Wednesday, July 22, 2026
HomeLATESTJanhvi Kapoor:వామ్మో..జాన్వీ కపూర్ మంత్లీ ఇన్‌స్టా ద్వారా అన్ని కోట్లు సంపాదిస్తుందా..?

Janhvi Kapoor:వామ్మో..జాన్వీ కపూర్ మంత్లీ ఇన్‌స్టా ద్వారా అన్ని కోట్లు సంపాదిస్తుందా..?

Janhvi Kapoor:బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో ఆదాయం పొందుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఒక్కో బ్రాండ్ ప్రమోషన్‌కు భారీ మొత్తాన్ని వసూలు చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Janhvi Kapoor:”జాన్వీ కపూర్”.. ఈ పేరు గురించి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరమే లేదు. అందరికీ తెలిసిన అందాల ముద్దుగుమ్మ. శ్రీదేవి(Sridevi) కూతురు జాన్వి కపూర్ అని ఇన్నాళ్లు పిలుచుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం స్టార్ హీరోయిన్ జాన్వి కపూర్ అంటూ జనాలు ఆమె క్రేజ్ ని అమాంతం పెంచేస్తున్నారు. రీసెంట్గా ఆమె రామ్ చరణ్ సరసన “పెద్ది” సినిమాలో నటించింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అయినా ఆమెకి మాత్రం పేరు రాలేకపోయింది. అయితే జాన్వి కపూర్(Janhvi Kapoor) సంపాదన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. జాన్వి కపూర్ సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్(Instagram), ట్విట్టర్ వంటి వేదికలలో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఆమె ప్రముఖ దేశీయ-అంతర్జాతీయ బ్రాండ్లకు ప్రచారకర్తగా కూడా వ్యవహరిస్తుంది. దీంతో జాన్వి సోషల్ మీడియా అకౌంట్లో బ్రాండ్ ప్రచారానికి ప్రధాన వేదికలుగా మారాయి.

ఒక్క పోస్ట్ కి లక్షల్లో పారితోషకం:

డిజిటల్ మార్కెటింగ్ వర్గాలల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం .. జాన్వి కపూర్ ఒక్క స్పాన్సర్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా లేదా రీల్ కు సుమారు 7 లక్షల నుంచి 10 లక్షల వరకు చార్జ్ చేస్తుంది అంటూ టాక్. అలాగే ఎక్స్‌లో చేసే బ్రాండెడ్ పోస్టులకు కూడా లక్షల్లోనే పారితోషకం తీసుకుంటుంది అని ప్రచారం జరుగుతుంది. ప్రముఖ బ్రాండ్లతో దీర్ఘకాలిక ప్రచార ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటున్నట్లు సమాచారం.

- Advertisement -
Advertisement

also read:Trisha Krishnan: “ఇది మూడోసారి.. ఇక మారరా మీరు?”..త్రిష ఫుల్ సీరియస్..!

నెలకు కోట్లల్లో డిజిటల్ ఆదాయం :

ప్రతి నెల పలు లైఫ్ స్టైల్, ఫ్యాషన్, బ్యూటీ, టెక్నాలజీ బ్రాండ్లకు సంబంధించిన ప్రచార పోస్టులను జాన్వి షేర్ చేస్తూ ఉంటుంది. మార్కెట్ అంచనాల ప్రకారం సోషల్ మీడియా ప్రచారాల ద్వారానే ఆమె నెలవారి ఆదాయం దాదాపు 1.5 కోట్లకు పైగా ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. డిజిటల్ బ్రాండ్ విలువల పరంగా బాలీవుడ్ లో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణుల్లో జాన్వి ఒకరిగా గుర్తింపు పొందింది.

- Advertisement -
Advertisement

also read:Ott :డ్యాన్స్‌లో దాగిన దెయ్యాల రహస్యం.. ఓటీటీలోకి వచ్చిన సూపర్‌నేచురల్ హారర్ మూవీ!

సినిమాల్లోనూ భారీ రెమ్యూనరేషన్:

డిజిటల్ ప్రచారాలతో పాటు సినిమాల ద్వారా కూడా జాన్వికపూర్ భారీ ఆదాయం పొందుతుంది. బాలీవుడ్ లో ఒక్కొక్క చిత్రానికి సుమారు 5 కోట్ల నుంచి 7 కోట్ల వరకు పారితోషకం అందుకుంటుంది అని సినీవర్గాలు చెబుతున్నాయి. ఇక టాలీవుడ్ లో దేవర చిత్రం ద్వారా అరంగేట్రం చేసిన ఈమె “దేవర” సినిమాకు మూడు కోట్లు పారితోషకం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇక రీసెంట్గా వచ్చిన “పెద్ది” సినిమా కోసం ఆమె ఏకంగా 5 కోట్ల పారితోషకం తీసుకుంది అంటూ వార్తలు వినిపించాయి. దీనిపై అధికారిక సమాచారం ఏది లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం బాగా ట్రెండ్ అవుతుంది.

- Advertisement -
Advertisement

సోషల్ మీడియా ప్రభావం ,బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, సినిమాల్లో వరుస అవకాశాలు.. ఈ మూడు రంగాలలోనూ జాన్వి మార్కెట్ విలువను మరింత పెంచుకుంటూ ముందుకు సాగుతుంది. త్వరలోనే ఈ సంఖ్య డబుల్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు అభిమానులు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you