Suman:సినిమా అంటే కచ్చితంగా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని ఎంటర్‌టైన్‌మెంట్ గా ఫీల్ అవ్వాలి. ఉన్న కష్టాలు, బాధలు మర్చిపోయి సరదాగా కాసేపు ప్రశాంతంగా నవ్వుకోవాలి. గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి.. ఈ కాలంలో అలాంటి సినిమాలు ఏవైనా వస్తున్నాయా? వందలో ఒకటి అంతే. ఎక్కడ చూసినా సరే.. అయితే ముద్దులు, లేదంటే హగ్గులు, లేదంటే ఇంకా దానికి మించి బట్టలు విప్పి దారుణాతి దారుణమైన సీన్లు.. ఇలాంటివే ఈ మధ్యకాలంలో ఎక్కువగా డైరెక్టర్లు ఎక్కిస్తున్నారు అని అభిప్రాయం అందరికీ ఉంది.
చాలా మటుకు ఈ మధ్యకాలంలో అలాంటి సినిమాలే వస్తున్నాయి. అయితే బీప్ సౌండ్ లేదంటే కళ్లుమూసుకుని చూసే సీన్లు కాకుండా.. కుటుంబమంతా కలిసి హ్యాపీగా థియేటర్‌లో కూర్చొని చూసే సినిమాలు ఈ మధ్యకాలంలో చాలా అరుదుగా వస్తున్నాయి. కానీ ఒకప్పుడు మాత్రం కుటుంబ సమేతంగా హ్యాపీగా కలిసి కూర్చొని ఎంజాయ్ చేసే సినిమాలు ఎన్నో వచ్చేవి.
సినిమాల్లో పెరుగుతున్న అసభ్యకర సన్నివేశాలపై ఆవేదన :
దీనినే ప్రశ్నిస్తూ టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ (Suman)సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి. సుమన్ తన మనసులోని బాధను బయటపడుతూ.. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీ ఎటు పోతుందో అనిపిస్తుందని అన్నారు.
కుటుంబమంతా కలిసి కూర్చొని హ్యాపీగా నవ్వుకునే సినిమా అసలు తీయడం లేదని, కొందరు సినిమాల పేరుతో చెడును ఎక్కువగా చూపిస్తున్నారని, నెగెటివిటీని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ALSO READ:Saha Movie Review:‘సహ’ మూవీ రివ్యూ: ప్రేమ, పెళ్లి, బాధ్యతలు.. సినిమా ఎలా ఉందంటే?
చిన్నపిల్లలపై సినిమాల ప్రభావం గురించి ఆలోచించాలి :
ఇప్పుడు చిన్నపిల్లల చేతుల్లో ఫోన్లు ఉంటున్నాయి. ఆ ఫోన్లలో వచ్చే సీన్స్ వాళ్లపై ఎంత ప్రభావం చూపిస్తాయో అర్థం చేసుకోవాలని సుమన్ అన్నారు. ఈ మధ్యకాలంలో ఎన్ని సినిమాలు అలా చెత్తగా వచ్చాయి? సెన్సార్ ఈ విషయంలో ఏం చేస్తుంది? అని ఆయన ప్రశ్నించారు. కొందరు సినీ నిర్మాతలు, దర్శకులు కేవలం డబ్బు కోసమే సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అది చాలా తప్పు అని ఆయన అభిప్రాయపడ్డారు.
ALSO READ:Bethlehem Kudumba Unit:‘బెత్లెహెమ్ కుటుంబ యూనిట్’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?
సినిమా ఒక శక్తివంతమైన మీడియా :
సినిమా అనేది ఒక శక్తివంతమైన మీడియా అని సుమన్ అన్నారు. అది మనుషుల ఆలోచనలను చాలా వరకు మార్చగలదని తెలిపారు. దయచేసి అలాంటి చెత్త సినిమాలు తెరకెక్కించకుండా, మంచిగా సమాజానికి ఉపయోగపడే సినిమాలను రూపొందించాలని ఆయన కోరారు.
కుటుంబమంతా కలిసి చూసి ఎంజాయ్ చేసే సినిమాలను తెరకెక్కిస్తే బాగుంటుందని అన్నారు. కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా సినిమాలను తీసేటప్పుడు.. సమాజానికి మనం ఏమి నేర్పిస్తున్నాం? సమాజానికి దీనివల్ల ఏమైనా ఉపయోగం పడుతుందా? అనే విధంగా ఆలోచించాలని సూచించారు.
సుమన్ వ్యాఖ్యలకు మద్దతు :
సమాజానికి మంచి మెసేజ్ ఆడియన్స్‌కు ఇచ్చే విధంగా సినిమాలను రూపొందిస్తే బాగుంటుందని సుమన్ విజ్ఞప్తి చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు చాలామంది మద్దతు తెలుపుతున్నారు.
ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో పనికిమాలిన, చెత్త సినిమాలు ఎక్కువగా వస్తున్నాయని కొందరు మండిపడుతున్నారు. కుటుంబమంతా కలిసి సినిమా చూడాలంటే భయం వేస్తుందని అంటున్నారు. సుమన్ మాట్లాడిన మాటలు చాలా చాలా కరెక్ట్ అంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.




