ప్రముఖ హీరోయిన్ శృతిహాసన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండస్ట్రీలోకి సింగర్ గా అడుగుపెట్టిన ఈమె.. ఆ తర్వాత నటిగా అరంగేట్రం చేసింది.
లోకనాయకుడు కమలహాసన్ కూతురుగా, భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న శృతిహాసన్.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసింది. కానీ కెరియర్ తొలినాళ్లలో ఐరన్ లెగ్ అనే విమర్శలు కూడా ఎదుర్కొంది.
గబ్బర్ సింగ్ సినిమాతో గట్టి కం బ్యాక్ ఇచ్చిన ఈమె.. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ ఇప్పుడు లక్కీ లేడీగా మారిపోయింది.
ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకుల అలరిస్తున్న ఈమె.. ఇటు సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ మేరకు తాజాగా గ్రీన్ కలర్ చీర కట్టుకొని దీనికి కాంబినేషన్లో ప్లెయిన్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా లైక్ కొట్టడం విశేషం.. ప్రస్తుతం శృతిహాసన్ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.