Mahesh Babu:దివంగత రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా నటిస్తున్న ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా పై బజ్ మామూలుగా లేదు. టాప్ హీరో నటించే సినిమాకి ఎలా అయితే హంగామ ఉంటుందో అలానే ‘శ్రీనివాస మంగాపురం’ కి కూడా ఉంది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమాను జూలై 30న విడుదల చేయబోతున్నం అంటూ ఓ పోస్టర్ తో రిలీజ్ డేట్ కన్ ఫామ్ చేసింది. దీంతో సోషల్ మీడియా మహేశ్ బాబు కెరీర్ నే టర్న్ చేసిన సినిమా పేరు ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చింది. మహేష్ బాబు సినీ ప్రయాణంలో ప్రత్యేక స్థానం సంపాదించిన ‘రాజకుమారుడు’ సినిమా విడుదలైన తేదీతో ఇప్పుడు మరో ఆసక్తికరమైన సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. ఘట్టమనేని కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇస్తున్న జయకృష్ణ ఘట్టమనేని తొలి చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ కూడా అదే తేదీ చుట్టూ ప్రేక్షకుల ముందుకు రావడం అభిమానుల్లో చర్చనీయాంశమైంది.
27 ఏళ్ల తర్వాత అదే సెంటిమెంట్:
1999 జూలై 30న విడుదలైన ‘రాజకుమారుడు’ సినిమాతో మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఈ సినిమా ఆయన కెరీర్ ని ఎక్కడికో తీసుకెళ్లింది. ఆ చిత్రం ఆయన కెరీర్‌కు బలమైన పునాది వేసింది. ఇప్పుడు ఇంత మంది ఫ్యాన్స్ ని సంపాదించుకునేలా చేసింది. ఇప్పుడు దివంగత రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ(Jayakrishna Ghattamaneni, )హీరోగా నటిస్తున్న ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాకు కూడా అదే తేదీ సెంటిమెంట్ కొనసాగుతుండటంతో ఘట్టమనేని అభిమానులు దీనిని శుభసూచకంగా భావిస్తున్నారు.
వైజయంతి మూవీస్‌తో మరో అనుబంధం:
మహేష్ బాబును హీరోగా పరిచయం చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అప్పట్లో ‘రాజకుమారుడు’ చిత్రాన్ని నిర్మించింది. అయితే ఇప్పుడు అదే సంస్థ తో ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాను సమర్పించడం మరో ఆసక్తికరమైన అంశంగా మారింది అంటూ ఫ్యాన్స్ హైలెట్ చేస్తున్నారు. ఈ పోలిక రెండు సినిమాల మధ్య ప్రత్యేక అనుబంధాన్ని తీసుకొచ్చిందని అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
also read:Soniya Singh :త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సిద్ధూ – సోనియా..!
మరో బాలీవుడ్ హీరోయిన్ ఎంట్రీ:
‘రాజకుమారుడు’ ద్వారా బాలీవుడ్ నటి ప్రీతి జింటా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తెలుగు ఆడియన్స్ కు దగ్గరైంది. ఇప్పుడు ఇదే తరహాలో ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాలో బాలీవుడ్ యువనటి రాషా తడానీ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. ఆమె కి ఈ సినిమా మంచి సక్సెస్ ని ఇస్తుంది అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ యాదృచ్ఛికం కూడా సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది.
also read:Janhvi Kapoor:వామ్మో..జాన్వీ కపూర్ మంత్లీ ఇన్‌స్టా ద్వారా అన్ని కోట్లు సంపాదిస్తుందా..?
భారీ అంచనాల మధ్య జయకృష్ణ లాంచ్:
దర్శకుడు అజయ్ భూపతి రూపొందిస్తున్న ఈ చిత్రం పూర్తిగా యాక్షన్, మిస్టరీ అంశాలతో తెరకెక్కుతోంది. ఇప్పటికే సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా మహేష్ బాబుకు కెరీర్ ఆరంభంలో కలిసి వచ్చిన తేదీ, బ్యానర్, కొత్త హీరోయిన్ వంటి సెంటిమెంట్లు ఇప్పుడు జయకృష్ణకు కూడా అదృష్టాన్ని తీసుకొస్తాయా అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.


