు.. ఆమె వ్యక్తిత్వాన్ని ఉపయోగించి వివిధ ఉత్పత్తులను ప్రచారం చేయడం వాణిజ్య ప్రయోజనాల కోసం ఆమె గుర్తింపును దుర్వినియోగం చేయడం జరుగుతుంది అని పిటీషన్ లో పేర్కొన్నారు. ముఖ్యంగా ఆమెకు సంబంధం లేని వస్తువులు, అదేవిధంగా సేవలో, ప్రకటనల్లో కూడా ఆమె చిత్రాలను వినియోగించడం వల్ల ప్రజల్లో తప్పుడు అభిప్రాయాలు ఏర్పడుతున్నాయని వివరించారు. ఈ కేసులో పలు భారతీయ, విదేశీ సంస్థలతో పాటు ప్రముఖ సోషల్ మీడియా వేదికలు కూడా ప్రతివాదులుగా ఉన్నట్లు సమాచారం. గూగుల్, మెటా, ఎక్స్, ప్రింట్రెస్ట్ వంటి డిజిటల్ ప్లాట్ ఫార్ములాల్లో తనను ఇతర నటులతో అనుచితంగా చూపించే ఏఐ వీడియోలు అసభ్యకరమైన డిప్ ఫేక్ చిత్రాలు ప్రచారంలో ఉన్నాయి అని ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కంటెంట్ తన వ్యక్తిగత ప్రతిష్ట తో పాటు వృత్తిపరమైన ఇమేజ్ కి కూడా తీవ్ర నష్టం కలిగిస్తుంది అని పేర్కొన్నారు.

- Advertisement -
Advertisement

also read:Bigg Bosss10:బిగ్ బాస్ చరిత్రలోనే ఇది ఓ సంచలనం..కంటెస్టెంట్ గా టాప్ హీరో..!?

శాశ్వత నిషేధాజ్ఞతో పాటు నష్టపరిహారం కూడా కోరిన నటి “

తన అనుమతి లేకుండా పేరు, ఫోటోలు లేదా వ్యక్తిత్వాన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించకుండా శాశ్వత నిషేధాజ్ఞ (Permanent Injunction)జారీ చేయాలని శృతిహాసన్ తరుపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న డీప్ ఫేక్ వీడియోలు, నకిలీ ప్రకటనలు, మార్ఫింగ్ చిత్రాలను అన్ని డిజిటల్ వేదిక నుంచి తొలగించాలి అని.. ఇప్పటికే జరిగిన నష్టానికి తగిన పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు..!!

- Advertisement -
Advertisement

also read:Varanasi: వారణాసి సినిమా స్టోరీ చెప్పిన రాజమౌళి..!

2000 సంవత్సరంలో మొదటిసారి హే రామ్ అనే చిత్రంలో చైల్డ్ యాక్టర్ గా నటించిన శృతిహాసన్ ఆ తర్వాత 2011లో వచ్చిన అనగనగా ఒకదీరుడు చిత్రంతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. అనంతరం ఎంతోమంది స్టార్ హీరోలతో నటించిన శృతిహాసన్ భారీ సక్సెస్ విజయాలను అందుకుంది. అంతేకాకుండా లవ్ ఫెయిల్యూర్స్ విషయంలో కూడా ఈమె పేరు తరచూ ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఇక సినిమాల విషయానికి వస్తే శృతిహాసన్ చివరిగా ఈ ఏడాది రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రంలో స్పెషల్ సొంగ్లో నటించింది ప్రస్తుతం అయితే ట్రైన్, అలాగే ఆకాశంలో ఒక తార అనే చిత్రంలో నటిస్తోంది శృతిహాసన్. అయితే ఇప్పుడు తాజాగా శృతిహాసన్ హైకోర్టును ఆశ్రయించడంపై మరోసారి ఆమె పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you