Singeetham Srinivas Rao:తెలుగు సినీ పరిశ్రమలో తాజాగా విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ గా పేరు సంపాదించిన సింగీతం శ్రీనివాసరావు కన్నుమూశారు.. ప్రస్తుతం ఈయన వయసు 94 సంవత్సరాలు. గత కొద్ది కాలంగా వయోభారంతో బాధపడుతూ చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రోజున తుదిశ్వాస విడిచారు. ఈయన మృతితో సినీ పరిశ్రమలో ఒక్కసారిగా విషాదఛాయలు ఏర్పడ్డాయి.. భారతీయ సినీ చరిత్రలోనే ప్రయోగాలకు, సృజనాత్మకతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు(Singeetham Srinivas Rao) లేరనే విషయం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సింగీతం శ్రీనివాసరావు కేవలం దర్శకుడే కాకుండా రచయిత , సంగీత దర్శకుడుగా కూడా పేరు సంపాదించారు.
మూకీ చిత్రాల నుండి సైన్స్ ఫిక్షన్ వరకు..
కథ, విజువల్స్ రూపకల్పనలో ఆయన చూపించిన వైవిధ్యం ఇండియన్ సినీ చరిత్రను సరికొత్త శిఖరాలకు తీసుకువెళ్లిందని చెప్పవచ్చు. కేవలం ఒకే రకమైన కథలకే పరిమితం కాకుండా మూకీ చిత్రాల నుంచి సైన్స్ ఫిక్షన్ వరకు అలాగే జానపద చిత్రాల నుంచి మ్యూజికల్ ఫాంటసీల వరకు తనదంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. అందుకే ఆయన్ని భారతీయ ప్రయోగాత్మక సినిమాకి “విజనరీ ఆర్కిటెక్” అని పిలుస్తూ ఉంటారు. సింగీతం శ్రీనివాసరావు 1987లో పుష్పక విమానం అనే మాటలు లేని మూవీ చిత్రాన్ని రూపొందించారు.
also read:Bhagya shri Borse: మినీ స్కర్ట్ లో గ్లామర్ షో ప్రదర్శిస్తున్న భాగ్యశ్రీ బోర్సే.. ఫోటోలు వైరల్!
టైం ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ గా సరికొత్త చరిత్ర..
కేవలం ఆ సినిమాలోని పాత్రలు నేపద్య సంగీతంతోనే ప్రేక్షకులను నవ్వించి ఏడిపించారు.. 1991లో బాలకృష్ణ కథానాయకుడుగా వచ్చిన ఆదిత్య 369 సినిమా దక్షిణాది భారత దేశంలోనే మొట్టమొదటి టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ సినిమాగా సరికొత్త చరిత్రను సృష్టించింది. భూతకాలం భవిష్యత్తు అనుసంధానాన్ని చూపిస్తూ జరకెక్కించిన తీరు అద్భుతంగా ఆకట్టుకుంది. అలాగే భైరవద్వీపం సినిమా కూడా అందరిని ఆశ్చర్యపరిచేలా గ్రాఫిక్స్ వింతలను వెండితెర పైన ఆవిష్కరించారు. కమలహాసన్ తో చేసిన అపూర్వ సహోదరులు , మైకేల్ మదన కామరాజు, విచిత్ర సోదరులు వంటి చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
also read:RanaBali:విజయ్ ముందే మీసం మెలేస్తూ తొడ కొట్టిన రష్మిక.. వీడియో వైరల్!
సింగీతం శ్రీనివాసరావు చివరి సినిమా..
క్లాసికల్ డాన్స్ నేపథ్యంలో వచ్చిన మయూరి వంటి సినిమాలను కూడా తెరకెక్కించారు. ఆయన క్రియేటివిటీ వల్ల ఇండియన్ సినిమా ప్రపంచ స్థాయికి చేరుకుందని చెప్పవచ్చు. తన 50 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుతాలకు ప్రాణం పోసిన సింగీతం శ్రీనివాసరావు ఇటీవల క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్వహణలో సింగ్ గీతం అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. తన 94వ ఏట వైజయంతి మూవీస్ , నాగ్ అశ్విన్ నిర్మాణంలో దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంతో.. తన క్రియేటివిటీ ఏ మాత్రం తగ్గలేదని ఎంతోమంది ప్రశంసలు కురిపించారు.. ఈ చిత్రం ఈ ఏడాది జూన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదే ఆయన చివరి సినిమా కావడం గమనార్హం.సింగీతం శ్రీనివాస్ సినిమానే శ్వాసగా బతికిన దిగ్గజ భారతీయ డైరెక్టర్ గా పేరు సంపాదించారు. ఈయన కెరియర్ లో రెండు జాతీయ పురస్కారాలు, ఐదు నంది అవార్డులు, పలు ఫిలింఫేర్ అవార్డులు కూడా అందుకున్నారు.




