Monday, August 24, 2026
HomeLATESTBigg Boss :బిగ్ బాస్ తెలుగు 10 అగ్నిపరీక్షలో అదరగొడుతున్న కామన్ గర్ల్!

Bigg Boss :బిగ్ బాస్ తెలుగు 10 అగ్నిపరీక్షలో అదరగొడుతున్న కామన్ గర్ల్!

Bigg Boss :బిగ్ బాస్ తెలుగు 10 అగ్నిపరీక్ష సీజన్ 2లో షాలిని పటేల్ తన టాస్క్‌లతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

on
- Advertisement -banner Ad

Bigg Boss :బిగ్‌బాస్ 10 అగ్నిపరీక్ష సీజన్ 2 ఎలా ముందుకు వెళ్తుందో  అందరికీ తెలిసిందే. కామనర్స్ నుంచి హౌస్‌లోకి వెళ్లే వారిని అగ్నిపరీక్షలో ఫిల్టర్ చేస్తున్నారు. రకరకాల టాస్కులు ఇస్తూ కామన్ పీపుల్స్ సహనాన్ని పరీక్షిస్తున్నారు. కొంతమంది స్టార్ సెలబ్రిటీస్ మాత్రం ఎటువంటి పరీక్షలు లేకుండా డైరెక్ట్‌గానే హౌస్‌లోకి వెళ్లే ఛాన్స్ కొట్టేశారు. కానీ కామనర్స్‌కు మాత్రమే ఇలాంటి కష్టాలు, ఇలాంటి బిగ్ టాస్కులు ఏంటి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కంటెస్టెంట్స్:

అయితే మరోపక్క బిగ్‌బాస్‌లోకి (Bigg Boss )వెళ్లే కామనర్స్ డీటెయిల్స్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. అగ్నిపరీక్ష ప్రోమోలను బిగ్‌బాస్ టీమ్ విడుదల చేస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఓ ప్రోమోలో అందరి దృష్టిని ఆకర్షించింది ఓ అమ్మాయి. బిగ్‌బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష షో ద్వారా కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిన ప్రముఖ కంటెస్టెంట్ షాలిని పటేల్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.

- Advertisement -
Advertisement

ALSO READ:OTT:8 వారాల ఓటీటీ రూల్.. చిన్న నిర్మాతలకు కొత్త టెన్షన్!

అసలు ఎవరీ షాలిని పటేల్?:

అసలు ఆమె ఎవరు? ఆమె రియల్ లైఫ్ ఏంటి? ఆమె కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది? అంటూ సోషల్ మీడియాలో ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి. శాలిని గురించి తెలుసుకోవడానికి తెగ గూగుల్ సెర్చ్ చేస్తున్నారు కుర్రాళ్లు. షాలిని పటేల్ క్యూట్ ఫొటోలను పెట్టి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు. షాలిని సాధారణ డిజిటల్ కంటెంట్ క్రియేటర్. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించి అభిమానులను సంపాదించుకుంది. బోల్డ్ అండ్ గట్స్ ఉన్న అమ్మాయిగా బిగ్‌బాస్ హౌస్ టైమ్‌లో తెలుగు అగ్నిపరీక్షలో మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. టాస్క్‌లలో ఎంతైనా తెగించి ఆడే మనస్తత్వం ఉన్న అమ్మాయిగా ఇప్పటికే బయట బాగా ట్రెండ్ అయిపోతుంది.

- Advertisement -
Advertisement

ALSO READ:Yash :టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. కారణం ఇదేనా?

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు:

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఫ్యాషన్, రీల్స్, డిజిటల్ కంటెంట్‌తో యాక్టివ్‌గా ఉండే ఈ షాలిని ఇప్పుడు బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో కూడా కనిపిస్తుంది. వేలాదిమంది నుంచి ఎంపికైన కామన్‌మెంట్ ప్లేయర్లలో ఒకరిగా అగ్నిపరీక్షలో పాల్గొన్న షాలిని, ఇప్పుడు కచ్చితంగా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేంత కెపాసిటీ ఉన్న అమ్మాయి అన్న టాక్ సొంతం చేసుకుంది.

- Advertisement -
Advertisement

టాస్క్‌లలో షాలిని దూకుడు:

అగ్నిపరీక్ష షో టాస్క్‌లలో షూ క్లీన్ చేయడం, డర్టీ వెజిటేబుల్ బాక్స్ వంటి వాటిల్లో ఆమె ప్రదర్శన నిజంగా అద్భుతం అంటూ నెటిజన్లు పొగిడేస్తున్నారు. ఆమె ధైర్యసాహసాలను మెచ్చి ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బిగ్‌బాస్ సీజన్ 10 ప్రధాన షోలోకి అడుగుపెట్టే టాప్ 15 కంటెస్టెంట్ల జాబితాలో షాలిని ఒకరు. టాస్కర్‌లా చూపించే గట్స్, ఒరిజినాలిటీతో మెయిన్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశం సాధించే దిశగా పోటీ పడుతుంది. ఎంత పెద్ద టాస్క్ అయినా సరే.. అది ఎమోషనల్, కాంట్రవర్సీతో కూడుకున్నదైనా, ఎలాంటి టాస్క్ అయినా ఆమె పూర్తి ఫోకస్ పెడుతూ ఇచ్చిన టాస్క్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయడమే ఆమె స్పెషాలిటీగా ఆమె గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు.

https://www.instagram.com/p/DcMQ4l8j_OL/?utm_source=ig_web_copy_link&igsi=NTc4MTIwNjQ2YQ==

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you