OTT:సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఒక లొల్లి జరుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు రెమ్యూనరేషన్, కొన్నిసార్లు థియేటర్ల కేటాయింపు, మరికొన్నిసార్లు ఇంకొక రకమైన గొడవలు. ఇప్పుడు మాత్రం ఓటీటీ పెద్ద తలనొప్పులు తెచ్చిపెట్టేలా అనిపిస్తుంది. తమిళ సినిమా ఇండస్ట్రీలో సెప్టెంబర్ 1 నుంచి కొత్త సినిమా రిలీజ్‌లను పూర్తిగా ఆపేస్తామంటూ ఇప్పటికే నిర్మాత సంఘాలు ప్రకటించడం పెద్ద సీరియస్‌గా మారిపోయింది. షూటింగ్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా నిలిపివేస్తామని ఘాటుగా చెప్పడంతో కొత్తగా తలనొప్పులు స్టార్ట్ అవుతాయా అన్న చర్చలు జరుగుతున్నాయి.
అసలు సమస్య ఓటీటీతోనేనా?:
బయటకు చూస్తే ఇది నిర్మాతలు, థియేటర్ల యాజమాన్యాల మధ్య గొడవలా అనిపించినా, అది అసలు కారణం కానేకాదని అంటున్నారు ప్రముఖులు. ఇది పూర్తిగా ఓటీటీకి (OTT)సంబంధించిన సమస్య అంటున్నారు. సాధారణంగా కొత్త సినిమా థియేటర్‌లోకి వచ్చిన తర్వాత కనీసం నాలుగు వారాల దగ్గరగా ఓటీటీలోకి వస్తుంది. అయితే ఇప్పుడు మాత్రం దాన్ని పూర్తిగా ఎనిమిది వారాలకు పెంచాలంటూ థియేటర్ యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్ చేస్తున్నారట. దానికి నిర్మాతలు రాతపూర్వకంగా ఒప్పుకుంటేనే సెప్టెంబర్ 1 తర్వాత సినిమాలను ప్రదర్శిస్తామంటూ కూడా నిర్ణయించుకున్నారట.
ALSO READ:Yash :టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. కారణం ఇదేనా?
పెద్ద సినిమాలకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు:
పెద్ద స్టార్ సినిమాకు ఇది బాగానే వర్కౌట్ అవ్వచ్చు. ఎందుకంటే పెద్ద స్టార్ సినిమా ఎటువంటి ప్రమోషన్స్ లేకపోయినా కచ్చితంగా రిలీజ్ అయిన రెండు మూడు రోజుల్లోనే పెట్టిన దానికి డబుల్ వసూళ్లు వచ్చేస్తాయి. అలాంటి సందర్భాలు ఎన్నో చూశాం. మంచి టాక్ ఉంటే తర్వాత కూడా పరిస్థితి బాగుంటుంది.
ALSO READ:Hyper Aadi:హైపర్ ఆది టంగ్ స్లిప్..NTR ఫ్యాన్స్ ఫైర్..మధ్యలో మహేశ్ ఎందుకు వచ్చాడు..?
చిన్న సినిమాల పరిస్థితి పూర్తిగా వేరు:
కానీ చిన్న సినిమాల పరిస్థితి టోటల్‌గా వేరు. మొదటి వీకెండ్‌లోనే టాక్ కుదరకపోతే రెండో వారం నుంచి అసలు జనాలు థియేటర్లకు రారు. స్క్రీన్లు కూడా తగ్గిపోతాయి. అప్పుడు ఈ ఓటీటీ డీల్ చాలా చాలా ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉంటుంది. అలాంటి సినిమాకు థియేటర్ అయిపోయినా ఓటీటీ కోసం మరో నెలకు పైగా వెయిట్ చేయాల్సి వస్తే నిర్మాతల లెక్కలు మరింత తారుమారైపోయి ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టివేయొచ్చు.
ఓటీటీ డీల్స్‌పై కూడా ప్రభావం:
ఓటీటీలు కూడా ఇప్పుడు సినిమా బిజినెస్‌లో ఒక విషయం అయిపోయాయి. చిన్న విషయం కానే కాదు.. పెద్ద విషయమే అని చెప్పాలి. కొన్ని సినిమాలు థియేటర్ నుంచి ఎంత వస్తుందన్న దానికంటే ముందే డిజిటల్ హక్కుల ద్వారా ఎంత వస్తుందో కూడా ఒక లెక్క వేసేసుకుంటున్నారు. రిలీజ్ తర్వాత నాలుగు వారాలకు ఓటీటీలో వస్తుందని ముందే ఒప్పందం జరిగితే, ఇప్పుడు అది కాస్త ఎనిమిది వారాల రూల్ పెడితే ఓటీటీ వాళ్లు బాగా నష్టపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటి డీల్స్ కూడా మారిపోతాయి. ఇదే నిర్మాతల వైపు నుంచి వస్తున్న పెద్ద అభ్యంతరాలలో ఒకటి.
ప్రేక్షకులపై ప్రభావం ఎలా ఉంటుంది?
సినిమా నాలుగు వారాల్లో ఇంటికి వస్తుందని ముందే తెలిసిపోతే కొంతమంది ప్రేక్షకులు అసలు థియేటర్‌కి రావడమే మానేసి, వచ్చినప్పుడు చూద్దాంలే అంటూ వెయిట్ చేస్తున్నారు. అందుకే కనీసం 8 వారాల గ్యాప్ ఉంటే కచ్చితంగా కొంతమంది అయినా థియేటర్‌కి వచ్చి సినిమా చూస్తారు. థియేటర్ రన్‌కు కొంత ఊపిరి వస్తుంది అనే వాదన కూడా వినిపిస్తుంది.ఓటీటీలో రూల్స్ మారిస్తే అది ఓటీటీకి, తర్వాత థియేటర్‌కు.. రెండింటికీ ఇబ్బందులు కలిగించే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు ప్రముఖులు. దీనిపై నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది ప్రశ్నార్థకంగా మారింది.
సెప్టెంబర్ 1పైనే అందరి చూపు:
ఇప్పుడు అందరి చూపు సెప్టెంబర్ 1పైనే ఉంది. నిజంగానే నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య లెక్క కుదిరితే రిలీజ్ క్యాలెండర్ యథావిధిగా సాగుతుంది. లేదంటే మాత్రం సినిమా రిలీజ్ అయిన తర్వాత కచ్చితంగా ఎనిమిది వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే విధంగా రూల్ పెట్టుకుంటే మాత్రం కచ్చితంగా కొంత లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి.. దీనిపై ఫైనల్‌గా ఎలాంటి డెసిషన్‌కి వస్తారనేది..




