Tuesday, August 18, 2026
HomeLATESTOTT:కొరియన్ కనకరాజు"కు అదిరిపోయే ఓటీటీ డీల్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT:కొరియన్ కనకరాజు”కు అదిరిపోయే ఓటీటీ డీల్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT:మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

on
- Advertisement -banner Ad

OTT:మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన క్రేజీ మూమెంట్ రాబోతుంది. వరుణ్ తేజ్ తాజాగా నటించిన “కొరియన్ కనకరాజు” సినిమా ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇంకా పక్కాగా చెప్పాలంటే.. వరుణ్ తేజ్ సినిమాతో హిట్ కొట్టకపోతే ఆయన హీరో ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది అంటూ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపించాయి.

వరుణ్ తేజ్‌కు భారీ బూస్ట్:

కొరియన్ కనకరాజు సినిమా హిట్ అవ్వడం వరుణ్ తేజ్‌కు చాలా కీలకంగా ఉన్న సమయంలో.. ఆయన ఎటువంటి టెన్షన్స్ తీసుకోకుండా జనాలను ఎంటర్‌టైన్ చేయాలన్న ఉద్దేశంతోనే కొరియన్ కనకరాజు సినిమాను ఓకే చేశారు. అదే విధంగా షూటింగ్‌లో పాల్గొన్నారు. అంతే ప్రశాంతంగా సినిమా రిలీజ్ చేశారు. ఇక రిజల్ట్ కూడా అంతే ప్రశాంతంగా వచ్చింది.

- Advertisement -
Advertisement

వరుణ్ తేజ్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీగా కొరియన్ కనకరాజు నిలిచింది. చాలా కాలంగా హిట్ కోసం సతమతమవుతున్న వరుణ్ తేజ్‌కు మంచి బూస్ట్ ఇచ్చింది ఈ సినిమానే చెప్పాలి. గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత వరుణ్ నటించిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. వరుసగా డిజాస్టర్లు, పైగా సోషల్ మీడియాలో ట్రోలింగ్. ఎట్టకేలకు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన కొరియన్ కనకరాజు సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. వరుణ్ కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చింది.

ALSO READ:Nagababu:ఏపీ గ్రీన్ ఛైర్మన్‌గా నాగబాబు.. రాష్ట్ర భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు!

- Advertisement -
Advertisement

వరుణ్‌పై ప్రశంసల వర్షం:

ఆగస్టు 7న థియేటర్స్‌లో విడుదలై సందడి చేసిన ఈ కొరియన్ కనకరాజు సినిమా 50 కోట్ల క్లబ్‌లోకి కూడా చేరిపోయింది. రీజినల్ సినిమా పది రోజుల్లో 50 కోట్లు కలెక్ట్ చేయడం నిజంగా పెద్ద విజయం అనే చెప్పాలి. ఇప్పటికీ థియేటర్స్‌లో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్.

ALSO READ:Bigg Boss:రాజకుమారి ధైర్యానికి తెలుగు ప్రజలు ఇంప్రెస్… బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇస్తుందా

- Advertisement -
Advertisement

ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తికర ప్రచారం:

అయితే ఈ సినిమా ఓటీటీ(OTT) రిలీజ్ గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రాబోతుందట. కొరియన్ కనకరాజు సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. నెట్‌ఫ్లిక్స్ సంస్థ దాదాపు రూ.26 కోట్లు పెట్టి కొరియన్ కనకరాజు ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది అంటూ ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 10 లేదా 11న ఓటీటీలోకి వచ్చేస్తుంది అంటూ టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రాబోతుందట. థియేటర్లలో మిస్ అయిన జనాలు ఈ సినిమాను ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు అంటూ ఫ్యాన్స్ అంటున్నారు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you