Nani The Paradise:టాలీవుడ్ లో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం ది ప్యారడైజ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగానే కలెక్షన్స్ రాబడుతోంది. మొదటి షోకే మిక్స్డ్ టాక్ సంపాదించుకున్నప్పటికీ.. కలెక్షన్స్ పరంగా బాగానే రాబడుతోంది. ఇప్పటికి ఈ సినిమా రెండు రోజులకే రూ. 114 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించారు. హీరోయిన్గా కయాదు లోహర్ నటించారు ..వీరితోపాటుగా మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు, సోనాల్ కులకర్ణి తదితర నటీనటులు ప్రధాన పాత్రలలో నటించారు.
ఈ సినిమాలో మొదటి ఎంపిక కయాదు కాదా..
ఇదంతా ఇలా ఉండగా.. ఒకవైపు కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ప్యారడైజ్(Nani The Paradise) సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అదేమిటంటే ఈ చిత్రంలో మొదట హీరోయిన్ కోసం ప్రముఖ నిర్మాతలు కయాదులోహర్ ను ఎంపిక చేయలేదట. ఒక స్టార్ హీరోయిన్ ను అనుకున్నారు కానీ ఆమె ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో ఆ పాత్ర కయాదులోహర్ కు వరించినట్లు తెలుస్తోంది. మొదట సుబ్బు పాత్ర కోసం దర్శక నిర్మాతలు అనుకున్న హీరోయిన్ ఎవరో కాదు జాన్వీ కపూర్. దేవర చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని మరి రాంచరణ్ నటించిన పెద్ది సినిమాలో కనిపించింది.
also read:Sampoornesh Babu: స్టేజ్ పైన సంపూర్ణేష్ బాబు ఎమోషనల్ కామెంట్స్..!
అందుకే జాన్వి కపూర్ రిజెక్ట్ చేసిందా?
అటు దేవర, పెద్ది సినిమాలలో నటించిన జాన్వీ కపూర్ అందులో ఆయా పాత్రలకు పెద్దగా ఈమెకు పేరు రాలేదు.. కేవలం హీరోయిన్ గ్లామర్ కోసం మాత్రమే తీసుకున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ వినిపించాయి. ప్యారడైజ్ సినిమాలో కూడా అలాంటి పాత్ర ఉండడంతో జాన్వీ కపూర్ ఈ సినిమాని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో దర్శక నిర్మాతలు సుబ్బు పాత్ర కోసం కయాదును ఎంపిక చేశారని తెలుస్తోంది. ఒకవేళ అన్ని అనుకూలించి జాన్వీ కపూర్ ఈ పాత్ర చేసి ఉంటే రిజల్ట్ ఎలా ఉండేదో అంటూ సినిమాలో లెక్కలు వేసుకుంటున్నారు అభిమానులు.
also read:Nani:”నాని” టోటల్ చీటింగ్.. ‘ది ప్యారడైజ్’కు కొత్త తలనొప్పి..!
నెగిటివ్ టాక్ వచ్చినా.. తగ్గని జోరు..
ది ప్యారడైజ్ సినిమా విషయానికి వస్తే.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పైన సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు , తమిళ్ ,కన్నడ, మలయాళం, హిందీ వంటి భాషలలో విడుదల చేయగా రెస్పాన్స్ బాగానే లభించింది. సంగీతాన్ని అనిరుధ్ అందించగా ప్లస్ గా మారింది. శనివారం రోజున ప్యారడైజ్ సినిమాకి సంబంధించి సక్సెస్ మీట్‌ని ఏర్పాటు చేయగా.. అందులో పలువురు సినీ సెలబ్రిటీలు హీరో నానితో పాటుగా డైరెక్టర్ ఈ సినిమాకి సంబంధించి ఎమోషనల్ జర్నీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు. ఇప్పటికే ది ప్యారడైజ్ సినిమా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. మరి ముందు ముందు ఎన్నెన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.




