OTT:ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీ ప్రేక్షకుల కోసం పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదలయ్యాయి. దీవానా, రావు బహదూర్, గట్టా కుస్తీ 2, చిన్న చిన్న ఆశై, బాలన్ ద బాయ్, లవ్ ఓ లవ్, పోలీస్ కంప్లైంట్ వంటి చిత్రాలతో పాటు అబ్జెషన్ మై లార్డ్, హార్ట్ బీట్ సీజన్ 3 వంటి వెబ్ సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటితో పాటు థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న కన్నడ క్రైమ్ థ్రిల్లర్ ‘సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం’ ఇప్పుడు తెలుగు భాషలో కూడా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి :
ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఈ చిత్రం కన్నడలో మంచి విజయాన్ని సాధించింది. ఉత్కంఠ భరతమైన కథ, ఊహించని మలుపులు, ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇటీవల కన్నడ, తమిళ భాషలో మాత్రమే ఓటీటీలో (OTT)విడుదలైన ఈ సినిమా ఇప్పుడు తెలుగు వర్షంలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో ధ్రిల్లర్ సినిమాల అభిమానులు ఈ చిత్రాన్ని తమ భాషలో ఆస్వాదించే అవకాశం లభించింది.
ALSO READ:OTT:హృదయం మురళి’ ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
కథలో ఏముంది?
ఈ సినిమా కథ “అనెగడ్డ” అనే ప్రశాంతమైన గ్రామం చుట్టూ తిరుగుతుంది. అక్కడ వరుస హత్యలు జరగడంతో గ్రామంలో భయాందోళనలను నెలకొంటాయి. మెడకు, చేతులకు గొలుసులు కట్టిన ఒక సైకో కిల్లర్ అత్యంత దారుణంగా హత్యలు చేస్తూ ప్రజలను భయప్రాంతులకు గురిచేస్తాడు. ఈ కేసును ఛేదించేందుకు “సీతారామం” అనే సమర్ధుడైన పోలీస్ అధికారి రంగంలోకి దిగుతాడు. హత్యల వెనుక అసలు సూత్రధారి ఎవరు? ఆ హత్యలకు కారణం ఏమిటి? సైకో కిల్లర్ ను సీతారామం ఎలా పట్టుకున్నాడు..? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సిందే.
“సెకండ్ కేస్ ఆఫ్ సీతారామం” గతంలో వచ్చిన సూపర్ హిట్ “సీతారాం బెనోయ్ కేస్ నెం.18” చిత్రానికి సీక్వెల్ గా రూపొందింది. దేవి ప్రసాద్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ రాఘవేంద్ర ప్రధాన పాత్రలో నటించగా గోపాల్ దేశ్‌పాండే, ఉష భండారి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ALSO READ:Tollywood:సీక్రెట్‌గా ఉంగరాలు మార్చుకున్న టాలీవుడ్ స్టార్ బ్యూటీ!
ఎక్కడ చూడొచ్చు?
ప్రస్తుతం “సెకండ్ కేస్ ఆఫ్ సీతారామం” తెలుగు వర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు లయన్స్ గేట్ ప్లే ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వీకెండ్ లో ఉత్కంఠ భరితమైన క్రైమ్ ధ్రిలర్ ని చూడాలనుకునే వారికి ఈ చిత్రం మంచి ఎంపికగా నిలుస్తుంది..!!!




