Wednesday, August 5, 2026
HomeLATESTUdhayanidhi Stalin:త్రిష పేరుతో ఉదయనిధి స్టాలిన్ డబుల్ మీనింగ్ డైలాగ్స్..తమిళనాడులో రచ్చ రచ్చ!

Udhayanidhi Stalin:త్రిష పేరుతో ఉదయనిధి స్టాలిన్ డబుల్ మీనింగ్ డైలాగ్స్..తమిళనాడులో రచ్చ రచ్చ!

Udhayanidhi Stalin:కావేరి జలాల వివాదంపై నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Udhayanidhi Stalin:తమిళనాడు రాజకీయాలలో ఇప్పుడు త్రిష పేరు ఎలా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది అనేది అందరికీ తెలిసిందే. సీఎం విజయ్ ఎక్కడ ఉంటే అక్కడ పక్కన త్రిష పేరు కనిపించాల్సిందే. అంత హిట్ పుట్టించేస్తున్న తమిళ రాజకీయాలలో ఉదయనిధి స్టాలిన్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి. తమిళనాడులో కావేరీ నది జలాల వివాదం మరోసారి రాజకీయవేడిని రాజేసింది. ఈ అంశంపై నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసాయి. సభలో ప్రముఖ నటి త్రిష పేరున ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ద్వందార్థాన్ని కలిగించేలా ఉన్నాయి అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. త్రిషపై ఇలా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎలా చేయగలరు అంటూ త్రిష ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా వైరల్ కావడంతో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు మరింత ముదిరిపోయాయి.

టీవీకే, బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు

ఉదయనిధి(Udhayanidhi Stalin) వ్యాఖ్యలను తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో పాటు బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రజా వేదికపై బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన వ్యక్తి ఇలాంటి చీప్ మాటలు మాట్లాడడం తగదని వారు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి విజయ్ ని ఉద్దేశించి కూడా అవమానకర వ్యాఖ్యలు చేశారు అంటూ టీవీకి నేతలు మండిపడ్డారు. ఈ ఘటన రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

- Advertisement -
Advertisement

also read:Shruti Haasan:”హైకోర్టులోనే తేల్చుకుంటా”..గూబ గుయ్యమనే షాక్ ఇచ్చిన శృతి హాసన్..!

ఫిర్యాదు తర్వాత పోలీసుల చర్యలు:

తంజావూరుకు చెందిన ఓ మహిళ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించా.రు అనంతరం ఉదయనిధి స్టాలిన్ ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన నివాసం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను మరింత కట్టు దిట్టం చేశారు. కొంతమంది ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన మాటలు పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పొలిటికల్ పరంగా ఏ గొడవలు ఉన్న ఒక్క ఆడదానిపై ఇలాంటి మాటలు మాట్లాడటం ఏంటి అంటూ మండిపడుతున్నారు..!!

- Advertisement -
Advertisement

also read:Bigg Bosss10:బిగ్ బాస్ చరిత్రలోనే ఇది ఓ సంచలనం..కంటెస్టెంట్ గా టాప్ హీరో..!? 

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you