Wednesday, July 22, 2026
HomeTV SHOWSSoniya Singh :త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సిద్ధూ - సోనియా..!

Soniya Singh :త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సిద్ధూ – సోనియా..!

Soniya Singh : ప్రముఖ నటి సోనియా సింధు తాజాగా ఒక టాక్ షోలో పాల్గొని సిద్ధూ పవన్తో తన పెళ్లి ఎప్పుడు అనే విషయాన్ని అభిమానులతో పంచుకుంది.

on
- Advertisement -banner Ad

Soniya Singh :యూట్యూబర్ గా, నటిగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి సోనియా సింగ్. ఈమె తన సహానటుడు అయిన సిద్ధూ పవన్(Pavan Sidhu) తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే బంధాన్ని వివాహ బంధంతో మరింత ముందుకు తీసుకు వెళ్లడానికి సిద్ధమవుతోంది ఈ జంట. ఇటీవలే ఒక టాక్ షోలో పాల్గొన్న సోనియా సింగ్ తన పర్సనల్ లైఫ్ విషయాలను పంచుకోవడమే కాకుండా ప్రేమ పెళ్లి కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.

పెళ్లికి సిద్ధమైన సోనియా..

సోషల్ మీడియాలో యూట్యూబ్ వీడియోలతో మంచి పాపులారిటీ సంపాదించుకొని ఆ తర్వాత పలు రకాల షార్ట్ ఫిలిం లలో నటించి వెబ్ సిరీస్ లు, సినిమాల ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది సోనియా సింగ్ (Soniya Singh). విరూపాక్ష చిత్రంలో కూడా కీలకమైన పాత్రలో నటించి బాగా ఆకట్టుకుంది. ఇటీవలే ఆమె నాగబంధం సినిమాలో కూడా నటించింది. ఇంటర్వ్యూలో సోనియా మాట్లాడుతూ.. సిద్దుతో నీ పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నించగా? ఏమో పెళ్లయిపోయిందేమో.. నేను చెప్పట్లేదేమో అంటూ సోనియా సమాధానం విని యాంకర్ వర్ష ఆశ్చర్యపోయింది.

- Advertisement -
Advertisement

also read:Janhvi Kapoor:వామ్మో..జాన్వీ కపూర్ మంత్లీ ఇన్‌స్టా ద్వారా అన్ని కోట్లు సంపాదిస్తుందా..?

ఎర్లీ మార్నింగ్ మా పెళ్లి..

అయితే ఆ తర్వాత అసలు విషయాన్నీ తెలియజేస్తూ.. సెప్టెంబర్ 2 తెల్లవారుజామున 1:45 నిమిషాలకు మా వివాహం జరగబోతోంది అంటూ తేదీతో సహా ముహూర్తాన్ని కూడా తెలియజేసింది. అలాగే భవిష్యత్తులో కుటుంబ జీవితం పైన కూడా మాట్లాడుతూ.. నాకు తెలిసిన వాళ్ళు నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి పుడతారు” అంటూ చెప్పారని, అది ఎంతవరకు నిజమవుతుందో తెలియదు కానీ ఆరోజు కోసం అయితే తాను చాలా ఎక్సైటింగ్గా ఎదురుచూస్తున్నానని తెలియజేసింది. అలాగే ఆస్తి విషయాలను కూడా ప్రస్తావిస్తూ గత ఏడాది ఇద్దరము కలిసి ఒక ఇల్లు కొన్నాము అలాగే ఒక బెంజ్ కారు కూడా కొన్నామని తెలియజేసింది.

- Advertisement -
Advertisement

also read:Trisha Krishnan: “ఇది మూడోసారి.. ఇక మారరా మీరు?”..త్రిష ఫుల్ సీరియస్..!

ఆ స్టార్ హీరో బర్త్డే రోజే పెళ్లి..

దీంతో సోనియాసింగ్, సిద్ధూతో వివాహ విషయాన్ని తెలియజేయడంతో అభిమానులు సైతం ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే.. సెప్టెంబర్ రెండు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడం గమనార్హం . అదేరోజు ఈ జంట వివాహం చేసుకోబోతున్నారని చెప్పడంతో అభిమానులు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయం పైన సోనియా సింగ్, పవన్ సిద్ధూ ఏ విధమైనటువంటి క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you